Suryaa.co.in

Andhra Pradesh

నారా భువనేశ్వరీ ఫేక్ ఆడియోపై ఈసీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు

-ఎన్నికల్లో గెలవలేమని తెలిసి దిగజారుడు రాజకీయాలు మొదలుపెట్టిన వైసీపీ
-నారా భువనేశ్వరీ మాట్లాడినట్లు ఫేక్ ఆడియో సృష్టించి నీచ రాజకీయాలకు తెర లేపిన వైసీపీ సోషల్ మీడియా
-జగన్ రెడ్డికి ధైర్యముంటే ఎన్నికల కురుక్షేత్రంలో మాతో తలపడాలి
-ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ ఆడియోలు, వీడియోలు సృష్టించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
– తెదేపా నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దళితులను నారా భువనేశ్వరీ తిట్టినట్లు ఫేక్ ఆడియోను సృష్టించి వారిని, దానిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాపై ఎన్నికల కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు.

ఓటర్లను ప్రభావితం చేసేలా దిగజారుడు ప్రచారాలు చేస్తున్నవారిని కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను తెదెపా నేతలు కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య, దేవినేని ఉమా పాల్గొన్నారు.

ధైర్యముంటే ఎన్నికల కురుక్షేత్రంలో తేల్చుకుందాం రా జగన్ రెడ్డి..! : వర్ల రామయ్య
“ఎన్నికల సంఘం ఎన్నిసార్లు వైసీపీని చివాట్లు పెట్టిన వారి వ్యవహారశైలి మాత్రం మారడం లేదు. వైసీపీ సోషల్ మీడియా సిగ్గు మాలిన పనులను ప్రచారం చేస్తున్నారు. ఎవరిపట్ల పక్షపాతంగా ఎప్పుడూ మాట్లాడని నారా భువనేశ్వరీ గారిపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. దళితులను భువనమ్మ తిడుతున్నట్లుగా దరిద్రపు ఆడియో క్లిప్‌ను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైసీపీ ప్రచారాలు చేయిస్తుంది. మా అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, తెలుగుదేశం పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి తద్వారా ఎన్నికల్లో లబ్దీ పొందాలని, దొడ్డి దారుల్లో అధికారంలోకి రావాలని జగన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు.

ఎన్ని తప్పుడు పనులు చేసైనా అధికారం నిలబెట్టుకోవాలని తాపత్రాయం పడడం సరైన పద్ధతి కాదు. గెలుస్తామని నమ్మకం వైసీపీ నాయకులు ఉంటే ప్రజాక్షేత్రం తేల్చుకుందాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశామో? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసిందో ప్రజల ముందు తేల్చుకుందాం. పేద వాడి సంక్షేమం కోసం పోరాడిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కూతురు, పేద వాడిని అందనం ఎక్కించాలని తాపత్రాయ పడిన నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దళితులను తిట్టారఅంటే రాష్ట్రంలోని ఏ దళితుడు నమ్మడం లేదు.

ఇలా వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ఆడియోలు సృష్టించి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. సీఐడి అడిషనల్ డిజికి సిఫార్లు చేసి కేసు నమోదు చేయించి ఇటువంటి దరిద్రపు పనులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి హామీ ఇచ్చారు” అని వర్ల రామయ్య తెలిపారు.

దిగజారుడు రాజకీయాలు చేయడంలో జగన్ రెడ్డికి జగన్ రెడ్డే సాటి : దేవినేని ఉమా
మహిళలపట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉన్న సంస్కారం ఏంటో ప్రజలకు అర్థమైంది. సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి సంస్కారం లేకుండా జగన్ రెడ్డి మాట్లాడిన తీరును చూసి ప్రజలకు ఆగ్రహం చెందారు. ఆ విషయం నుంచి ప్రజలను దారి మళ్లించేంకు పన్నిన కుట్రలో భాగమే నారా భువనేశ్వరి ఫేక్ ఆడియో. హైదరాబాద్‌లో సజ్జల భార్గవ్ రెడ్డి ఒక ఫేక్ ఫ్యాక్టరీని పెట్టుకొని ఇటువంటి ఫేక్ ఆడియోలు, వీడియోలను సృష్టించి క్లియరెన్స్ కోసం తాడేపల్లి ప్యాలెస్‌కు పంపించి తర్వాత సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తుంటాడు.

ఇటువంటి ఫేక్ వార్తలు సృష్టించి వాటిని ప్రచారాం చేయడంలో సజ్జల భార్గవ్ రెడ్డినే మూలం. ధైర్యంగా మా తెదెపా నాయకులను ఎన్నికల కురుక్షేత్రంలో ఎదుర్కోలేక మా అభ్యర్ధులపై తప్పుడు ప్రచారాలు చేయించి ఎన్నికల్లో లబ్దీ పొందాలని జగన్ రెడ్డి చూస్తున్నాడు. ఇకనైనా ఇటువంటి దిగజారుడు రాజకీయాలను మానేయ్ జగన్ రెడ్డి..! ధైర్యంగా ఎన్నికల్లో యుద్ధం చేసి తెల్చుకుందాం తప్ప నీ రాజకీయ లబ్దీ కోసం మహిళలను కించపరిచేలా వార్తలు సృష్టించి వారి గౌరవానికి భంగం కలిగించవద్దు” అని దేవినేని ఉమా సవాల్ చేశారు.

LEAVE A RESPONSE