– ఆడబిడ్డల పుస్తెలుతెంచుతూ, అడ్డగోలుగా అక్రమార్జనకు పాల్పడుతున్న జగన్ రెడ్డి మద్యంమాఫియాపై ప్రజాపోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న తెలుగుదేశం.. ఆ క్రమంలో వెబ్ సైట్ ఆవిష్కరించిన పార్టీనేతలు
– జగన్ రెడ్డి మద్యంమాఫియాలో ప్రజలకర్త్యవ్యాన్ని, వారుపోషించాల్సిన భాధ్యతను తెలియచేస్తూ, వారిని భాగస్వాముల్నిచేస్తూ శనివారం టీడీపీజాతీయ కార్యాలయంలో వెబ్ సైట్ (www.killerjbrands.com) ఆవిష్కరించిన మాజీమంత్రివర్యులు నక్కాఆనంద్ బాబు.. టీడీపీఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు… టీడీపీ అంగన్ వాడీ విభాగం రాష్ట్రఅధ్యక్షురాలు ఆచంట సునీత
వెబ్ సైట్ ఆవిష్కరించిన టీడీపీనేతలు అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఆ వివరాలు వారి మాటల్లోనే…
మద్యంతయారీ కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి….ఆయన మనుషులఅధీనంలోనే ఉన్నాయి . : నక్కా ఆనంద్ బాబు
ప్రభుత్వం అమలుచేస్తున్న మద్యంపాలసీతో కుటుంబాలకు కుటుంబాలే చిధ్రమై పోతున్నాయి. ప్రతిపక్షంలోఉన్నప్పుడు మద్యంవిక్రయాలు విచ్చలవిడిగా జరుగుతు న్నాయని, తాను అధికారంలోకి వచ్చినవెంటనే మద్యపాననిషేధం అమలుచేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక నిషేధకాదుకదా.. కనీసం మద్యంఅమ్మకాలను నియంత్రించడానికి కూడా ఎలాంటి చర్యలుతీసుకోలేదు.
స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో ఏముఖ్యమంత్రి చేయనివిధంగా రాష్ట్రంలో దారుణాతిదారుణంగా మద్యం, నాటుసారా, గంజాయి వంటి మాదకద్రవ్యాల విక్రయాలను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నా డు. మద్యంతయారీ కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి….. ఆయన మనుషులఅధీనంలోనే ఉన్నాయి. ముఖ్యమంత్రి, ఆయన బినామీలదెబ్బకుచాలామంది వారి డిస్టిలరీకంపెనీలు వదిలేసి పరారయ్యారు. కంపెనీలన్నీ వారిచేతుల్లోపెట్టుకొని, కల్తీమద్యాన్ని ప్రజలపైకి వదిలారు.
చీప్ లిక్కర్ తయారీకి ఒక్కోసీసాకు ప్రభుత్వానికి రూ.20లు ఖర్చవుతుంటే, అదే సీసాను రూ.250కి అమ్ముతున్నారు. టీడీపీహాయాంలో నాణ్యమైన మద్యమే తక్కువధరకు లభించేది. ప్రభుత్వం మద్యందుకాణాల్లో ఎందుకని డిజిటల్ చెల్లింపులకు అనుమతిఇవ్వడం లేదు? ప్రజలనుంచి మద్యంవిక్రయాలద్వారా దోచుకుంటున్నసొమ్మంతా కూడా సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి ఖజానాకు చేరుతోంది. ఈ మూడేళ్లలోనే అనధికారిక విక్రయాలద్వారా జగన్ రెడ్డి ఖజానాకు రూ.7వేలకోట్లవరకు చేరింది. జేబ్రాండ్స్ మద్యాన్ని ఎలా తయారుచేస్తున్నారో కూడాతెలియడంలేదు? ఆ మద్యాన్ని ప్రముఖల్యాబ్ లకు పంపి పరీక్షిస్తే వాటిలో విషపూరిత, హానికారక రసాయనాలుఉన్నాయని తేలింది.
అయినాకూడా ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా తనమద్యం అమ్మకాలను సమర్థించుకుంటున్నాడు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి 27మందిచనిపోతే, సెబ్ అధికారులు ఎఫ్ఐఆర్ లు నమోదుచేస్తే, సారా అమ్ముతున్న, తయారుచేస్తున్నవారిపైఎక్సైజ్ విభాగంవారు కేసులు నమోదు చేస్తే అవేవీ ముఖ్యమంత్రికి కనిపించలేదు. టీడీపీ సభ్యులను సభ నుంచి బయటకు పంపించి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పాడు.
జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి చనిపోయినవారి పోస్ట్ మార్టమ్ నివేదికలు… వారుఆస్పత్రిలో చికిత్సపొందినప్పుడు తయారుచేసిన కేస్ షీట్స్ ను పరిశీలిస్తే వారంతా సారావల్లే చనిపోయారని స్పష్టమవుతోంది. అయినాకూడా ముఖ్యమంత్రి అబద్ధాలుచెప్పడం ఆయనలోని కాఠిన్యానికి నిదర్శనం.
సారాతాగేవారంతా పేదలు… బడుగు బలహీనవర్గాలవారే. వారిబతుకులు బలితీసుకుంటూ, ఈ ముఖ్యమంత్రి తనమద్యం అమ్మ కాలుసాగిస్తున్నాడు. లక్షలలీటర్లబెల్లంఊట, సారాతయారీకి ఉపయోగించే ఇతరపదార్థాలను ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులు పట్టుకుంటున్నాకూడా ముఖ్యమంత్రి రాష్ట్రంలో నాటుసారా లేదు.
కల్తీమద్యంలేదని బుకాయిస్తున్నాడు. ముఖ్యమంత్రి తప్పుడు విధానాలు… దుర్మార్గపు ఆలోచనలు… ఆయన సాగిస్తున్నమద్యం దోపిడీపై ప్రజల్ని చైతన్యపరిచేందుకే తాము పూర్తివివరాలతో టీడీపీతరుపున ఒక వెబ్ సైట్ ఆవిష్కరిస్తున్నాం.
దానిలో ఈ ప్రభుత్వం అమ్ముతున్న జేబ్రాండ్స్ మద్యం వివరాలతోపాటు.. నాటుసారా అమ్మకాల సమాచారాన్ని కూడా పొందుపరిచాము. తాముఉంచిన సమాచారంతోపాటు.. ప్రజలుకూడా వారివారిప్రాంతా ల్లోఉన్న మద్యం సమస్యలు.. నాటాసారావివరాలను కూడా తెలియ చేయవచ్చు. అలానే ప్రభుత్వం అమ్ముతున్న మద్యం.. వాలంటీర్లు వైసీపీనేతలు సాగిస్తున్న మద్యం విక్రయాలు.. సారాఅమ్మకాల వివరాలనుకూడా ప్రజలు తమతో పంచుకోవచ్చు.
ప్రజలు, బాధ్యతగల యువకులు.. సమాజహితంకోరేవారంతా జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న మద్యంమాఫియాపై పోరాడటానికి తెలుగుదేశంపార్టీతో కలిసిరావాలని, తాము ఈ సందర్భంగా విజ్ఞప్తిచేస్తున్నాం.
తమపార్టీ ఆవిష్కరించిన వెబ్ సైట్లో ఏదివాస్తవం..ఏది అబద్ధం అనేది కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. అలానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన ప్రభుత్వ అమ్ముతున్న మద్యంతాగి చనిపోయినవారి వివరాలు.. వారి కుటుంబసభ్యుల ఆవేదనను కూడా వెబ్ సైట్లో తెలియచేశాము. వెబ్ సైట్ : www.killerjbrands.com.
ఆడబిడ్డలు చిన్నవయసులోనే పసుపుకుంకుమలు కోల్పోయి దిక్కులేనివాళ్లగా మిగిలిపోతున్నారు : ఆచంట సునీత
జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అక్రమమద్యం పాలసీఎందరు ఆడబిడ్డల తాళిబొట్లు తెంపేసిందో..ఎన్నికుటుంబాలను రోడ్లపాలు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. అధికారంలోకి రావడానికి ఆడబిడ్డలకు మాయమాటలుచెప్పిన జగన్ రెడ్డి.. మద్యపాననిషేధం హామీతో వారి ఓట్లను కొల్లగొట్టాడు. ముఖ్యమంత్రి అయ్యాకేమో సిగ్గులేకుండా ఏకంగా గాంధీజయంతి రోజునే కొత్తమద్యంపాలసీ తీసుకొచ్చి, పిచ్చిపిచ్చిమద్యం బ్రాండ్లను మార్కెట్లోకి వదిలాడు.
ఆఖరికి తన మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి… తనదోపిడీకి విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులను (ఉపాధ్యాయులను)కూడా మద్యందుకాణాలవద్ద కాపలాఉంచే దుస్థితికి ఈ ముఖ్యమంత్రి దిగజారాడు. మద్యపాననిషేధం అనిచెప్పిన వ్యక్తి రాష్ట్రంలోఏబ్రాండ్స్ మద్యం లేకుండాచేయాల్సిందిపోయి… ఆఖరికి నాసిరకం మద్యాన్ని తనకుచెందిన డిస్టిలరీల్లో తయా రుచేయించి ప్రజల్లోకి వదిలాడు. ఇంకా నిస్సిగ్గుగా ఇళ్లల్లో ఉండేమగాళ్లంతా మద్యంతాగితేనే ప్రభుత్వాన్ని నడపగలమని బహిరంగంగానే చెప్పుకొచ్చాడు.
భర్త తాగితే భార్యకు చేయూత కింద సొమ్ములిస్తానని, తండ్రి తాగితేనే కొడుక్కి అమ్మఒడి ఇస్తామని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పడం నీచాతీనీచం. కూలీపనులుచేసుకుంటూ పొట్టపోసుకునే ఎందరో పేద, మధ్యతరగతిమహిళలు జగన్ రెడ్డి సాగిస్తున్న మద్యంమాఫియాకు చిన్నవయస్సులోనే పసుపుకుంకుమలు కోల్పోయి దిక్కతోచనిస్థితిలో రోడ్లపాలవుతున్నారు. అలాంటి ఆడబిడ్డల ఉసురు ఈ ముఖ్యమంత్రికి కచ్చితంగా తగిలితీరుతుంది. జంగారెడ్డిగూడెంలో నాటుసారాతాగి 27మందిచనిపోతే, ముఖ్యమంత్రి సహా, వైసీపీనేతలు, మంత్రులంతా అక్కడ ఎవరూ చనిపోలేదని, కావాలనేచంద్రబాబుగారు రాజకీయాలు చేస్తున్నారని దుష్ప్రచారం చేశారు.
జంగారెడ్డిగూడెంలో చనిపోయినవారి పోస్ట్ మార్టమ్ నివేదికలు పరిశీలిస్తే… వారుసారా తాగే చనిపోయారని స్పష్టమవుతున్నాకూడా… ముఖ్యమంత్రి అసెంబ్లీసాక్షిగా పచ్చిఅబద్ధా లుచెప్పాడు. జగన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గుఉన్నా… అలాంటిప్రకటనలు చేస్తాడా? ఆఖరికి ప్రతిపక్షనేతగా ఉన్నచంద్రబాబుగారు జంగారెడ్డిగూడెం వెళితే, నాటుసారాతో తమవారిని కోల్పోయినవారిని ఆయనముందు గోడువెళ్లబోసుకోకుండా ప్రభుత్వం బెదిరించింది.
అధికారులను వారివద్దకు పంపి, తమవారు మామూలుగానే చనిపోయారని చెప్పమని బెదిరించారు. తాము ఆవిష్కరించిన వెబ్ సైట్లో జగన్ అమ్ముతున్న నాసిరకం మద్యం వివరాలతో పాటు.. ఈ మూడేళ్లలో నాటుసారా, జేబ్రాండ్స్ మద్యం తాగి చనిపోయినవారి వివరాలనుకూడా పొందుపరిచాము.