Suryaa.co.in

Andhra Pradesh

నేను ఉన్నాను.. నేను విన్నాను అన్నావు…ఇప్పుడు ఎక్కడ ఉన్నావు?

మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య 

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పావలా ఇస్తే అధికార పార్టీ నాయకులు ముప్పావలా దోచుకొని దాచుకుంటున్నారు.రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణాలు ఏమిటో ప్రజావేదికగా అధికార పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి.తాడేపల్లి రాజ ప్రసాదాలు వీడి ఒక్కసారి ప్రజాక్షేత్రంలోకి రండి జగన్మోహన్ రెడ్డి.మీరు ప్రజాక్షేత్రంలోకి రావాలంటే మీ చుట్టూ 144 సెక్షన్ మీ తాడేపల్లి రాజప్రసాదం చుట్టూ పోలీసు బలగాలు.బాదుడే బాదుడు ఈ మాటలు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా జగన్మోహన్ రెడ్డి ?

దేశంలో అత్యధిక పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ పాలనదక్షతతో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది.రాష్ట్ర మంత్రులు ఉన్నారంటే బూతులు మాట్లాడటం, బెట్టింగులు కాయడం తప్ప మరేమీ చేతకాదు.పంటలు దెబ్బతిని రైతులు బోరు మంటుంటే ఏనాడైనా మంత్రులు పొలంలోకి దిగి పంటలను పరిశీలించారా?రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ ఎక్కి గాలిలో ఏరియల్ సర్వే చేసి రాజ ప్రసాదానికి చేరుకోవడం తప్ప రైతన్నకు చేసిందేమీ లేదు.అవగాహన లేని మంత్రులు, ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి పాలకులుగా ఉండటం ఆంధ్రులుగా మనం చేసుకున్న దౌర్భాగ్యం.

ఆనాడు నీ మాటలు విని ఓట్లు వేసి ఈనాడు ఉద్యోగస్తులు అందరూ రోడ్డునా పడ్డారు.అధికార పార్టీ నాయకులు దేనిని వదలడంలేదు ల్యాండ్,సాండ్,మైన్, వైన్.గుట్టలు, కొండలు ఇప్పటికే పూర్తిగా కొట్టేశారు.కంచికచర్ల నుంచి మధిర రోడ్డు రహదారికి అధికార పార్టీ నాయకులు ఎన్ని ముహూర్తాలు పెట్టారో? ఎన్ని సార్లు శంకుస్థాపనలు చేశారో? ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలి.ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన రోడ్డు దుస్థితి అడగడానికి మేము వస్తే మా పైనే వైసీపీ పార్టీ గుండాల చేత దాడులు చేయించారు.ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, భౌతిక దాడులు ఇదేనా మీ పరిపాలన?లోటు బడ్జెట్ లో ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ ని గడచిన 5 ఏళ్లలో పురిటిలో బిడ్డను సాకినట్లుగా సాకి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనుడు నారా చంద్రబాబునాయుడు .

రాష్ట్ర ప్రజానీకం ఈ రెండున్నర ఏళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వ తీరును చూశారు రానున్న రోజులలో వైసీపీ పార్టీకి చరమగీతంపడి తగిన బుద్ధి చెప్తారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు , మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ , దేవినేని ఉమామహేశ్వరరావు , మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ కరోనా బారి నుంచి త్వరితగతిన కోలుకోవాలని వి.అన్నవరం గ్రామంలో సాయిబాబా, ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తంగిరాల సౌమ్య.

LEAVE A RESPONSE