– కాసాని నేతృత్వంలో పార్టీకి పూర్వ వైభవం
– టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మండూరి సాంబశివరావు
తెలంగాణలో టీడీపీ హవాకు ఇంకా ఎంతో దూరం లేదని టీడీపీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ మండూరి సాంబశివరావు జోస్యం చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో , తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకోవడం శుభ పరిణామమన్నారు. తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయన, కాసానిని లిసి సన్మానించారు. అదే సందర్భంలో తనకు అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించిన కాసానికి డాక్టర్ ఏ.ఎస్.రావు కృతజ్ఞతలు తెలిపి, సన్మానించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో అడుగడుగునా కళ్లకు కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం, కాసాని ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. ప్రధానంగా పేదలందరికీ డబుల్ బెడ్‌రూములు ఇస్తామన్న కేసీఆర్ సర్కార్ హామీని మండల స్థాయిలో నిలదీసి, ప్రజలకు అండగా ఉంటామన్నారు.
తెలంగాణలో మెజారిటీ శాతం ఉన్న బీసీల సమస్యల పరిష్కారం కోసం, కాసాని సూచనలతో త్వరలో కొన్ని కార్యక్రమాలు రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎవరికీ పట్టని, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తామని మండూరి సాంబశివరావు వెల్లడించారు.