Suryaa.co.in

Andhra Pradesh

పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న

-పిన్నెల్లి బ్రదర్స్‌పై తీవ్ర విమర్శలు

పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతిని టీడీపీ నేత బుద్దా వెంకన్న కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2020లో జరిగిన మాచర్ల ఘటనపై పిన్నెల్లి బ్రదర్స్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

బుద్దా వెంకన్న మాట్లాడుతూ…

  • 11 మార్చి 2020న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను, బోండా ఉమ మాచర్లకు వెళ్లామని చెప్పారు. అక్కడ పిన్నెల్లి బ్రదర్స్ తమపై ఆకారణంగా దాడి చేశారని వెంకన్న ఆరోపించారు.
  • ఈ దాడిలో ముఖ్య పాత్రధారి తురకా కిషోర్, సూత్రధారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని పేర్కొన్నారు. పెద్ద పెద్ద రాళ్లతో తమ కారుపై దాడి చేశారని, ఈ దాడిలో పాల్గొన్న వారికి మున్సిపల్ చైర్మన్ పదవి ఆఫర్ చేసినట్లు తెలిపారు.
  • ప్రజలను భయపెట్టడానికి, తమపై దాడి ఒక సంకేతమని అన్నారు. మాచర్లను అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా పిన్నెల్లి మార్చారని వెంకన్న ఆరోపించారు.
  • తమపై దాడి జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎవరూ స్పందించలేదని పేర్కొన్నారు. “అధికారం ఉన్నప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేకపోతే పిల్లి రామకృష్ణారెడ్డి” అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.
  • తమను చంపడానికి పిన్నెల్లి పథకం వేసారని, ఈ దాడి కేసులో పిన్నెల్లి మొదటి ముద్దాయి అని తెలిపారు.  “నీకు ధైర్యం ఉంటే ఎదుర్కోండి, ఈ కేసులో న్యాయం జరిగే వరకూ పోరాడతాను,” అని పిన్నెల్లి కి సవాల్ విసిరారు.
  • తమపై దాడి చేసిన వీడియో క్లిప్పింగ్స్‌ను కూడా పిన్నెల్లి వర్గం వదిలిందని తెలిపారు. ఎస్పీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పవర్ ఉన్నప్పుడు ఒకలా, లేకపోతే మరొకలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
  • పిన్నెల్లి బ్రదర్స్ ప్రజాస్వామ్యంలో తిరగడానికి అనర్హుడని, ఆయన దుర్మార్గాలను అణచివేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE