-2004 లో జగన్ ఆస్తులెంత?
-ఇప్పుడు దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడైన సీఎం ఎలా అయ్యారు?
– సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేసిన టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ……వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ దొడ్డిదారిన అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోటోలు వేసి వాళ్లు పేదల వ్యతిరేకులు అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు సిగ్గు, బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారు.
దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. 2004లో జగన్ రూ. 2 లక్షల ఆసామి. నేడు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు? ఇంత తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్లు సంపాదించిన వారు జగన్ కాకుండా దేశంలో మరెవరైనా ఉన్నారా? దొడ్డిదారిన అక్రమంగా, అవినీతితో వేల కోట్లు కూడబెట్టారు. టీడీపీ ఎప్పుడూ పేదల పక్షమే. పేదల ఆకలి తీర్చడానికి రూ. 2 లకే కిలో బియ్యం పధకం ప్రవేశపెట్టిన పార్టీ టీడీపీ. పేదలకు పక్కా ఇళ్లు కట్టించిన, పేద పిల్లల్ని విదేశాల్లో చదివించిన ఘనత టీడీపీదే.
కానీ మోదీ, చంద్రబాబు, పవన్ పోటోలు వేసి వీళ్లు పేదల వ్యతిరేకులు అంటూ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నాయకులకు సిగ్గు, బుద్ది ఉందా? నైతిక విలువలు ఉన్న ఏ మనిషైనా ఇలా వ్యవహరించరు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని లాగి విసిరికొట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. అందుకే దొడ్డిదారిన అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు.
జగన్ నువ్వు ముందు రాష్ట్ర ప్రజల కళ్లు కప్పి కోట్లు ఎలా కూడబెట్టావో చెప్పు. అంతే తప్ప తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి రావాలనే తప్పుడు ప్రయత్నాలు మానుకోవాలి. పించన్లు ఇవ్వటం చేతకాక శవ రాజకీయాలు చేస్తున్నారు. మంత్రి జోగి రమేష్ చనిపోయిన శవం దగ్గరకెళ్లి దాన్ని లేపి తీసుకెళ్లి శవరాజకీయం చేయాలని చూశారు. మృతుని బందువులు చివాట్లు పెట్టడంతో పలాయనం చిత్తగించాడు.
పేర్ని నాని తెగిన గాలిపటంలా ఏది పడిదే అది మాట్లాడుతున్నారు. కొడాలి నాని ఎన్నికల ముందు దళిత వాడల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలు పరిష్కరిస్తున్నట్టు డ్రామాలు మొదలెట్టాడు. వారి నాటకాలు నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ నేతల్ని జుట్టు పట్టుకుని విసిరి కొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినవారిపై, దీనికి కారణమైన సీఎం జగన్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.