-మీ పిచ్చి పరాకాష్టకు చేరింది
-పోలీసు వారు అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నారు
– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
నందిగామ టౌన్ : నందిగామ పట్టణ గాంధీ సెంటర్ అన్న క్యాంటీన్ వద్ద ఈ రోజు కుప్పం అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేయటాన్ని ఖండిస్తూ తెదేపా శ్రేణులతో కలసి నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ..కుప్పంలో నారా చంద్రబాబునాయుడు గారు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వస్తుంటే వైసీపీ గుండాలు ఆ క్యాంటీన్ ధ్వంసం చేశారు దీనిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము.
వైసీపీ పాలన వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రౌడీ రాజ్యమేలుతోంది రాక్షస పాలన, పులివెందుల పంచాయతీలునువ్వు రాగానే పేదవాడికి పట్టేడన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను మాయించి వేశావు. నువ్వు పెట్టవు పెట్టే వాళ్ళని పెట్టనివ్వవు. సిగ్గుండాలి నీకు చేతనైతే నీ పౌరుషం పేదవాడికి అన్నం పెట్టిచ్చే దానిలో చూపించు.రాష్ట్రమంతటా తిరిగి అన్న క్యాంటీన్లు తెరిపించి పేదవారికి అన్నం పెట్టు.
రాష్ట్రమంతటా పోలీసుల జులుం నశించాలి. పోలీసు వారు అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటి పేదవాడికి పట్టెడన్నం పెట్టడం నేరమా? చేసే మంచి పనిని వైసీపీ గుండాలు నాశనం చేస్తే పోలీసు వారు వారిని కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు డీజీపీ సిగ్గుపడాలి ఈ వైసీపీ పాలన మూడు సంవత్సరాల కాలంలో ఇటువంటి చాలా సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. జగన్ రెడ్డి ఓపెన్ సవాల్ మీకు పౌరుషం ఉంటే తిరిగి అన్న క్యాంటీన్లను తెరిపించండి పేదవాడికి అన్నం పెట్టండి.
మీ పిచ్చి పరాకాష్టకు చేరింది ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామా అని ప్రజలు వేచి చూస్తున్నారు.రానున్న ఎన్నికలలో రాష్ట్ర ప్రజానీకం మిమ్మల్ని గద్దె దింపటం ఖాయమని మేము హెచ్చరిస్తున్నాము