Suryaa.co.in

Andhra Pradesh

వెనకబడిన వర్గాలను నాయకులుగా చేస్తున్న ఫ్యాక్టరీ టీడీపీ

-సలహాదారులు, వైస్ చాన్స ర్లు వంటి పెద్ద పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు?
-కనీసం కార్యాలయాల్లో కూర్చోవడానికి కుర్చీలు, పేపర్లు లేని ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు
-బీసీలకు ఎవరు మేలు చేశారో చర్చకు సిద్ధమా అని జగన్ రెడ్డికి సవాల్
-రెడ్లకు కూడా ఈ జగన్ చేసిందేమీ లేదు
-జగన్ రెడ్డి విధానాల వల్ల రెడ్లు కూడా దెబ్బతిన్నారు
-వైసీపీ అధికారంలోకి వచ్చాక యాదవులను ఎక్కువగా జైల్లో పెట్టారు
-నెల్లూరు జిల్లా, కావలిలో ‘‘ఇదేం ఖర్మ మన బీసీలకు’’ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
-బీసీలకు చంద్రబాబు వెన్నుదన్ను, జగన్ వెన్నుపోటు పేరిట ఫొటో ఎగ్జిబిషన్
-మూడున్నరేళ్లలో 26మంది బీసీలను జగన్మోహన్ రెడ్డి హత్య చేయించాడని ఫోటో ప్రదర్శన ఏర్పాటు
-బీసీల వృత్తి పరికరాలను తిలకించి మగ్గం నేసిన చంద్రబాబు

రాష్ట్రంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యాక్రమంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలతో సమీక్షలకు శ్రీకారం చుట్టాం. వివిధ వర్గాల ప్రజల నుండి సమస్యలు నేను నేరుగా తెలుసుకుని న్యాయం చేసేందుకు సమీక్ష చేస్తున్నా. బీసీల్లో 140 పైగా కులాలు ఉన్నాయి. టీడీపీకి బీసీలే వెన్నెముక. బీసీలకు న్యాయం చేసే వరకు టీడీపీ అండగా ఉంటుంది.

బీసీలు టీడీపీ ఆవిర్భావం ముందు..ఆవిర్భావం తర్వాత ఎలా ఉన్నారనేది ఆలోచించాలి.టీడీపీకి ముందు బీసీలను ఓటర్లుగానే చూశారు. కానీ ఎన్టీఆర్ వచ్చాక బీసీల స్థితిగతులపై సమీక్ష చేశారు. బీసీలు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా తీర్చిదిద్దాలని ఎన్టీఆర్ నిర్ణయించారు. బీసీలకు మంత్రులు, ఎమ్మెల్యేలుగా టీడీపీ అవకాశం ఇచ్చింది. యనమల రామకృష్ణుడు,కె.ఇ.కృష్ణమూర్తి, దేవేందర్ గౌడ్, కొల్లు రవీంద్ర లాంటి బీసీ నేతలకు ఉన్నత పదవులు ఇచ్చింది టీడీపీనే.

ఏ పదవుల్లోనైనా బీసీలకు న్యాయం చేయాలని ఆలోచించి అవకాశాలు కల్పించాం.బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములైతే నిర్ణయాలు కూడా సమర్థవంతంగా అమలవుతాయి.స్థానిక సంస్థల్లో మొదటి సారిగా 24 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాం. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు అయ్యారు. బీసీలల్లో నాయకులకు కొదవలేదంటే అది టీడీపీ స్పూర్తే.

ఎన్టీఆర్ 24 శాతం రిజర్వేషన్లు ఇస్తే..నేను వచ్చాక 34 శాతానికి పెంచా. కానీ జగన్ వచ్చాక 24 శాతానికి తగ్గించాడు. దీంతో బీసీలు 16,800 పదవులు కోల్పోయారు. ఇది బీసీల పట్ల జగన్ కు ఉన్న వివక్ష.వెనకబడిన వర్గాలను నాయకులుగా చేస్తున్న ఫ్యాక్టరీ టీడీపీ.40 ఏళ్లుగా బీసీలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నాం. నాయకుడు తయారవ్వడం చాలా కష్టం. ఆ నాయకుడిపై బురదజల్లడం సులభం. కొల్లు రవీంద్ర నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి. ఆయన నాయకత్వాన్ని వైసీపీలోని నాయకత్వం జీర్ణించుకోలేకపోయింది. మచిలీపట్నంలో హత్య జరిగింది. ఫోన్లో మాట్లాడినందుకు కొల్లు రవీంద్రను హత్యలో ప్రమేయముందనిcha4 అక్రమంగా అరెస్టు చేశారు. సొంత బాబాయి వివేకానందరెడ్డిని చంపిన నిందితులకు కాపాడుతున్న జగన్ ను జైల్లో పెట్టాలి.హత్య కేసుతో ఎలాంటి సంబంధంలేకపోయినా కొల్లు రవీంద్రను అక్రమంగా అరెస్టు చేసి 70 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఈఎస్ఐ స్కాం అంటూ ఏమీ లేకపోయినా అచ్చెన్నను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు.కూన రవిపైనా కేసులు పెట్టారు. అయ్యన్నపాత్రుడుపై రేప్ కేసు పెట్టారు. బీసీలు ఎవరైనా మాట్లాడితే ఈ సైకోకు పెద్దరోషం వస్తుంది. తప్పులు ఎత్తి చూపితే జైల్లో పెడుతున్నాడు. 26 మంది బీసీలను చంపారు. నందం సుబ్బయ్యను మొదలుకొని పల్నాడులో 16 మందిని చంపారు. 2,600 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. బీసీలను ఇబ్బంది పెట్టిన వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.

బీసీలకు పదవులిచ్చామంటున్నారు..ఎవరికి ఇచ్చారు.? సలహాదారులు, వైస్ చాన్స ర్లు వంటి పెద్ద పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు.? కనీసం కార్యాలయాల్లో కూర్చోవడానికి కుర్చీలు, పేపర్లు లేని ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవంట. బీసీల వృత్తిని జగన్ రెడ్డి ఎగతాళి చేస్తున్నాడు.తమ పిల్లల్ని బాగా చదివించుకోవాలని బీసీలకు కోరిక ఉంది. టీడీపీ హాయాంలో 120 కులాల వారికి వేల కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు ఇచ్చి గౌరవించాం. రకరకాల కులాల వారు సమస్యలు చెప్తున్నారు. రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులు 5.50 లక్షల మంది ఉంటే 30 వేల మందికే ఇచ్చారు రజకులు 15 లక్షల మంది ఉంటే 53 వేల మందికి, టైలర్లు 13 లక్షలుంటే 1 లక్ష మందికి, మత్స్య కారులు 20 లక్షలుంటే లక్ష మందికి, చేనేతలు 3.50 మంది ఉంటే 81 వేల మందికే పథకాలు ఇస్తున్నారు. బీసీలను ఉద్దరిస్తున్నట్లు ప్రతిరోజూ పత్రికల్లో అబద్ధాలు రాయించుకుంటున్నాడు.

దేశంలోనే మొదటి సారిగా బీసీలకు టీడీపీ వచ్చాక ఎస్సీలతో సమానంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. రూ.37 వేల కోట్లకు పైగా బీసీ సబ్ ప్లాన్ కు నిధులు కేటాయించాం. జనాభా దామాషా ప్రకారం న్యాయం చేశాం.బీసీ ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాం. చెరువులపై మత్య్స కారులకు హక్కులుండేలా రిజర్వేషన్లు కల్పించాం. కానీ దాన్ని రద్ద చేసేలా జగన్ రెడ్డి 217 జీవో తెచ్చాడు.సముద్రంలో వేటకు వెళ్తే ఎప్పుడు వస్తారో తెలీదు. మంచిబోట్లు అందించడంతో పాటు సబ్సీడీలో పెట్రోల్ కూడా అందించాం. వలలు, బోట్లు కొట్టుకుపోయినా కొనిచ్చాం. వేట నిషేధ సమయంలో నెలకు రూ.5 వేల డబ్బులిచ్చి ఆదుకన్నాం.చేపలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు..వలలిచ్చి చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం బతుకుతారనేది టీడీపీ సిద్ధాంతం.చేనేత కార్మికులకు బకాయిలుగా ఉన్న రూ.118 కోట్లు రుణాలు మాఫీcha2 చేశాం. ఆప్కో ఏర్పాటు చేశాం. బీసీలు నిర్వహించే ప్రతి వృత్తినీ అధ్యయనం చేశాం. టీడీపీకి 40 ఏళ్లుగా బీసీలు అండగా ఉంటున్నారు. బీసీలకు టీడీపీ రుణపడి ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చాక బీసీలు కోల్పోయిన ప్రయోజనాలను వడ్డీతో సహా చెల్లించి మీ తీర్చుకుంటా ప్రతిజ్ణ చేస్తున్నా.వైసీపీ వచ్చి నాలుగేళ్లైంది.. ఒక్క బీసీకైనా రూపాయి రుణం ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి.?140పైగా కులాలున్న బీసీలను అరకొరగా నిధులు కేటాయించిన నిన్ను బీసీలు నమ్మాలా జగన్ రెడ్డి.?ఆధునిక పనిముట్లకు 90 శాతం రాయితీలిచ్చి.. రుణాళిచ్చాం. భవననిర్మాణం రంగం రాష్ట్రంలో ఆగిపోయింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మూడున్నరేళ్లుగా ఉపాధి లేకుండా పోయింది. ఇసుక, సిమెంట్, ఇనుము రేట్లు పెంచి పని లేకుండా చేశారు.భవన నిర్మాణ కార్మికులకు చెందిన రూ.12 వందల కోట్ల సంక్షేమ నిధిని ఈ ప్రభుత్వం దారి మళ్లించింది. బీసీలకు విదేశీ విద్య, బెస్ట్ అవెయిల్ బుల్ స్కూళ్లు లేకుండా రద్దు చేశారు. బీసీల ద్రోహి జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని బీసీలు కంకణం కట్టుకోవాలి.జనాభాలో 50 శాతం బీసీలు ఉన్నారు. వారంతా జగన్ రెడ్డి మోసాన్ని గమనించారు. నన్ను నమ్మిన వాళ్లకు అండగా ఉంటా. టీడీపీకి అండగా నిలిచిన వారిపై ప్రత్యేకంగా శ్రద్ద పెడతాం.

54 ఫెడరేషన్లు ఏర్పాటు చేసి పార్టీకి అనుబంధంగా పెట్టుకున్నాం. పార్టీ మీకు గుర్తింపు ఇచ్చింది. ప్రతి వర్గానికి చెందిన వారివద్దకు వెళ్లి సమస్యలు అధ్యయనం చేసి ప్రణాళికి సిద్ధం చేయండి. ఎన్నికలకు ముందు మీరు రూపొందించిన ప్రణాళికలు నాకు ఇవ్వండి. మేనిఫెస్టోలో పెడతాం. అధికారంలోకి రాగానే వాటిని అమలు చేసేలా కృషి చేస్తాం. బీసీలకు జరిగే అన్యాయంపై పోరాడితే గుర్తింపొస్తుంది. చిన్ననాటి నుండి చూస్తున్నా..మనందరం శుభ్రంగా కనబడుతున్నామంటే దానికి కారణం రజకులే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వారికి ఇస్త్రీ పెట్టెలు, దోబీ కిట్ అందించాం. ఆటో మిషన్లు కూడా ఇచ్చాం. దాంతో వారి శ్రమ తగ్గి.. ఆదాయం పెరిగింది. జగన్ రెడ్డిని బీసీలంతా ఉతికారేయాలి. బీసీలను అన్ని విధాలా మోసం చేసిన జగన్ రెడ్డిని ఎట్టిపరిస్థితుల్లో క్షమించకూడదు. బీసీ యువతిని చంపేసినా భయపెట్టి ఫిర్యాదు ఇవ్వనీయకుండా బాధితులను బెదిరిరించారు.న్యాయం చేయండని నిలదీస్తే ఎదుటి వాళ్లను ఆడిపోసుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి.బసీలకు ఏం న్యాయం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. బీసీలకు ఎవరు మేలు చేశారో చర్చకు సిద్ధమా అని జగన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.

యాదవులకు వైసీపీ పూర్తిగా అన్యాయం చేసింది. పట్టుదలతో ప్రతి ఒక్కరూ పోరాడాలి.మీరు అనుకుంటే ఈ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా రావడం కూడా కష్టమే.బీసీలైన కాసాని జ్ణానేశ్వర్ కు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చాం. ఏపీలో అచ్చెన్నాయుడుకు ఇచ్చాం. రాష్ట్రంలో పెత్తనమంతా ఆయన సామాజిక వర్గానిదే. ఆయన చుట్టూ ఉండే జె.గ్యాంగ్ కు రాష్ట్రంలో పెత్తనం అప్పగించాడు. రెడ్లకు కూడా ఈ జగన్ చేసిందేమీ లేదు. జగన్ రెడ్డి విధానాల వల్ల రెడ్లు కూడా దెబ్బతిన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక యాదవులను ఎక్కువగా జైల్లో పెట్టారు. పల్నాడులో నలుగురు యాదవులను చంపేశారు.గుండ్లపాడులో బీసీ నేత చంద్రయ్యను నడిరోడ్డులో చంపారు.గౌడలకు కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా సాయం చేశాం. గీత కార్మికులు చేసే వ్యాపారాన్ని కూడా ఇప్పుడు జగన్ రెడ్డే చేస్తున్నాడు.

టీడీపీ అధికారంలోకి రాగానే గీత కార్మికులకు మద్యం షాపుల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం. మత్స్యకారులకు, గీత కార్మికులకు పరిహారం రూ.10 లక్షల అందిస్తాం.చేనేతలకు వారి చేనేత పని తప్ప మరో పని చేయలేరు. అలాంటి వారికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.మత్స్య కారులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఆక్వారంగం రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతింది. జగన్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ మటాషే. లాభాల్లో నడుస్తున్న రంగాన్ని జగన్ రెడ్డి వచ్చి నిర్వీర్యం చేశారు. విశ్వబ్రాహ్మణులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. గోల్డ్ పోయిందని చెప్తే స్వర్ణకారులపై దాడి చేస్తున్నారు.పెళ్లి కుదిరిన ఇంట్లో వాళ్లు మొదటిసారిగా స్వర్ణకారుల వద్దకు వెళ్లి మంగళసూత్రమే తీసుకుంటాం.దూదేకులకు కూడా న్యాయం జరగాలి. దుల్హన్ కు నిబంధనలు లేకండా ఆర్థిక సాయం చేశాం. కానీ జగన్ రెడ్డి మాత్రం పదవ తరగతి చదవాలంటూ రకరకాల నిబంధనలు పెట్టాడు.

జగన్ రెడ్డి అవినీతికి మాత్రం నిబంధనలు వర్తించవా.? రూ.373 కోట్ల ఆస్తిని ఇప్పుడు జగన్ రెడ్డి కలిగి ఉన్నాడు. దేశంలో ఉన్న మొత్తం ముఖ్యమంత్రులది కలిపి రూ.317 కోట్లు ఉంటే.. జగన్ రెడ్డి ఒక్కడికే రూ.373 కోట్లు ఉంది.2004 ఎన్నికలకు ముందు లక్షల్లో కూడా ఆదాయం లేని వ్యక్తి ఇప్పుడు దేశంలోనే అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. సంచార జాతుల వారిని చూస్తే ఆవేదన కలుగుతోంది. వారికి స్థిర నివాసం ఉండదు.సంచార జాతుల వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే.. దాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి రద్దు చేశారు. ఎంత వీలైతే అంతమంది బీసీలతో సమావేశమవుతా. వెనకబడిన వర్గాలను పైకి తీసుకువచ్చే వరకు అండగా ఉంటా. ఎన్నికల్లో గెలవడానికి ఇది చెప్పడం లేదు..నా బాధ్యతగా చెప్తున్నా. టీడీపీకి బలమైన వర్గం ఏదంటే వెనకబడిన వారేనని చిన్నపిల్లులు కూడా చెప్తారు.ఈ ప్రభుత్వంలో వెనకబడిన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.తూర్పు రాయలసీమ పట్టపభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ను గెలిపించాలి.

LEAVE A RESPONSE