మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
నందిగామ టౌన్ : నందిగామ పట్టణం మంగళవారం నాడు ఉదయం మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య తన కార్యాలయంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. నందిగామ నగర పంచాయతీ కమీషనర్ గారికి, టౌన్ ప్లానింగ్ మరియు మున్సిపల్ అధికారులకు నందిగామ టౌన్ లో వైసీపీ ఫ్లెక్సీలు కనిపించలేదా? నందిగామ అధికార పార్టీ అండతో పార్టీ కండువా కప్పుకొని చెలరేగి పోతున్న నందిగామ నగర పంచాయతీ కమిషనర్ గారు.
ప్రతిపక్ష పార్టీ వారి ఫ్లెక్సీ లు చూస్తే చాలు ఆఘమేఘాల మీద నిబంధనల పేరుతో తీసివేయడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి. అధికార పార్టీ వారు పెడితే మాత్రం వాటి జోలికి వెళ్ళటానికి కూడా సాహసం చేయడం లేదు నగర పంచాయతీ కమిషనర్ గారు.ఇదేమని అడిగిన వారికి మాత్రం తన దైన శైలిలో సమాధానం చెపుతున్న నగర పంచాయతీ కమిషనర్.మాకు పై నుండి ఆదేశాలు అంటారు.ఆ ఆదేశాలు మీకు అధికారులు ఇచ్చారా లేదా అధికార పార్టీ నాయకులు ఇస్తే మీరు తీసుకున్నారా?
నగర పంచాయతీ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు ఏకపక్ష ధోరణితో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు తొలగించడం పై ఉన్న శ్రద్ధ వైసీపీ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడంపై ఎందుకు లేదు?
మున్సిపల్ కమిషనర్ గారు నందిగామ నగర పంచాయతీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వైసీపీ కార్యకర్త గా పని చేస్తున్నారు. కమీషనర్ గారికి టౌన్ ప్లానింగ్ అధికారులకు మరియు మున్సిపల్ అధికారులకు ఒకటే చెప్తున్నా. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు ఈరోజు మీరు అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం తప్పక చెల్లించుకుంటారు.అధికార పార్టీ నాయకులకు బొమ్మ తిరగబడింది అని అర్థమైపోయి ఏమి చేయలేని స్థితిలో అధికారం అడ్డం పెట్టుకొని అధికారులతో ఇటువంటి చర్యలు చేపడుతున్నారు.
నియోజకవర్గ ప్రజానీకం అంతా గమనిస్తూనే ఉన్నారు ఓట్ల రూపంలో రానున్న ఎన్నికలలో అధికార పార్టీకి అట్టుకు అట్టునరా పెట్టడం ఖాయంఅధికారులు ప్రజా వ్యవస్థలో ప్రజలకు సేవకులుగా ఉండాలే తప్ప అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు.గత మూడు సంవత్సరాలుగా నందిగామ పట్టణంలో ఉన్న వైసీపీ పార్టీ ఫ్లెక్సీలను తొలగించకుండా యుద్ధప్రాతిపదికన తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను తొలగించవలసిన అవసరం ఏమిటి?
అధికార పార్టీ నాయకులు రోజురోజుకీ దిగజారుడు రాజకీయాలు చేయడం చాలా హేయమైన చర్య.ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఏ పార్టీ వారికి అయిన అధికారులు ఒకటే నిబంధనలను పాటించాలి అధికార పార్టీకి ఒకరకంగా, ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా వ్యవహరించాలని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా కమిషనర్ గారు దీనిపై బహిరంగ సమాధానం చెప్పాలి.
కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ అధికారులు తక్షణమే నందిగామ పట్టణంలో ఉన్న వైసీపీ పార్టీ అన్ని ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి. లేదా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను యధావిధిగా ఉన్న స్థానంలో నే కొనసాగించాలి.
లేనిపక్షంలో అధికారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు అన్నింటికీ సిద్ధమై అధికారులు ముందుకు కొనసాగండి. మున్సిపల్ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు తొలగించిన తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను వెంటనే యధావిధిగా వాటి స్థానంలో వాటిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం