– విజయసాయిరెడ్డిని ముందు పెట్టడం వైసీపీ ఫ్యూడల్ విధానానికి పరాకాష్ట
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్
జయహో బీసీ అంటూ తెలుగుదేశం నినాదానికి రంగులు వేసుకుని సభ పెట్టడం హాస్యాస్పదం.. బీసీల సభకి విజయసాయిరెడ్డిని ముందు పెట్టడం వైసీపీ ఫ్యూడల్ విధానానికి పరాకాష్ట.. వైవీ సుబ్బారెడ్డి మంత్రి వేణుతో మోకాళ్ళ మీద దణ్ణం పెట్టించుకుని బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు..బీసీలు ప్రశ్నించకూడదని అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధిస్తున్నారు.
బీసీలకి ఒక బ్రాండ్ ఇచ్చింది తెలుగుదేశంపార్టీ .. 75 సంవంత్సరాల స్వాతంత్రంలో తెలుగు రాష్ట్రాల్లో బీసీల అభ్యున్నతి గురించి మాట్లాడాలంటే 1983 ముందు తరువాతగా చెప్పుకోవచ్చు.. అంటే తెలుగుదేశానికి ముందు తరువాతగా చెప్పుకోవచ్చు.. మొట్టమొదటిసారి అన్న ఎన్టీఆర్ పాలెగాళ్ళు , పటేల్ పట్వారీలు , గడీల పాలన నుండి బీసీలకు విముక్తి కల్పించింది తెలుగుదేశం పార్టీ.. బడుగులకి వెలుగునించ్చింది తెలుగుదేశం పార్టీ .. బీసీ యువకులని చట్ట సభల్లోకి తీసుకువెళ్ళింది తెలుగుదేశం పార్టీ..
కేంద్ర మంత్రులుగా , మంత్రులుగా బీసీలకి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ… చంద్రబాబు నాయుడు గారి దర్శానికిత వల్ల నేడు ఎందరో యువకులు ఐటీ ఉద్యోగస్తులగా ఉన్నారు.. ఉన్నత చదువులు చదువుకుని ప్రపంచమంతా రాణిస్తున్నారు.. ఇలా బీసీల ఆర్థిక , సామాజిక స్తితిగతులని మార్చిన పార్టీ తెలుగుదేశంపార్టీ.. నేడు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్న వైసీపీలో ఉన్న బీసీ నాయకులకి కూడా రాజకీయ ప్రవేశం కల్పించింది తెలుగుదేశంపార్టీ అని మర్చిపోకూడదు .. బీసీల అభివృద్ధి తెలుగుదేశం DNA లో ఉంది.