– ముఖ్యమంత్రి విద్యారంగాన్నికూడా లాభాపేక్షతో చూస్తూ, వ్యాపారాంశంగా మార్చాడు
– టీడీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసంతో ఎవరెస్ట్ ను అధిరోహించిన దళితవిద్యార్థులు, నేడు జగన్ రెడ్డి నిర్వాకంతో అమ్మఒడికి చేయిచాచాల్సిన దుస్థితికి వచ్చారు
• విద్యతోనే పౌరుల నైతికాభివృద్ధి సాధ్యమని, తద్వారానే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్న అంబేద్కర్ వ్యాఖ్యల్ని జగన్ ప్రభుత్వం విస్మరించింది
• ఉపాధ్యాయుల్ని మద్యందుకాణాలవద్ద నిలబెట్టినప్పుడే ముఖ్యమంత్రికి విద్యారంగంపై ఉన్న చిత్తశుధ్ది ఏమిటనేది తేలిపోయింది
• చంద్రబాబుహయాంలో బడ్జెట్లో విద్యారంగానికి 15శాతం నిధులుకేటాయిస్తే, జగన్ 10శాతంలోపు ఇచ్చిసరిపెట్టాడు
• సీపీఎస్ వారంలోరద్దు చేస్తానని జగన్ రెడ్డి 120సార్లుచెప్పాడు. ముఖ్యమంత్రి దృష్టిలో 7రోజులు అంటే 3సంవత్సరాలా?
విద్యారంగానికి చంద్రబాబు బడ్జెట్లో 15శాతంనిధులిస్తే, జగన్ ఈమూడేళ్లలో 10శాతంలోపు కేటాయింపులతో సరిపెట్టి విద్యారంగంపై తనకున్న నిర్లక్ష్యాన్ని చాటుకున్నాడు : కే.ఎస్.జవహర్
“సమాజగతిని మార్చే విద్యవిషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రి లాభాపేక్షకు రాష్ట్రవిద్యారంగం నాశనమైంది. విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల్ని లిక్కర్ షాపుల వద్ద నిలబెట్టినప్పుడే జగన్ రెడ్డికి విద్యారంగపై ఉన్న చిత్తశుద్ధేమిటో అర్థమైంది.
కరోనాసమయంలో నాడు-నేడు పేరుతో అత్యధిక ఉపాధ్యాయుల మరణానికి ముఖ్యమంత్రి కారకుడయ్యాడు. నూతన విద్యావిధానం అంటూ ఎవరిని సంప్రదించి ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకున్నాడు? భారతదేశ నిర్మాణం నాలుగ్గోడలమధ్య నిర్మితమవుతోంది అన్న కొఠారి కమిషన్ నిబంధనల అమలుకు ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బందేమిటి? మంత్రులంతా వేలిముద్రగాళ్లు అవ్వబట్టే, రాష్ట్రంలో విద్య వ్యాపారాంశమైంది. చంద్రబాబుగారు తనహయాంలో బడ్జెట్లో 15శాతం నిధులు విద్యకు కేటాయిస్తే, జగన్ వచ్చాక తనమూడేళ్లపాలనలో ఎప్పుడూకూడా 10శాతంలోపే కేటాయింపులు చేశాడు. విద్యకు ముఖ్యమంత్రి అతితక్కువప్రాధాన్యత ఇస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి పిల్లలేవిదేశాల్లో చదవాలా.. దళితులు చదవకూడదా?
విద్యారంగప్రగతి, ఉపాధ్యాయసంక్షేమానికి అన్న నందమూరి తారకరామారావు గారు అత్యధికప్రాముఖ్యత ఇచ్చారు. రీగ్రూపింగ్ స్కేల్స్ విధానంతో ఉపాధ్యాయులకు తహసీల్దార్ తో సమానమైన వేతనం వచ్చేలాచేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది. ఐటీ లాంటి ఉద్యోగాలనుకూడా కాదని, యువత ఉపాధ్యాయవృత్తిలోకి వస్తున్నారంటే దానికి కారణం ఆ మహానుభావుడే. చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రతిఏటా డీఎస్సీతో ఉపాధ్యాయఖాళీలను భర్తీచేశారు. గతప్రభుత్వంలోకూడా 17,500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీచేశారు. జగన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 3వేలపాఠశాలలుమూసేసిందికాక, 25వేల ఉపాధ్యాయఖాళీల భర్తీకిపాతరేశారు. ఉపాధ్యాయఖాళీల భర్తీకి తిలోదకాలు ఇచ్చి, తద్వారా మిగిలినసొమ్ముని వాలంటీర్లకుఇస్తున్న జగన్ రెడ్డి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు.
విద్యద్వారా దళితులు అభివృద్ధిచెందడం ఈ ముఖ్యమంత్రికి సుతరామూ ఇష్టంలేదు. దళితుల ఆత్మగౌరవానికి విద్యాభ్యాసం అనేది చాలాచాలా ముఖ్యమైందనే సిద్ధాంతాన్ని టీడీపీప్రభుత్వం బలంగా నమ్మింది. ఆ కోవలోనే జీఎం.సీ.బాలయోగి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా గురుకులపాఠశాలలు నెలకొల్పింది. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ పాఠశాలలు నేడు సౌకర్యాలలేమితో కునారిల్లుతున్నాయి.
టీడీపీప్రభుత్వంలో ఆత్మవిశ్వాసం తో దళితబిడ్డలు ఎవరెస్ట్ ను అధిరోహిస్తే, నేడు అమ్మఒడి ఇస్తున్నానంటూ ఈముఖ్యమంత్రి వారిని చేతులుచాచే దుస్థితికి తీసుకొచ్చాడు. నాడు-నేడుతో జగన్మోహన్ రెడ్డి సాధించింది పాఠశాలలకు రంగులద్దడమే. చంద్రబాబు పాఠశాలల్ని విద్యార్థులకు అందు బాటులోఉంచితే, జగన్ రెడ్డి గ్రామాలకు పాఠశాలల్ని దూరంచేశాడు. రాష్ట్రంలో 490కు పైగా మున్సిపల్ పాఠశాలల్ని ఎందుకుమూసేశారు? ఎయిడెడ్ పాఠశాలల్ని జగన్ రెడ్డి నిజంగానే డెడ్ చేశాడు. అమ్మఒడిని ముఖ్యమంత్రి బోగస్ గా మార్చాడనటానికి, ఆయన భార్యభారతి మాటలే నిదర్శనం. విద్యలేని వింతపశువు నిర్వాకాలు రాష్ట్ర విద్యారం గంపాలిటశాపంగామారాయి. ఉపాధ్యాయసంఘాలు పాఠశాలల్నికాపాడుకోవడానికి రోడ్డెక్కాల్సిన సమయం వచ్చింది.”
దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన, మేలైన విద్యఅందకూడదన్నదే జగన్ ప్రభుత్వలక్ష్యం : పీతలసుజాత
“దేశాభివృద్ధికి నిజమైన చిహ్నాలు అద్దాలమేడలు, రంగులగోడలుకాదని, పౌరుల నైతికఅ భివృద్ధే నిజమైన దేశాభివృద్ధి” అని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ చెప్పారని, నాణ్యమైన విద్యతో నే విద్యార్థులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారన్న వాస్తవాన్ని విస్మరించిన వైసీపీ ప్రభు త్వం, రాష్ట్ర విద్యారంగాన్ని భ్రష్టుపట్టించింది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎక్కువగా చదివేది దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థులే. అలాంటి విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నతమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం, ఆపనిచేయకపోగా సజావుగా,సక్రమంగా నడుసున్న ప్రభుత్వప్రాథమికపాఠశాలలు, కళాశాలలు, ఇతర ఉన్న త విద్యాసంస్థల్ని మూతపడేస్థాయికి తీసుకొచ్చింది. అమ్మఒడిపేరుతో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు సకాలంలో అందించకుండా ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. రాష్ట్రంలో 84లక్షల మంది విద్యార్థులుంటే, వారిలోకేవలం 40లక్షలమందికి మాత్రమే అమ్మఒడి పేరుతో డబ్బులిస్తూ, 44లక్షమందికి తీరనిద్రోహంచేస్తున్నారు. ఏదైనా కుటుంబంలో అమ్మఒడి అందితే, అదేఇంటినుంచి ఉన్నత చదువులుచదివేవారు ఎవరైనా ఉంటే, వారికి ఫీజురీయింబర్స్ మెంట్ సాయం ఇవ్వకుండా నిలిపేస్తున్నారు.
నాణ్యమైన విద్యాబోధన అందించే రాష్ట్రాలజాబితాలో దేశంలోనే ఏపీని చంద్రబాబుగారు 3వస్థానంలో నిలిపారు. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి పుణ్యమాఅని రాష్ట్రం ర్యాంక్ 19వస్థానాని కి పడిపోయింది. ఈ ఒక్కటిచాటు రాష్ట్రవిద్యావ్యవస్థలను ఈ ప్రభుత్వం ఎంతలా దిగజార్చిందో చెప్పడానికి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఎస్సీ,ఎస్టీలకు విద్యనందించే గురుకులపాఠశాలలను జగన్ ప్రభుత్వం బాగా తగ్గించింది. టీడీపీప్రభుత్వం విదేశాల్లోవిద్యాభ్యాసం కోసం వెళ్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రూ.10నుంచి రూ.15లక్షలవరకుఅందించింది. జగన్ అధికారంలోకి రాగానే దాన్ని పక్కనపెట్టేశాడు. ఆఖరికి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనాన్ని కూడా నిలిపేశాడు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలలన్నింటినీ ప్రభుత్వం మూసేసింది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన మేలైనవిద్య అందకూడదన్నదే వైసీపీప్రభుత్వ అంతిమ లక్ష్యంగామారింది. ఇలాంటి కుటిలఆలోచనల్ని ప్రభుత్వం మానుకోవాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగఫలాలు పేదలకు అందాలని, అంటరానితనాన్నిరూపుమాపేందు కు విద్యాభ్యాసం చాలాముఖ్యమైనదని భావించారు.
కానీ ఈప్రభుత్వం ఆయన ఆలోచనలకు పూర్తివిరుద్ధంగా వ్యవహరిస్తోంది. విద్యారంగాన్ని ఉద్ధరిస్తున్నామంటూ, నాడు-నేడుపేరుతో, పాఠశాలలకు రంగులేసేపేరుతో రూ.3,500కోట్లవరకు వైసీపీప్రభుత్వం దోచేసింది. కేంద్ర విద్యా విభాగం వారు విడుదలచేసిన నాస్ (నేషనల్ ఎచీవ్ మెంట్ సర్వే-2020) రిపోర్ట్ ప్రకారం ఏపీలోని 3, 4, 5తరగతుల విద్యార్థుల పరిస్థితి చాలాదారుణంగా ఉంది. వారిలో బోధనాంశా లను గ్రహించేస్థాయి చాలాచాలా తక్కువగా ఉన్నట్లు నాస్ నివేదిక పేర్కొంది.
చంద్రబాబుగారి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులగ్రాహాకశక్తి, నాణ్యమైనవిద్యాబోధన, పాఠ్యాంశాలస్థాయి లాంటివి చాలా మెరుగ్గాఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే, ఇంగ్లీష్ మీడియం అంటు న్నారు. ప్రాథమిక విద్యాభ్యాసానికి అవసరమైన మౌలికసదుపాయాలు, వనరులు సమకూర్చకుండాఎలాంటి మీడియాలు పెట్టిన ఉపయోగంలేదు. చంద్రబాబుగారి హయాంలో నే మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధనచేపట్టాలని నిర్ణయించారు. పట్టణ స్థాయిలో ఉండే విద్యార్థులు ఇంగ్లీష్ లో చెప్పే పాఠ్యాంశాలను గ్రహించే స్థాయిని బట్టి, తరువాత దాన్ని గ్రామ స్థాయిలోకి విస్తరింప చేయాలనుకున్నారు.
ఆయన ఒకఆలోచనతో విద్యా రంగాన్ని ముందుకునడిపిస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా భ్రష్టు పట్టిం చారు. టీడీపీప్రభుత్వంలో హైస్కూల్ స్థాయిలో విద్యాభ్యాసం చేసే విద్యార్థినులకు పాఠ్యపు స్తకాలు, యూనిఫామ్ తో పాటు, సైకిళ్లు అందించడం జరిగింది. అలానే ప్రతి ఉన్నత పాఠశాలలో వర్చువల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటుచేయడం జరిగింది. బాత్రూమ్ లు, తాగునీరు వంటి సదుపాయాలకు లోటు లేకుండా చూశాము. అలాంటివేవీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కనిపించడంలేదు. ఇంత జరుగుతున్నా విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమైపోతున్నా మంత్రు లంతా మూకుమ్మడిగా ముఖ్యమంత్రిని సమర్థిస్తున్నారు. మంత్రుల్లోనే కొందరు ముఖ్యమంత్రి తీరుని తప్పుపడుతున్నారు.
‘ఫేడ్ అవుట్ సీఎం’ అని, ‘మనమీటింగులకు జనాలు రావడంలేదు అని’ మరోమంత్రి, ‘జగనన్న ఇరిటేషన్ లో ఉన్నాడు అని’ మరోమంత్రి అంటు న్నారు. “ఒకటిరెండు అత్యాచారాలకే ఏదో అయిపోయినట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నా యని, తల్లులపెంపకం సరిగాలేకనే అత్యాచారాలు జరుగుతున్నాయి అని” మరోమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రిపై మంత్రుల అభిప్రాయమేఇలాఉంటే ప్రజల అభిప్రాయం, వారి ఆగ్రహం ఎలా ఉంటాయో అర్థంచేసుకోండి. ఇకనైనా ప్రభుత్వం తీరుమార్చుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని డిమాండ్ చేస్తున్నాం.”
జగన్ రెడ్డి ప్రభుత్వపాఠశాలల్ని మూసేస్తూ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అండగా నిలుస్తున్నాడు, 9770ప్రాథమిక పాఠశాలలకు మంగళం పాడాడు : ఏ.ఎస్.రామకృష్ణ
“జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవిద్యావ్యవస్థను అస్తవ్యస్తంచేసింది. 2019లో ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దుచేస్తానని జగన్ 120సార్లు చెప్పా డు. ముఖ్యమంత్రి లెక్కలో 7రోజులు అంటే 3 సంవత్సరాలా? ఉపాధ్యాయులు, వారి కుటుంబాల ఓట్లుకొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి, సీపీఎస్ రద్దు చాలాలోతైంది అంటూనంగనాచి కబుర్లుచెబుతున్నాడు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్అని ముఖ్యమంత్రి అనడం ముమ్మాటికీ ఆయన చేతగానితనమే. మేనిఫెస్టో గురించి గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి, ఎన్ని హామీలు నెరవేర్చాడు. ప్రతి తల్లీతండ్రీ వారి పిల్లలకు నాణ్యమైన విద్యకావాలనే ఆశఉంటుంది. వారిఆశల్ని వమ్ముచేస్తూ, పిల్లలులేరన్నసాకుతో 418 ఎయిడెడ్ పాఠశాల లకు జగన్ రెడ్డి మంగళంపాడాడు. స్కూల్ మ్యాపింగ్ పేరుతో 3, 4, 5 తరగతుల్ని హైస్కూళ్లలో కలపడం, 1, 2 తరగతుల్ని అంగన్ వాడీల్లో కలపడమనేది దేనికోసం చేశారు? జగన్ రెడ్డి ప్రభుత్వపాఠశాలల్ని మూసేస్తూ, ప్రైవేట్ పాఠశాలల్ని ప్రోత్సహిస్తున్నాడు. చంద్రబాబుగారు రేషనలైజేషన్ కింద ఒకరిద్దరు విద్యార్థులుండే పాఠశాలల్ని అందుబాటులో ఉండే ఇతరపాఠశాలల్లో విలీనంచేయాలన్నారు.
అంతేగానీ పూర్తిగా వాటినిలేకుండా చేయమనలేదు. దానికే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోఉన్నప్పుడు కాకిగోలచేశాడు. ఇప్పడు ముఖ్యమంత్రి అయ్యాక అసలుగ్రామాల్లో ఎక్కడా ప్రభుత్వపాఠశాలే ఉండకూడ దన్నట్లు వ్యవహరిస్తున్నాడు. విలీనంపేరుతో, అధికారులతో తప్పుడు లెక్కలు చెప్పించిన ముఖ్యమంత్రి 3కిలోమీటర్ల లోపుండే 9,773 పాఠశాలల్నిరద్దుచేశాడు. చిన్నచిన్న పిల్లలునడిచి 3కిలోమీటర్లదూరంలో ఉండే పాఠశాలకు వెళ్లగలరా అన్నఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఎందుకురాలేదు? ప్రాథమిక పాఠశాలలన్నీ విద్యార్థులకు వాకబుల్ డిస్టేన్స్ లో నే ఉండాలని కొఠారి కమిషన్ తననివేదికలో చాలాస్పష్టంగాచెప్పింది. కానీ ముఖ్యమంత్రి ఆ నిబంధనను, కొఠారి కమిషన్ నివేదికనే తుంగలో తొక్కాడు. ఇంగ్లీష్ మీడియం గురించి గొప్పలుచెబుతున్న ముఖ్యమంత్రి, టీడీపీహాయాంలోనే మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్లమాద్యమబోధనకు అనుమతించారనే వాస్తవంమర్చిపోతేఎలా?
చంద్రబాబు హయాంలో మున్సిపల్ పాఠశాలలన్నీ విద్యార్థులతో కళకళలాడాయి. ఏసీ (ఆంధ్రా క్రిస్టియన్ ), లయోలాకళాశాల, సిద్ధార్థ కళాశాల లాంటి ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను కొట్టేయా లన్న దురాలోచనతోనే ముఖ్యమంత్రి జీవోనెం-42 తీసుకొచ్చాడు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉద్యమించినా ముఖ్యమంత్రి నేటికీ ఆసమస్య పరిష్కరించలేదు. ఇప్పటికీ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తుల్ని తాకట్టుపెట్టాలని చూస్తోంది. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల్ని పర్మినెంట్ చేస్తానన్న హామీనికూడా జగన్ విస్మరించాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాన్ని రూ.18వేలనుంచి, రూ.37వేలకు పెంచి నెలనెలా క్రమంతప్పకుండా చెల్లించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి హీనంగా తయారైంది. ఓట్లకోసమే ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ముని ముఖ్యమంత్రి నేరుగా తల్లులఖాతాల్లో వేస్తున్నాడు. 40శాతం కళాశాలలు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు తమకు అందడంలేదని కోర్టుకువెళ్లాయి. దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధా నం చెబుతారు?
చంద్రబాబు టీచర్ల ప్రమోషన్లకోసం కేంద్రప్రభుత్వంతో నేరుగా సంప్రదించి, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తీసుకురావడానికి శ్రమించారు. మూడేళ్లుగా ఆ అంశంకోర్టులో ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఏనాడూ దానిపైమాట్లాడలేదు. విశ్వవిద్యాలయాల్లో జరిగే దురాగతాలు, నీచసంస్కృతిపై జగన్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదు? జగన్ రెడ్డి తన అడుగులకు మడుగులొత్తే వారిని వైస్ ఛాన్స్ లర్లుగా నియమించబట్టే విశ్వవిద్యాలయాలు అలా తయారయ్యాయి. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు ఏంచేస్తున్నారో పట్టించుకోరా? తనవర్గం వారైతే ఏంచేసినా, ఎలాప్రవర్తించినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోరా? ముఖ్యమంత్రి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు అనడానికి, బడ్జెట్ లో చేస్తున్నకేటాయింపులే నిదర్శనం.”