Suryaa.co.in

Andhra Pradesh

ఓట్ల తొలగింపు, దొంగఓట్లపై టీడీపీ క్షేత్రస్థాయి పోరాటం

•21 నుంచి బీ.ఎల్.వోలతో ఇంటింటికీవెళ్లి ఓటరుజాబితాల పరిశీలన
• దొంగఓట్లు, అధికారదుర్వినియోగం, డబ్బుతో ఎన్నికల్లో గెలవాలన్నదే జగన్ ఆలోచన
– మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప

భారతరాజ్యాంగం ప్రజాస్వామ్యపరిరక్షణకోసం పౌరులకు కల్పించిన ఓటుహక్కుని కొందరు అవినీతిపరులైన రాజకీయ నేతలు, తమస్వార్థరాజకీయప్రయోజనాలకోసం విచ్ఛిన్నం చేస్తున్నారని, ఓటుఅనే ఆయుధంతో ప్రజలు ఎక్కడ తమ దుర్మార్గపు, దుష్ట పాలనకు చరమగీతం పాడతారోనన్న భయంతో, ఓటమిభయంతో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం లక్షలాదిఓట్లను నిర్దాక్షణ్యంగా తొలగించిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి నిమ్మ కాయల చినరాజప్ప చెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ వచ్చేఎన్నికల్లో ప్రజలు ఓటుహక్కుతో ఎక్కడ తనకు, తనప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెడతారోనన్న భయం ముఖ్యమంత్రిని, అతనిప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఆ భయంతోనే టీడీపీసానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను అన్యాయంగా తొలగిస్తు న్నారు. తెలుగుదేశంపార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఓట్లతొలగింపు, దొంగఓట్ల చేర్పు అనే తంతు నిర్విరామంగా, నిర్భయంగా సాగుతోంది. అలానే జనసేనపార్టీకి పట్టున్న నియోజకవర్గాలపైకూడా అధికారపార్టీ దృష్టిపెట్టింది.

ఓటర్లజాబితా పరిశీలనలో బీ.ఎల్.వోలతో పాటు, టీడీపీనేతలు, కార్యకర్తలు భాగస్వాములు అవుతారు. చంద్రబాబు ఆదేశాలప్రకారం ఓటర్లజాబితాలోని అవకతవకలు, దొంగ ఓట్ల తొలగింపుపై టీడీపీ క్షేత్రస్థాయిలో పోరాడుతుంది.

తెలుగుదేశం పార్టీ బలంగాఉన్న నియోజకవర్గాలైన ఉరవకొండ, విశాఖపట్నం తూ ర్పు నియోజకవర్గాల్లో దాదాపు 50వేలఓట్లవరకు తొలగించారు. మొత్తంగా రాష్ట్రంలో 30లక్షలఓట్లు లేపేయడానికి జగన్ అతని ప్రభుత్వం సిద్ధమైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంసహా, అనేక నియోజకవర్గాల్లో దొంగ ఓట్లుచేర్పించడం ఎక్కువైంది. అధికారులు, వాలంటీర్ల అండదండలతో వైసీపీ నేతలు తప్పుడు చిరునామాలతో ఒకే డోర్ నెంబర్ తో వందలు, వేలసంఖ్యలో దొంగఓట్లు చేరుస్తున్నారు. దొంగఓట్లు తీసేయడం, తొలగించిన నిజమైనఓట్లను తిరిగి చేర్చాల్సిన బాధ్యత బీ.ఎల్.వో.లపై ఉన్నా, వారు వాలంటీర్లు, అధికారపార్టీనేతలు, కార్యకర్తలుచెప్పిన విధంగానే నడుచుకుంటున్నారు.

వాలంటీర్ల ప్రమేయంతోనే ఓటర్లజాబితాలో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన రాష్ట్రన్నికల సంఘం, గ్రామస్థాయిలో ఓటరుజాబితాలను పరిశీలించి, అవకతవకలు సరిదిద్దాలని, బీ.ఎల్.వో.లను ఆదేశించింది. బీ.ఎల్.వో. లు తమపరిశీలనలో నిక్కచ్చిగా, నిష్పక్షపాతంతో వ్యవహరించి, అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నాం. బీ.ఎల్.వోల వెంట తమపార్టీ నేతలు, కార్య కర్తలు కూడా ఉండి, ఓటర్లజాబితాలో జరిగే అవకతవకల్నిసరిదిద్దాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు.

ప్రతి నాయకుడు, కార్యకర్త ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, వైసీపీ నేతల కుయుక్తుల్ని తిప్పికొట్టాలని సూచించారు. చంద్రబాబు ఆదేశాలతో 21వతేదీ నుంచి టీడీపీకార్యకర్తలు నేతలు బీ.ఎల్.వో లతోపాటు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లనున్నారు. బీ.ఎల్.వో లకు మాపార్టీ సహాయసహకారాలు అందిస్తాం గానీ, వాలంటీర్లకు సహకరించం. వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా అధికారపార్టీకి గులాంగిరీ చేస్తోంది.

దొంగఓట్లు, టీడీపీఓట్ల తొలగింపు, ప్రజలసమాచారం దుర్వినియోగంపై ముఖ్యమంత్రి స్పందించడంలేదు. అధికారపార్టీనేతల కొట్లాటలు, కుమ్ములాటలు కూడా పట్టించుకో వడంలేదు. డబ్బు, అధికారదుర్వినియోగం, దొంగఓట్లతో గెలవాలనే ఆలోచనలో ఉన్నాడు.

ఓట్లతొలగింపునకు ప్రభుత్వం శ్రీకారంచుట్టడానికి ప్రధానకారణం ప్రజలనుంచి వాలంటీర్లు సేకరించిన సమాచారమే. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వివిధకారణాలు చెప్పి వాలంటీర్లద్వారా సేకరించిన జగన్ ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టిం ది. ప్రభుత్వతీరుతో ప్రజలంతా భయపడిపోతున్నారు. తమవ్యక్తిగత వివరాలు ఇతరు లచేతుల్లోకి వెళ్లడంపై వారు తీవ్రంగా ఆందోళనచెందుతున్నారు. ప్రజల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశమున్నా ముఖ్యమంత్రి ఏమాత్రం చలించడంలేదు.

ప్రజాస్వామ్యబద్దంగా, ప్రజల మద్ధతుతో గెలవాలన్న ఆలోచన జగన్ కు లేదుకాబట్టే, ఓట్లు తొలగించడం, సమాచార దుర్వినియోగంతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అసమర్థపాలన, ప్రజాగ్రహానికి భయపడే వైసీపీలో కుమ్ములాటలు, కొట్లాటలు తారాస్థాయికి చేరాయి.

చాలానియోజకవర్గాల్లో అధికారపార్టీనేతలు, కార్యక ర్తలు రోడ్లపైకి వచ్చి బాహటంగానే ఎమ్మెల్యేలు, మంత్రుల్ని విమర్శిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు కొట్టుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వాటి గురించి పట్టించు కోవడంలేదు. దొంగఓట్లతో, అధికారదుర్వినియోగంతో, డబ్బుతో వచ్చేఎన్నికల్లో గెలవొచ్చన్న ధీమాలో ముఖ్యమంత్రి ఉన్నాడు.” అని చినరాజప్ప స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE