- టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది
- ప్రతి ఎన్నికలో ఓడిపోయి టీడీపీ చతికిలపడింది
- టీడీపీ నేతలు ఇంకా పగటి కలలు కంటున్నారు
- ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏదేదో ప్రచారం చేస్తున్నారు
- ప్రధాని మోదీనే ఈయనను పిలిచినట్లు కలరింగ్ ఇస్తున్నారు
- ఏపీలో బీజేపీ సహకారం కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది
- వైయస్ జగన్‌కు ప్రజల సంక్షేమమే ఎజెండా
- వైయస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
ఎన్నికల్లో గెలవడానికి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఊతక్రర కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబును పిలిచినట్లుగా కలరింగ్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ప్రజల బాగోగులు పట్టవని, వెంటలేటర్‌పై ఉన్న తన పార్టీని ఎలా కాపాడుకోవాలన్నదే ఆయన తపనగా కనిపిస్తుందన్నారు. ఆయన ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని, ఢిల్లీ వెళ్లి ఏం చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎప్పుడు ఒంటరిగా గెలవలేని టీడీపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ సహకారం కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల సంక్షేమమే ఎజెండాగా ఉంటుందని, దీర్ఘకాలం ప్రజలకు మేలు చేసే విధంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, ఎన్నికల్లో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశారన్నారు. వైయస్ జగన్ అంటే ప్రజలని, ఆయనకు ప్రజలపైనే నమ్మకం ఉందని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..
2019 ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా..మళ్లీ కోలుకోలేని విధంగా సరైన కారణాలతో ఘోరంగా ఓటమి పాలైంది. ఇక చరిత్రపుటల్లో కలిపిపోయిన తీరుగా, వెంటలేటర్‌పై చేరిన టీడీపీ..ఈ మూడేళ్లలో వరుసగా వచ్చిన ఏ ఎన్నికైనా, ఉప ఎన్నికలో లోపాయికారీగా ఒప్పందం చేసుకున్నా ఘోరంగా ఓడిపోయింది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు మించి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారు. ప్రజల్లో మమేకకం కావడంతో మరింత ప్రజల విశ్వాసాన్ని చూరగొనడాన్ని ఒక పక్క రుజువు చేస్తుంటే..టీడీపీ అధ్యక్షుడు నిద్రలో పగటి కలలు కంటున్నాడు. కలువరింతల్లాగా మాట్లాడుతున్నాడు. ఒకప్పటి వైభవాన్ని తలుచుకుంటూ మళ్లీ మేమే అధికారంలోకి వస్తున్నామని సంధి ప్రేలాపణలు కంటిన్యూయస్‌గా పేల్చుతున్నాడు. నిజంగా లేస్తారేమో..గు్రరం ఎగురవచ్చేమో అన్నట్లుగా కొనసాగిస్తున్నారు. వాళ్లు చేసుకుంటూ వస్తున్న ప్రగల్భాలు, సెల్ఫ్ ఇప్నాటిజం చూస్తుంటే..కాకవికలమవుతున్న టీడీపీ తమ్ముళ్లను, చిన్నపాటి నాయకులను జారిపోకుండా పట్టుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇవి మితిమీరిపోయాయి. ఎబెట్టు స్థాయికి చేరాయి.
ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింభించాలి. ప్రజలే చిరునామాగా ఉండాలి. ప్రజలే అజెండా కావాలి. అప్పుడే ప్రజలు ఏమేరకు ఆదరిస్తారన్నది 2019 ఎన్నికల్లో రుజువైంది. అది జరగకపోతే ప్రజాస్వామ్యం అన్నది నిలబడదన్నది దేశ చరిత్రలో చాలాసార్లు రుజువైంది. ప్రజలు నిర్ణయిస్తున్నారంటే కాకమ్మ కథలు, మభ్యపెట్టే అంశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే చూశాం. మన రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ప్రజలు ఎట్లు మట్టికరిపించారో చూశాం. ప్రాంతీయ పార్టీల్లో కూడా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలా పట్టం కట్టారో చూస్తున్నాం. ఆ తరువాత జరుగుతూ వస్తున్న పరిణామాలు గమనించవచ్చు.
2011లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తరువాత 2014 ఎన్నికల్లో ప్రజలు అధికారానికి ఒక్కశాతం ఓటింగ్ తేడాతో తీర్పు ఇచ్చారు. 2019లో ప్రజలు వైయస్ జగన్‌ను విశ్వసించి అధికారం కట్టబెట్టారు. ఇంతకు మించి వేరే మార్గం ఉండదని చంద్రబాబుకు ప్రజలు చెబుతున్నా..ఆ^è రణలో చూపుతున్నా ప్రతిపక్ష నేత తీరు ఏమాత్రం మారడం లేదు. గత రెండేళ్లుగా వరుస ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా తీర్పుఇస్తున్నా..పిల్లి మొగ్గలు వేస్తున్నారు. విన్యాసాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబుకు తెలిసిన విద్యనే.
తాజాగా నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడి మీడియాతో తాను బట్టి పట్టి చెప్పిన మాటలే చెప్పారు. వైయస్ జగన్‌ను జనం ఇంటికి సాగనంపుతున్నారని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేశారు. ఆయనకు ప్రజల ఆశీస్సులు కోరాలనే ఆలోచన కూడా రాదు. ఆయన ప్రయత్నాలు, ఎత్తులు, ఢిల్లీలో కూడా కనిపించాయి. ఈసారి ప్రజలు వైయస్ జగన్‌ను రిజెక్ట్ చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు సరే..తనను ప్రజలు రిజెక్ట్ చేసి మూడేళ్లు అవుతుందని మరిచిపోయాడు. ఎట్లా ఉంటే ప్రజలు మోహం మీద చెబుతారన్నది మర చి, ఎట్లా ఉంటే ప్రజలు ఆదరిస్తారో 2019లో చూపారు. మళ్లీ అదే భ్రమలో చంద్రబాబు ఉన్నారు. ఏ ధైర్యంతో ఇలా అంటున్నారో.. ఒక్కసారిగా ఆయనలో ఇంత ఆత్మవిశ్వాసం ఎలా వచ్చిందబ్బా అని గమనిస్తే..మోదీ గారితో చంద్రబాబు కలిసి మాట్లాడుతున్న ఫొటో. ఇద్దరు మాట్లాడుతున్న ఫొటో..బీజేపీతోనో, మోదీతోనో పొత్తు పెట్టుకోవడం అన్నది డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే..నీ పాలనలో ఏపీ ఎలా ఉందో చెప్పుకోవాలి. లేదా ఇప్పుడు పాలన ఆ రకంగా లేదని చూపించి..మళ్లీ మేం వస్తే ఇలా చేస్తామని చెప్పే ప్రయత్నం చేయకుండా..ఎవరో ఒకరు నాకు ఊత క్రర కావాలి. గడ్డి పరక దొరికితేనే అడుగులు వేయగలమని చెప్పేందుకు బేషజం. నిన్న ఆ పత్రికల నిండా, ఎల్లో మీడియా నిండా కనిపించిందంతా చూస్తే..మరింత ఏపీలో ప్రతిపక్షంగా పిలువబడే టీడీపీ ఇంత హీనంగా ఉందా అన్నట్లుగా కనిపించింది.
మోదీ ఇది మీ ఇల్లే..ఎప్పుడైనా రావొచ్చు అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఎలాగో ఖండించలేరు. ప్రజలు ఏమనుకుంటారో అన్నది మరిచి ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో ఉపయోగపడే విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు మీకు ఇస్తాం. ఆంధ్రలో మాకు ఉపయోగపడండి అన్నట్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన ఎంపీలను బీజేపీలోకి పంపించారు. నిన్న కూడా మిగిలిన ఎంపీల గురించి మాట్లాడారేమో. ఏపీలో టీడీపీ విధానాలు ఏంటో ఆలోచన చేయకుండా, తెలంగాణలో మీకు ఉపయోగపడుతానని , కొసరు కింద వన్ ప్లస్ వన్ ఫ్రీ అన్నట్లుగా ఆఫర్ ఇచ్చినట్లు, మోదీ కూడా భలే భలే అన్నట్లుగా..వీళ్ల విశ్వాసం ఏంటో తెలియదు. 2014, 2019లో రాహుల్ ఏమయ్యారో. తెలంగాణలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుyì గా చంద్రబాబు తన మనిషిని పెట్టుకున్నారు.
2019లో పుట్టి మునుగుతుందని చంద్రబాబు బీజేపీ నుంచి దూరంగా ఉన్నట్లుగా ప్రయత్నం చేశారు. జాతీయ స్థాయిలో తన తఢఖా చూపిస్తానని తెలంగాణలో కాంగ్రెస్‌తో జత కట్టారు. మళ్లీ ఇప్పుడు వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్, చంద్రబాబు వాళ్ల ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పుకునే చరిత్ర ఏమైనా ఉందా? మేం ప్రశ్నిస్తున్నాం. మాకు చెప్పుకునేందుకు స్థిరమైన విషయాలు ఉన్నాయి. వైయస్ జగన్ అంటే ప్రజలు..ప్రజల్లో మా పార్టీ ఉందని చెప్పుకుంటాం. ప్రతి అంశం తాత్కాలికంగా నాలుగు ఓట్లు తెస్తుందన్నది కాకుండా దీర్ఘకాలికంగా ప్రజలకు ఏ మేలు జరుగుతుందన్నది మా పార్టీ ఉద్దేశ్యం. అసమానతలు తొలగించి రాష్ట్ర పురోగతి దిశగా పరుగులు పెట్టించడం. సాధికారత దిశగా అడుగులు వేయించడం. ఇవే చేస్తున్నాం. సస్పెన్స్ థ్రిల్లర్‌మాదిరిగా రాత్రికి రాత్రే చేసే విధంగా చేయడం లేదు. ముక్కుసూటి తనం వైయస్ జగన్ మనస్తత్వం. చెప్పిందే చేస్తారన్నది ప్రజలకు బాగా తెలుసు.
చంద్రబాబు నిన్న ఢిల్లీలో మాట్లాడింది. ఇక్కడ మాట్లాడింది అంతా గమనించినా, లేదా రైల్వే స్టేషన్లో కలిసి మాట్లాంది ఎంతైనా చెప్పుకోవచ్చు. లేదా మీ దేవాన్స్ ఎలా ఉన్నాడని అడిగి ఉండవచ్చు. లేదా నేను ఇచ్చిన మట్టి ఏమైందని ప్రధాని మోదీ అడిగి ఉండవచ్చు. మన ఉనికి ఉందా? అన్నది పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఆ పార్టీకి ఉందా? అన్న ప్రశ్నార్థకం అయినప్పుడు ఇవి కనిపిస్తాయి. దాంట్లో నుంచి వచ్చే తృప్తిని తీసుకొని క్యాడర్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏజ్‌లో చంద్రబాబు ఇంతలా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకు తెలిసిన విద్యగానే ఉంది. ప్రజలకు ఏం చేస్తున్నావు, ప్రజల్లో ఉన్నావా? ఎప్పటికప్పుడు గమనించి నిర్ణయాలు మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారా అన్నది మరచి..మాకు ఏం వస్తుందో అన్న కోణంలో ఆలోచనలు చేస్తున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.