Suryaa.co.in

Andhra Pradesh

భూకబ్జాలకు జాతీయ విధానంగా చేసుకున్న తేదేపా

-మైనార్టీలపై దాడులకు అఫ్గాన్ ప్రభుత్వం చెక్ పెట్టాలి
-ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి

తెదేపా నేత అయ్యన్నపాత్రుడి ఆక్రమణ తండ్రీకొడుకు(చంద్రబాబు లోకేష్‌)లకు లీగల్గా కనిపించిందని, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీనే కబ్జా చేసి, వ్యవస్థాపకుడిని హత్య చేసిన వారికి కబ్జాలన్నీ లీగల్ గానే కనిపిస్తాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. భూకబ్జాలను జాతీయ విధానంగా చేసుకొని చంద్రబాబు తేదేపా పార్టీని తెలుగు దున్నల పార్టీగా మార్చేసాడని అన్నారు.

ఆఫ్ఘనిస్తాన్ కాబోల్ లోని గురుద్వార్ కార్తే పర్వాన్ పై జరిగిన దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా పలువురు గాయపడ్డారని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నానని అన్నారు. అఫ్గాన్ ప్రభుత్వం అ దేశంలో మైనారిటీలు, పౌరులపై జరుగుతున్న దాడులకు వెంటనే చెక్ పెట్టాలని డిమాండ్ చేశారు.

అగ్నిపథ్ స్కీం యోగ్యతలు, లోపాలుపై ప్రజాస్వామ్య వేదికలైన పార్లమెంట్ వంటివాటిలో సమగ్రంగా చర్చజరపాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ప్రభుత్వం ఆస్తుల ధ్వంసం క్షమించరానిదని అన్నారు.

LEAVE A RESPONSE