– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్
కేసీఆర్‌పై బీజేపీ ఇన్చార్జి తరుణ్‌చుగ్ నిప్పులు చెరిగారు. నోవాటెల్ హోటల్ వద్ద మీడియాతో మాట్లాడిన చుగ్, బీజేపీని అణచివేయాలనుకునే కేసీఆర్ ఆటలు సాగవన్నారు. చుగ్ ఏమన్నారంటే..
తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులుసహా అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసీఆర్ పాలనలో ఉద్యోగాల్లేవు. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది. కేసీఆర్ ది మూగ-చెవిటి ప్రభుత్వం. ప్రజాస్వామ్య బద్దంగా తన కార్యాలయంలో ‘జాగరణ’ చేస్తున్న బండి సంజయ్ ను గ్యాస్ కట్టర్ తో గేట్లు కట్ చేసి అరెస్టు చేశారు. సీసీ పుటేజ్ ను ఎత్తుకెళ్లారు.
బండి సంజయ్ అంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకింత భయం? పోలీసుల దాడిలో 20 మందికిపైగా గాయపడ్డారు. ఇంకా కొందరు జైల్లో ఉన్నారు.కేసీఆర్… నీ ఉడుత ఊపులకు బీజేపీ భయపడే ప్రసక్తే లేదు.
బండి సంజయ్ నాయకత్వంలో కార్యకర్తలు చేస్తున్న పోరాటం ఆగదు. బండి సంజయ్ అరెస్టు… జలియన్ వాలాబాగ్ ను తలపించింది. సీఎం నుండి ఫోన్ వచ్చిందని గేట్లు బద్దలు కొట్టి అరెస్టు చేసిండ్రు. పోలీస్ కమిషనర్ జనరల్ డయ్యర్ ను తలపించిండు.
వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్ట, న్యాయపరంగా పోరాడతాం. బండి సంజయ్ ఎవరు? హిజుబుల్ టెర్రిరిస్టా? ఎల్టీటీటీఈ అనుకుంటున్నరా? ఆయనొక ఎంపీ… ఆయనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? నిన్న 40 మంది చిన్న పత్రికలు, సోషల్ మీడియా ప్రతినిధులను అక్రమంగా అదుపులోకి తీసుకుని టార్చర్ చేస్తున్నరు. తెలంగాణలో ఎలాంటి పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోండి.
తెలంగాణలో ప్రజలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటాలు కొనసాగుతాయి. టీఆర్ఎస్ ను గద్దె దించి తీరుతాం. బండి సంజయ్ ను ఉద్దేశించి ‘‘టైగర్ ఉన్నడు… జైలు నుండి వాపస్ వచ్చిండు.. ప్రతి కార్యకర్త బండి సంజయ్ మాదిరిగా టైగర్ల మాదిరిగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.