-
జగన్ కు టీడీపీ నేతలు సవాల్
-
దమ్ముంటే చర్చకు రావాలంటూ పిలుపు
-
మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్ధన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి విలేఖరుల సమావేశం వివరాలు 11.12.2024
మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్ధన్ : ప్రజలు తమకు కావాలని కోరి తెచ్చుకొని మెచ్చుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. జగన్ ఏనాడైనా సమీక్షలు నిర్వహించారా? చంద్రబాబు ఎప్పుడూ సమీక్షలు నిర్వహిస్తుంటారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం సమీక్షలు చేస్తూ.. ప్రజలకు దగ్గరగా ఉండాలన్నదే చంద్రబాబు విధానం, నినాదం. 2014నుండి 2019 వరకు చంద్రబాబు పాలనలో ప్రజలు సుబిక్షంగా ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలన లో ప్రజలు కష్టాలు అనుభవించారు. వైసీపీ ప్రజలను నమ్మించి మోసం చేసింది.
2019-24 కాలంలో ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్రాలు కోల్పోయారు. బ్రిటీష్ వారితో పోరాడి సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్రాలను వైసీపీ పాలనలో మరోసారి కోల్పోవడం బాధాకరం, విచారకరం. ఆ భయంకర పరిస్థితులను భరించలేక ప్రజలు తిరుగుబాటు చేసి వైసీపీని ఓడించారు. వైసీపీ పాలనలో ప్రజలు తమ ఆస్తులకు, మాన ప్రాణాలకు రక్షణ లేకుండా బతికారు. ఆస్తుల విషయంలో బహిరంగంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. వారికి అనుకూలమైన వ్యక్తులను పెట్టి ప్రజల ఆస్తులను లూటీ చేశారు. ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక ఎవరితో చెప్పు కోవాలి. వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని నమ్మి మరలా చంద్రబాబుకే పట్టం కట్టారు.
ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో వచ్చిన ఆదాయం మీదనే ఆధారపడి తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది చంద్రబాబునాయుడే. కాగా మన రాష్ట్రంలో వైసీపీ పాలనలో వచ్చిన పరిశ్రమలు వైసీపీ దాష్టికానికి భయపడి వెనక్కి వెళ్లిపోయాయి. ఉపాధి లేక నిరుద్యోగులు బజారున పడ్డారు. వైసీపీ ఎన్నికలకు ముందు ప్రతి సంవత్సరం డిఎస్సీ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేశారు. పాలనా విషయంలో ప్రజలకు అన్నీ అగచాట్లే. సంక్షేమం లేదు.
జగన్ పాలనలో భద్రత లేని రోజులుండేవి. చంద్రబాబు పాలనకి, జగన్ పాలనకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం 5 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. 4 లక్షల 65 వేల కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగాయి. ప్రజలు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఇది మంచి ప్రభుత్వమని మెచ్చుకుంటున్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య :
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వంగా మారి అధికారంలోకి వచ్చి నేటికి ఆరు నెలలు గడిచింది. జూన్ 12న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నాటి నుండి ఈ రాష్ట్రానికి దశ తిరిగింది. వైసీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది. 6 నెలలో కూటమి ప్రభుత్వం 20 టాప్ విజయాలు. సాధించింది.
1. చంద్రబాబు ప్రభుత్వం పింఛను ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు 1వ తేదీనే ఇళ్ల వద్ద ఇవ్వడం జరుగుతోంది. ఏడాదికి రూ.33 వేల కోట్లు, ఐదేళ్ళల్లో రూ.1.60 లక్షల కోట్లు పింఛన్‌లకు ఖర్చు. ఇది దేశంలోనే రికార్డ్. గత జగన్ ప్రభుత్వం మొదటి 4 నెలల్లో పింఛన్‌లు రూ.250 పెంచడం తప్ప మరే ఇతర నవరత్న హామీలను అమలు చేయలేదు.
2. 198 అన్న క్యాంటిన్లను తిరిగి ప్రారంభించి పేదల ఆకలి తీర్చుతోంది.
3. దీపం-2 కింద ఇప్పటికే 80 లక్షలకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్ల బుక్ చేసుకున్నారు.
4. రూ.861 కోట్లతో రోడ్ల మరమ్మత్తుల పనులు ప్రారంభం. సంక్రాంతిలోగా రోడ్ల నిర్మాణం పూర్తి.
5. ఉచిత ఇసుక సరఫరా వల్ల 125 వృత్తులు, వ్యాపారాలకు చేయూత.
6. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా. మద్యం మాఫియా ఆట కట్.
7. ప్రజారాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరానికి రూ.12 వేల కోట్లు కేంద్రం నిధుల సాధన
8. రూ.4,500 కోట్లతో 13 వేల పంచాయితీల్లో 30 వేల పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి నాటికి పూర్తి.
9. డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ నియామకాలు, 6100 పోలీసు ఉద్యోగ నియామకాలకు చర్యలు.
10. యాభైకి పైగా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల రాకతో 4.60 లక్షలకు పైగా పెట్టుబడులు, తద్వారా 5 లక్షల మందికి ప్రత్యక్షంగా
ఉద్యోగావకాశాలు రానున్నాయి.
11. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి భూబకాసురల నుండి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రూపకల్పన.
12. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు. విపత్తు సాయం హెక్టారుకు రూ.10 వేల నుండి రూ.25 వేలకు పెంపు… 48 గంటల్లోనే ధాన్యం సేకరణ నిధులు రైతు ఖాతాల్లో జమ.
13. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం. ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు. నియంత్రణకు ‘ఈగల్’ టీమ్ ఏర్పాటు.
14. కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం… కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడల్లో రూ.25 వేల కోట్లు పెట్టుబడులు, 75 వేల మందికి ఉపాధి కల్పనకు కేంద్రం హామీ సాధన.
15. విశాఖ రైల్వే జోన్‌కు 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయింపు. విశాఖ ఉక్కు పరిరక్షణ. విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా 10 వేల ఉద్యోగాలు.
16. రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకు కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీ సాధన.
17. బీసీ సంక్షేమానికి రూ.39 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపు.
18. ఎస్సీ సంక్షేమానికి రూ.18 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపు.
19. ఎస్టీ సంక్షేమానికి రూ.7.5 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపు.
20. మైనారిటీ సంక్షేమానికి రూ.4 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపు.
జగన్ మోసపు పరిపాలన బాగుందా? కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం బాగుందా అని ప్రజలే గ్రహించాలి. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలని చెప్పి ప్రజల్ని మోసం చేసింది. వైసీపీ ప్రభుత్వం పింఛన్ 250 మాత్రమే పెంచి తన అసమర్థ పాలనను చాటుకుంది. చంద్రబాబు వెయ్యి రూపాయలుపెంచి సమర్థతను చాటుకున్నారు. ఈ వ్యవహారం 6 నెలలుగా కొనసాగుతోంది. 30 వేల కోట్ల చొప్పున లక్షా 60 వేల కోట్ల రూపాయలు పింఛన్ రూపేణ ప్రజలకు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం. జగన్ పేదవాదడికి అన్నం పెట్టారా? చంద్రబాబు 189 అన్న క్యాంటిన్లను పెట్టి పేదల క్షుద్బాధను తీర్చారు.
దీపం -2 పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలెండర్ కావాలని బుక్ చేసుకున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. రోడ్ల మరమ్మత్తు పనులకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గర్భిణీ స్త్రీలు ఈ అతుగుల గతుకుల రోడ్లపై ప్రయాణం చేస్తే రోడ్లపైనే కాన్పు కాగలదని షర్మిల నే స్వయంగా కామెంట్ చేసింది. 860 కోట్లతో రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుకను అందిస్తుండడంతో విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద కళకళ లాడుతోంది. వైసీపీ హయాంలో అన్నమో రామచంద్ర అని అలమటించేవారు. కాని నేడు అక్కడ కనుల పండుగగా ఉంటోంది. ప్రజల బాగోగులు విస్మరించిన వ్యక్తి జగన్.
కూటమి ప్రభుత్వం ప్రజా రంజకంగా పరిపాలన సాగిస్తోంది. జగన్ తన ప్రభుత్వ హయాంలో వాలంటీర్లను పెట్టి వారి జీవితాలను నాశనం చేశారు. నరకాసుర, రాక్షస పాలన జగన్ ది. చంద్రబాబు భూకబ్జా దారులను రక్షించడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేసి ఊరట కల్పించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. తుఫాను సమయంలో బూటు కు కూడా మట్టి అంటకుండా పర్యటించిన వ్యక్తి జగన్. అన్ని ప్రాంతాలను సమ దృష్టితో చూడాలన్నదే చంద్రబాబు ఉద్దేశం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ లో అధిక మొత్తంలో నిధులు కేటాయించారు. జగన్ తన కుంభకోణాల నుంచి దృష్టిని మరల్చడానికి చేయని ప్రయత్నం లేదు. తన చెల్లెలిపై కూడా కేసులు పెట్టిన ఘనత జగన్ ది. శ్లేష్మంలో పడ్డ ఈగలా జగన్ కొట్టు మిట్టాడుతున్నాడు.
నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబుపై బాబాయి హత్య కేసు నెట్టడానికి ప్రయత్నించారు. బాబాయిన హత్య చేయించే ధైర్యం ఎవరికీ లేదు, ఒక్క జగన్ కు తప్ప. రాష్ట్ర ఖజానా దివాలా తీసినా.. ఆరు నెలల్లోనే 400కు పైగా అభివృద్ధి, సంక్షేమాల్ని చంద్రబాబు అందించారు. జగన్ అతి మంచితనంవల్ల అధికారం పోయిందనడం అతిశయోక్తి కాక మరేమిటి?
ఇవేకాక జగన్ అబద్ధాల కోరు. జగన్ ఆడిన అబద్ధాలు మచ్చుకు కొన్ని…
జగన్ ఆడిన అబద్ధాలు :
అబద్ధం
1. నారాసురరక్త చరిత్ర – జగన్ వ్యాఖ్య
2. వివేకా గుండెపోటుతో మరణించాడు – సాక్షి స్క్రోలింగ్స్
3. చంద్రబాబు ఇంట్లో శ్రీ వారి పింక్ డైమండ్ – విజయసాయిరెడ్డి ప్రకటన
4. 39 మందిలో 35 మంది కమ్మ డీఎస్పీలకు ప్రమోషన్
5. చంద్రబాబు ప్రభుత్వం 31 మందిని హత్య చేసింది
6. అమరావతి మునిగిపోయింది
7. కోడికత్తితో జగన్ హత్యకు కుట్ర చేశారు
8. పట్టిసీమ ఒట్టిసీమ
9. అవినాష్ రెడ్డి పిల్లోడు – జగన్ వ్యాఖ్య
10. అతిమంచితనం వల్లే ఓడిపోయాను – జగన్ ప్రకటన
వాస్తవం
1. ‘జగనాసుర రక్తచరిత్ర’ అని సిబిఐ చార్జిషీట్ వెల్లడి
2. గొడ్డలి వేటుతో నరికి చంపారు – దస్తగిరి వాగ్మూలం
3. టీటీడీలో పింక్ డైమెండ్ అనేది రికార్డుల్లో లేదు – మాజీ ఈవో ధర్మారెడ్డి
4. ప్రమోషన్ పొందిన కమ్మ డిఎస్పీలు ముగ్గురే – మాజీమంత్రి గౌతంరెడ్డి
5. పేర్లు ఇవ్వమంటే నేటికీ ఇవ్వక చేతులెత్తేశారు
6. హైదరాబాద్, చైన్నై వంటి మహా నగరాలు మునిగాయి గాని అమరావతి మునగలేదు
7. సానుభూతి కోసం జగన్ ఆడిన డ్రామా అని కోడి కత్తి శ్రీను బెయిలు ఉదంతం రుజువు చేసింది.
8. పట్టిసీమ ద్వారా రూ.50 వేల కోట్లు పంట దిగుబడులు వచ్చాయి.
9. పిల్లోడు వివేకా రక్తపు మడుగు ఎలా చెరిపించాడు? సి.ఐ. శంకరయ్యను ఎలా మేనేజ్ చేశాడు?
10. అతి దోపిడీ, నేరాలు, ఘోరాల వల్లే జగన్ రెడ్డి ఓటమి
గురజాల మాల్యాద్రి :
జగన్ రెడ్డి తెలుగుదేశం హామీల అమలులో ఫెయిల్ అయిందని అబద్ధాలు ఆడుతున్నాడు. వైసీపీపై నిందలు వేస్తున్నారని పదే పదే మాట్లాడడం శుద్ధ అబద్దం. ప్రతిపక్ష నేతగా జగన్ ఫెయిల్ అయ్యాడుగానీ టీడీపీ ప్రభుత్వం ఫెయిల్ కాలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి 10 లక్షల కోట్ల అప్పు ఉంది. తక్షణం చెల్లించాల్సిన బకాయిలు లక్ష కోట్లు ఉంది. జగన్ ఖజానాను దివాలా తీయించాడు. అయినా 6 నెలల్లోనే చంద్రబాబు 400 మంచి పనులతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాడు.
ఏ రాష్ట్రంలో కూడా మొదటి ఆరు నెలల్లోనే ఇన్ని పనులు చేసిన ప్రభుత్వం లేదు. చంద్రబాబు అనుభవం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రతిపక్ష నేతగా వైఫల్యం చెందింది జగన్ రెడ్డే. మళ్లీ హామీలు అమలు చేయలేదని మాపై బురద జల్లడం విడ్డూరంగా ఉంది. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మొదటి ఆరు నెలల్లో ఆయన కేవలం 3 పనులు మాత్రమే చేశాడు. మొదటిది 250 రూపాయలు పెంచన్ పెంచడం, నేడు చంద్రబాబు ఒకేసారి వెయ్యి రూపాయలు పింఛన్ పెంచాడు. రెండవది ఆటో డ్రైవర్లకు పది వేల రూపాయలు ఇవ్వడం. మరో వైపు మద్యం రేట్లు పెంచి ఆటో డ్రైవర్ల వద్ద లక్షలు కొట్టేయడం . రైతు భరోసా ఇవ్వడం తప్ప మిగిలిన నవరత్న పథకాల హామీలు ఏవీ అమలు చేయలేదు. జగన్ అధికారం చేపట్టేనాటికి వడ్డించిన విస్తరిలా చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేశారు.
అయినా 6 నెలల్లో నవరత్నాల హామీలను జగన్ అమలు చేయలేకపోయాడు. దీనిపై దమ్ముంటే చర్చకు నీ తొత్తు సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తారా? లేక జగనే వస్తాడా? చర్చకు సిద్ధం. నీ మేనిఫెస్టోలోని 90 శాతం అమలు పర్చలేదు. ఇప్పడు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతావు? మీరు చేసిన కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారు. జగన్ రెడ్డి నోరు తెరిస్తే మాట్లాడేవన్నీ అబద్ధాలే అని ప్రజలు అర్థం చేసుకోవాలి.
కుల, మత, ప్రాంతీయ చిచ్చు పెట్టి ఈరోజు తన దోపిడీ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి దుర్మార్గాలకు తెర లేపుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గతంలో రత్నాంచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్దం చేయించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు చేసిందేమీ లేదు. జగన్ 5 సంవత్సరాల్లో నీటి ప్రాజెక్టులకు ఇచ్చింది రూ. 3 వేల కోట్లే. చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టింది రూ.12 వేల కోట్లు. అన్ని ప్రాంతాలను సమ దృష్టితో అభివృద్ధి చేయడమే చంద్రబాబు లక్ష్యం, జగన్ అన్ని ప్రాంతాలను ముంచి అఘాతంలోకి నెట్టాడు.