Suryaa.co.in

Andhra Pradesh

చట్టసభలు నిర్వహించాలంటే జగన్ కు భయం

– ప్రజా సమస్యలపై చర్చించాలంటే కనీసం 15రోజులు అసెంబ్లీ నిర్వహించాలి.
– ప్రతిపక్షం, ఎలాంటిచర్చ లేకుండానే ప్రజలకు సంబంధించిన 14 ఆర్డినెన్స్ లను ఆమోదిస్తారా?
• జగన్ విధానాలతో అన్నివర్గాలు నష్టపోయాయి. ఆర్థికఅసమానతలు, అప్పులు పెరిగిపోయాయి.
• ప్రభుత్వం చెబుతున్నట్లు సంక్షేమం అమలైతే, ప్రజల ఆర్థిక అసమానతలు ఎందుకు పెరిగాయి?
• జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలవడం కల్ల. ఆయన దిగిపోయే నాటికి రాష్ట్రంపై రూ.6లక్షలకోట్ల పైచిలుకు అప్పుఉంటుంది.
• జగన్ , ఆయన మనుషుల ఆదాయం పెరుగుతోంది తప్ప, ప్రజల ఆదాయం పెరగడంలేదు.
– శాసనమండలి టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు
రాజ్యాంగం గుర్తుచేయడంవల్లే, జగన్మోహన్ రెడ్డికి చాలారోజులతర్వాత అసెంబ్లీ పెట్టాలన్న ఆలోచనవచ్చిందని, అసెంబ్లీ నిర్వహణకు ఆరునెలల కంటే ఎక్కువ సమయం తీసుకోవడా నికి వీల్లేకపోవడంతో, గత్యంతరంలేకనే ముఖ్యమంత్రి అసెంబ్లీ నిర్వహిస్తున్నాడుతప్ప, లేకపోతే ఆ పనికూడాచేసేవాడుకాదని టీడీపీ సీనియర్ నేత, మండలిలో టీడీపీపక్షనేత యనమల రామకృష్ణుడు ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..
చట్టసభలు, న్యాయవ్యవస్థ అంటే గౌరవంలేని జగన్మోహన్ రెడ్డి, పోలీస్ అధికారవ్యవస్థలను తన జేబుసంస్థలుగా మార్చుకొని పాలనచేస్తున్నాడు. సాధారణంగా శాంతిభద్రతలు లేకపోతే, అభివృద్ధిఅనేదికూడా కుంటుపడుతుంది. గతంలో ప్రభుత్వం అసెంబ్లీసమావేశాలు నిర్వహించినప్పుడు బిల్లుల ఆమోదంపై శ్రద్ధపెట్టిందితప్ప, కనీసంచర్చలకు, ప్రశ్నలకు ఎక్కడా అవకాశమివ్వలేదు. కోవిడ్ ఉన్నప్పుడు, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగాయి. బడ్జెట్ పై కూడా అర్థవంతమైన చర్చజరిగింది, పార్లమెంట్ కు, ఇతరరాష్ట్రాల అసెంబ్లీల నిర్వహణకులేని కోవిడ్, ఏపీ అసెంబ్లీసమావేశాలకు మాత్రమే ఎందుకు అడ్డొస్తుంది? జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ పెట్టాలంటే ఎందుకంత భయం?
అసెంబ్లీ నిర్వహించాలంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడాలేని భయం పట్టుకుంది. ప్రజలను, ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ఆయనభయపడుతున్నాడు కాబట్టే, ఇంటినుంచి కూడా బయటకు రావడంలేదు. కోవిడ్ వంకతో ఒకరోజు మాత్రమే చట్టసభలు నిర్వహించడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 14 ఆర్డినెన్సులు సభల్లో ప్రవేశపెట్టి, చర్చలేకుండా ఆమోదిస్తే, అవి ప్రజలకుఎంతవరకు ఉపయోగపడతాయి? డిస్కషన్, డిబేట్ లేకుండా అధికారంలో ఉన్నవారు ఏకపక్షంగా బిల్లులు ఆమోదించడా న్ని టీడీఎల్పీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఆర్టికల్ 194 ప్రకారం చట్టసభల్లో మాట్లాడేహక్కు, సభ్యులకు ఉంది.
ప్రజలచేత ఎన్నుకోబడిన సభ్యులఅభిప్రాయాలు, ప్రజలఅభిప్రాయాలే అవుతాయి. ప్రజాభిప్రాయాలు చట్టసభల్లో వినిపించకుండా, ప్రజలహక్కులను ముఖ్యమంత్రి కాలరాస్తున్నారు. కనీసం 15రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నది టీడీపీ డిమాండ్. అకౌంటబులిటీ, రెస్పాన్స్ బులిటీ అనగానే జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నారు. రాజ్యాంగాన్ని, కౌల్ అండ్ షక్దర్ నిబంధనలు పక్కనపెట్టి, తనుఅనుకున్నదేచేస్తూ, ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు. తన చర్యలతో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడేకాదు, ప్రజలు,రాష్ట్రం తీవ్రంగా నష్టపోతు న్నాయి. అందుకు ప్రత్యక్షఉదాహరణ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రాకపోవడం. ఇప్పటికే రాష్ట్రపరువు ప్రతిష్టలు అంతర్జాతీయస్థాయిలో మంటగలిశాయి. దానిప్రభావంవల్లే రాష్ట్రానికి రూపాయి పెట్టుబడిలేదు.
రాష్ట్రంలో నిరుద్యోగం పెరగడానికి, ఆర్థికవ్యవస్థ పతనం కావడానికి, అగ్రికల్చర్, రూరల్ ఎకానమీ పడిపోవడానికి ముఖ్యమంత్రి విధానాలే కారణం. ఫైనాన్టియల్ స్టెబిలిటీ పోయింది. వీటన్నింటికీ బాధ్యతవహించాల్సినవారే, ప్రజలకు సమాధానంచెప్పాల్సివస్తుందని తప్పించుకుంటున్నారు. ఎకానమీ అనేది రాష్ట్రానికి బ్యాక్ బోన్ లాంటిది.. టీడీపీ హయాంలో దాదాపు 10.22శాతం గ్రోత్ రేట్ ఉంటే, ఇప్పుడు -2.8శాతం ఉంది. ఏరాష్ట్రంలోనూ ఇంతదారుణంగా గ్రోత్ రేట్ పడిపోలేదు. 13శాతం మైనస్ గ్రోత్ రేట్ లోఉంటే, రెవెన్యూస్ ఎలా పెరుగుతాయి? ఎక్సైజ్ పై వచ్చేఆదాయంతప్ప, అన్ని శాఖల్లో ఎకానమీ పడిపోయింది. దానికికారణం ఎకానమీ కొలాప్స్ అవడం. భవిష్యత్ లో రాష్ట్ర ఆర్థికవ్యవస్థను ఎవరూకూడా రిపేర్ చేయలేనంతగా జగన్ డ్యామేజ్ చేసేశాడు.
జగన్మోహన్ రెడ్డికి ఉన్న విజన్ ప్రజలకు, రాష్ట్రానికి పనికొచ్చేదికాదు. తనకుమాత్రమే పనికొచ్చే విజన్ ఆయన అమలుచేస్తున్నాడు. ఆయనకు విజన్ లేకపోవడం వల్ల అంతిమంగా రాష్ట్రం, ప్రజలునష్టపోయారు. పెరిగినధరలు, తగ్గిపోయిన ఆదాయంతో ప్రజలుబతకలేక సతమతమవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందడంలేదు. వారికి ఇవ్వాల్సిన ప్రత్యేకప్యాకేజీలనిధులను ప్రభుత్వమే దారిమళ్లిస్తోంది. 7డీఏలు ప్రభుత్వం ఉద్యోగులకు బాకీఉంది. సీపీఎస్ రద్దు వారంలోఅన్నారు, అదీలేదు. జగన్ నిర్ణయాలతో అన్నివర్గాలు నష్టపోయాయి. ఏదోఒకపద్ధతిలో ప్రజలనుంచే వసూలుచేయాలని చూస్తున్నారు. ఎప్పుడో నిర్మించుకున్నఇళ్లకుఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఏమిటి? 1983లో పక్కాఇళ్లను టీడీపీప్రభుత్వం నిర్మించింది. వాటికి రిజిస్ట్రేషన్ల పేరుతో ఇప్పుడు రూ.10వేలు వసూలుచేయడమేంటి?
డిస్కంలకు కూడా విద్యుత్ బకాయిలు కట్టలేదు. ఆదాయంవచ్చే మార్గాలను పూర్తిగా కోల్పోయినప్రభుత్వం, అప్పులపైనే రాష్ట్రాన్ని నెట్టుకొస్తోంది. ఈ సంవత్సరాంతానికి రాష్ట్రానికి రూ.5లక్షలకోట్ల అప్పులు మిగలనున్నాయి. భవిష్యత్ లో రూ.లక్షకోట్లవరకు వడ్డీలు కట్టాల్సిఉంది. గవర్న్ మెంట్ ఆఫ్ ఇండియా మొన్నీమధ్యన కొంత సొమ్మురిలీజ్ చేస్తే, అదికాస్త అప్పులకు జమైంది. రూ.11వేలకోట్ల కేపిటల్ ఎక్స్ పెండేచర్ ఖర్చుపెట్టాల్సిఉంటే, రూ.6,500కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం ఖర్చుపెట్టింది. దానివల్ల కేంద్రప్రభుత్వం నిధులుపొందే అర్హతకూడా కోల్పోయాము. ఈ విధంగా చర్చించాల్సిన అనేకప్రధానసమస్యలు ఉన్నాయి. వాటిపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకొస్తే, ప్రతిపక్షంగా తాముసలహాలు, సూచనలు ఇవ్వడానికి సిద్ధంగాఉన్నాము.
రాష్ట్రాన్ని సర్వనాశనంచేసిన ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ 15 రోజులు నిర్వహిస్తేనే, ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీయగలదు, ప్రజలకు మేలుచేయగలదు. టీడీపీకి భయపడే ఒక్కరోజు కాలక్షేపంచేసి, ముఖ్యమంత్రి పారిపోవాలని చూస్తున్నారు. అసెంబ్లీలో తప్పించుకున్నా, జగన్మోహన్ రెడ్డిని టీడీపీ ప్రజల్లో దోషిగా నిలబెట్టేతీరుతుంది. చట్టసభలపై, వ్యవస్థలపై ముఖ్యమంత్రికి గౌరవం లేవు. వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డే. ఇంతడబ్బుఖర్చుపెడుతున్నామని ప్రభుత్వంచెబుతోంది.. కానీరాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పేదరికం ఎందుకు పెరుగుతోంది?
రేపు జరగబోయే బీఏసీ సమావేశం నాటికి టీడీపీ వైఖరి ఏమిటనేది స్పష్టంచేస్తాం. సమావేశాలకు హజరవ్వాలా..వద్దా అనేది అప్పుడు నిర్ణయిస్తాం. అసెంబ్లీ నిర్వహణ అనేది ఎప్పుడుపడితే అప్పుడు, వారికి తోచినట్టు చేస్తారా? వైసీపీకి కలిసొస్తేనే చట్టసభలునిర్వహిస్తారా…ప్రజలకు కలిసొస్తే నిర్వహించరా? 2020-2021లోఇప్పటివరకు ఒకరోజు అసెంబ్లీ నిర్వహించారు.. రేపు ఒకరోజు పెడితే, రెండ్రోజులు అవుతుంది. ఈ విధంగా చట్టసభలను అపహస్యంచేస్తారా? ఇప్పుడు మండలిలో ప్రభుత్వా నికే మెజారిటీ ఉంది. మెజారిటీఉన్నప్పుడు చట్టసభలు ఎక్కువకాలం నిర్వహించడానికి ఇబ్బందిఏమిటి. ఉద్యోగులు, రైతుల, ఎయిడెడ్ విద్యాసంస్థలు, మహిళలపై వేధింపుల వంటి అనేకసమస్యలపై ప్రభుత్వం స్పందించాలికదా? రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఏదీ జరగడం లేదు. దాంతో సహజంగానే ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుంది. వైసీపీనేతలకు ఎక్కడైతే ఆదాయం వస్తుందో, ప్రభుత్వం అక్కడే పనిచేస్తుంది.
నా లెక్కల ప్రకారం ఏటా ఈ ప్రభుత్వం రూ.90వేలకోట్లనుంచి రూ.లక్షకోట్లవరకు అప్పులు చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి దిగిపోయేనాటికి రాష్ట్రంపై రూ.5లక్షలకోట్ల వరకు అప్పుఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి మరలాఅధికారంలోకి రావడమనేదికల్ల. రూ.5లక్షలకోట్లఅప్పుకి రూ.లక్షకోట్ల వడ్డీకలిపి, వచ్చే ప్రభుత్వంపై రూ.6లక్షలకోట్లవరకు భారంపడుతుంది. 2024-25 నాటికిరాష్ట్రబడ్జెట్ రూ.3.50లక్షలకోట్లు మాత్రమే ఉంటుంది. ఇకమిగిలే రూ.2.50లక్షల కోట్లలో రూ.లక్షకోట్లు జీతాలు ఇతరత్రావాటికి పోతే, ప్రభుత్వానికి మిగిలేది, ప్రజలకు చేసేది ఏమీలేదు. ఈ విధంగా ప్రజల్ని, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు.
ఒకవైపు ధరలువిపరీతంగా పెరిగాయి.. దాంతోపాటే రాష్ట్రఅప్పులు పెరిగాయి. దానిప్రభావం ప్రజలపై పడుతోంది. వారిఆదాయం తగ్గిపోయి, పొదుపుచేయడం కష్టంగామారింది. దానికితోడు ఆరోగ్యానికి ప్రజలుచేయాల్సిన ఖర్చుపెరిగింది. జగన్మోహన్ రెడ్డి తనఆదాయం, తనవారి ఆదాయం పెంచుతున్నాడుగానీ, ప్రజలఆదాయం పెంచే చర్యలకు స్వస్తిపలికాడు.అప్పులవసూళ్లకు ఈరోజు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారువచ్చారు…రేపు మరొకరు వస్తారు. గతంలో, ఇప్పుడుజరిగిన ఎన్నికలను పరిశీలిస్తే, ప్రభుత్వ అరాచకాలు, ఆకృత్యాలు ఎదుర్కొని ప్రజలు టీడీపీయే కావాలనే తీర్మానానికివచ్చారని తేలిపోయింది.
పాలకులు ఎన్నిదౌర్జన్యాలుచేసినా, టీడీపీపక్షానే ఉండాలని ప్రజలు తీర్మానించుకున్నారు. ప్రజలు తిరగ బడ్డారుకాబట్టే, ప్రతిపక్షంపక్షాన చేరారు. ఈ ఫలితాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది పలికాయి అనడంలో సందేహంలేదు. గతంలో తమప్రభుత్వంలో ఎళాంటి పక్షపాతం, రాగద్వేషాలు చూపకుండా అన్నిమీడియాసంస్థలను అనుమతించాము. మీడియా ఈజ్ మీడియా..అది సాక్షినా..మరొకటా అని ఆలోచించలేదు. బయటున్న ప్రజలు ఏమనుకుంటు న్నారనేది మీడియాద్వారానే ప్రభుత్వంలోని వారికి తెలుస్తుంది. మీడియాను చట్టసభల్లోకి అనుమతించకపోవడం అనేది అరబ్ దేశాల్లో కూడా లేదు. ప్రజలుఎన్నుకున్న ప్రతిపక్షసభ్యు లు, మీడియా లేకుండా చట్టసభలు నిర్వహించడం పొలిటికల్ టెర్రరిజం కాక ఏమవుతుంది?
టీడీపీ శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయస్వామి
ఒకరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టాక, జగన్మోహన్ రెడ్డి మంత్రులు చేసే పనేముంది? రాజ్యాంగం, వ్యవస్థలపై జగన్మోహన్ రెడ్డికి నమ్మకంలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమం త్రయ్యాక చట్టసభలు ఎన్నిరోజులుజరిగాయో ప్రత్యేకంగాచెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి ఆదేశాలప్రకారం వ్యవహరిస్తూ, స్పీకర్ ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడంలేదు. ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా, కావాలనే బుల్డోజ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి, ప్రతిపక్షసభ్యుల్ని బయటకుపంపమనగానే, స్పీకర్ ఆయన ఆదేశాలను తూచాతప్పకుండా పాటిస్తారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీఅమలు, డీఏలచెల్లింపు, రాష్ట్రంలోప్రబలుతున్న రోగాలు, ప్రజలపై పడుతున్నభారాల వంటి వాటికి సమాధానంచెప్పాల్సివస్తుందనే జగన్ అసెంబ్లీని ఒకరోజుకి పరిమితంచేయాలనుకుంటున్నారు. రాష్ట్రాన్నిచిన్నాభిన్నం చేసి, ఆర్థికవ్యవస్థను నాశనంచేశారు. వైద్యఆరోగ్యశాఖ తీవ్రమైనసంక్షోభంలోఉంది. ప్రజలు కోవిడ్ తోపాటు, డెంగ్యూ, మలేరియా ఇతరత్రా విషజ్వరాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రజాసమస్యలు, రాష్ట్రంలోని పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి టీడీపీసిద్ధంగా ఉంది. వాటిని పరిష్కరించాలనే ఆలోచనచేయకుండా, ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది? కోవిడ్ ను బూచిగా చూపుతూ అసెంబ్లీ నిర్వహించకుండా ప్రభుత్వం కావాలనే తప్పించుకుంటోంది. అసెంబ్లీని 15రోజులు నడపాల్సిందేనని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ప్రజల సమస్యలు చట్టసభల్లో చర్చించడానికి ప్రతిపక్షం సిద్ధంగాఉంటే, ప్రభుత్వం వెనకడుగు వేయడం సిగ్గుచేటు. సభసజావుగా నిర్వహించడానికి ప్రతిపక్షసభ్యులు సహకరిస్తారు. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టే, ప్రభుత్వం అధికారులు, పోలీసులు, దొంగఓట్లను నమ్ముకుంది. గతంలో జరిగినఎన్నికల్లో నామినేషన్ల స్థాయిలోనే ప్రభుత్వం ఏకపక్షంచేసుకుంది.
ఇప్పుడుజరిగిన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశంపార్టీకి ప్రజాదరణ ఉందని తేలిపోయింది. దర్శిలో అధికారపార్టీ ఎమ్మెల్యేనే స్వయంగా డబ్బుపంచారు. దాచేపల్లి వంటిచోట్ల ప్రభుత్వంకావాలనే, అధికారులసాయంతో రీకౌంటింగ్ తో గట్టెక్కాలని చూస్తోంది. ఫలితాలసరళిచూస్తే, అనేకప్రాంతాల్లో ప్రజలుటీడీపీ పక్షానే ఉన్నారని స్పష్టమవుతోంది.విలేకరులు సమావేశంలో టీడీపీఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE