ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సౌకర్యాల లేవంటూ తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఆధ్వర్యంలో కోఠి ఉమెన్స్ కాలేజి వద్ద గల డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్యామిలి వెల్ఫేర్ సంచాలకులు (డైరెక్టర్) కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. కుటుంబ ఆరోగ్య వైద్య అధికారికి గారికి వినతి పత్రం సమర్పించడానికి వెళ్లిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సుల్తాన్ బజార్ పిఎస్.
అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మాట్లడుతూ ఇటీవల ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. గతంలో నిలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రులో ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లు వేసే దారం లేక 100కుపైగా ఆపరేషన్లు నిలిపి వేయడం. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కోకొల్లలు. ఇవన్నీ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. మంత్రులకు, అదికారులకు ఏటువంటి ఆనారోగ్యం ఏర్పడ్డా ప్రైవేటు ఆసుపత్రులలో చేరి ప్రజల సొమ్ము దుర్వనియోగానికి పాల్పడుతున్నారు. మంత్రులు ప్రజా ప్రతినిదులు, తమ తమ వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులలో చేయించు కోవాలని డిమాండ్ చేసారు.
ఈ నిరసన కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు పి.సాయిబాబా, వర్కింగ్ ప్రసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శి బాలరాజగౌడ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దోజు రవీంద్రాచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరీఫ్, నియోజకవర్గ ఇన్చార్జులు బిల్డర్ ప్రవీణ్, వల్లరాపు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు కప్పకృష్ణాగౌడ్, అన్నపూర్ణ, కొర్రాదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి రామేశ్వర్ రావు, కుమారి ఇందిర, ఆశాబిందు, కట్ట రాములు, శ్రీనివాస్ గౌడ్, జైరాజ్ యాదవ్, ఎం.రాజు, జి.మధు సూధన్,ఓ.వేంకటేష్ చౌదరి, కెడి.దినేష్, జోగింధర్ సింగ్, యాదగిరి, సిహెచ్.ప్రదీప్ గౌడ్, ప్రశాంత్ యాదవ్, బాను ప్రకాష్, ఎస్.ఎం.లయీఖ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకులకి వినతి పత్రం
గౌ. శ్రీయత సంచాలకులు గారికి
రాష్ట్ర ఆరోగ్య వైద్యాధికారి కార్యాలయం
కోఠి, హైదరాబాద్.
సమర్పిస్తున్న మెమోరాడం!
ఆర్యా!
ఒకప్పుడు ఆరోగ్య రాజధానిగా వెలుగొందింది హైదరాబాద్ నగరం, ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, వైరస్, డయేరియూ లాంటి వ్యాధులు ప్రబలిపోయి ప్రజారోగ్యం ఆందోళనంగా మారింది. ఈ అంటు రోగాలకు వైద్యం కోసం కోఠి ఉమెన్స్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, ఉస్మానియూ, నిలోఫర్ లాంటి ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన సౌకర్యాలు లేక, వైధ్యం చేసే డాక్టర్లు అందుబాటులో లేక, మందులు అందక, ప్రాణాంతకైమెన వ్యాదులతో ప్రభుత్వ ఆసుపత్రులలో చనిపోతున్న వారి సంఖ్య గణణీయుంగా పెరిగిపోతుంది. వైద్యానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం అంటే చావును కౌగిలించుకోవడమే అని ప్రజలు బయుపడే పరిస్థితులలో ఉన్నారు..
ఇటీవల ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పేట్ల బురుజు ప్రసూతి ఆసుపత్రిలో ఒక్కో కాన్పుకు రూ. 2వేలు ముక్కు పిండి మరీ వసూలు చేశారని సాక్షాత్తూ మంత్రి హరీష్ రావు వద్ద మహిళలు వాపోయారు. ఈ ఘటన వల్ల ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలో ప్రాణాలు కోల్పోయిన వారికి 25 లక్షల నష్ట పరిహారం (ఎక్స్ గ్రేషియా) చెల్లించాలి, శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి 5 లక్షల ప్రోత్సాహకాన్ని చెల్లించాలి.
రాష్ట్ర హెల్త్ బడ్జెట్ రూ. ఆరు వేల కోట్లకు మించడం లేదు. అందులో సగం జీతాలకే పోతుంది. ప్రజల కిచ్చే ట్రీట్ మెంటు కోసం ఖర్చు పెట్టేది రూ.3వేల కోట్లు మాత్రమే. వైద్యంపై జనం ఖర్చు చేస్తున్నది 90% ఉంటే, ప్రభుత్వం ఖర్చు 10% మాత్రమే ఉంటుంది. ప్రజారోగ్యాన్ని సంరక్షించాల్సిన ప్రభుత్వం వైఫల్యంతో ప్రజల ఆరోగ్య భద్రత ఆందోళనకరంగా మారింది, తద్వారా విశ్వనగరం కాస్త రోగాల నగరంగా మారింది.
ముఖ్యమంత్రి గారికి పంటినొప్పి వస్తే ఢిల్లీకి వెళ్లి వైధ్యం చేయించుకుంటారు. రాష్ట్ర వైధ్య ఆరోగ్య శాఖ ఆసుపత్రులపై నమ్మకం లేదు. నీమ్స్ హాస్పటల్ డైరెక్టర్ మనోహర్ గుండెపోటుకు గురై తాను మాత్రం ప్రైవేటు కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంతటి సంక్లిష్టమైన చికిత్స అయిన సరే ఇక్కడి నీమ్స్ వైద్యులు చాకచక్యంగా చేస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతుంటారు. అంతటి పెద్దాసుపత్రికి డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి మాత్రం తనకు అనారోగ్యం వస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఆస్పత్రి ఉన్నతాధికారే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడం పట్ల ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ ఆస్పతులపై ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం.
ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ… వెంటనే ప్రభుత్వం స్పందించి, ప్రభుత్వ ఆసుపత్రులలో సరిపోయే డాక్టర్లు, మందులు, సౌకర్యాలు ఏర్పాటు చేయూలని, అవసరమైతే 24 గంటలు (24/7) అందుబాటులో ఉంచి పరిస్థితిని అదుపులోకి తేవాలి. చేతగాని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మీ ద్వారా ప్రభుత్వాని తెలియజేస్తున్నాం.
పి.సాయిబాబా,
అధ్యక్షుడు,
సికింద్రాబాద్ పార్లమెంట్