Suryaa.co.in

Andhra Pradesh

రేపటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు మొదలు

– కార్యక్రమాన్ని ప్రారంభించనున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

అమరావతి: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుంచి మొదలు కానుంది. ఈ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ప్రారంభించనున్నారు. రూ.లక్ష రూపాయలు కట్టిన వారికి టీడీపీ నుండి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో నిర్వహించాలని, కేవలం రూ.100తో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా రూ.5 లక్షలు అమలు కానుందని ఆయన తెలిపారు. గతంలో ప్రమాద బీమా రూ. 2 లక్షలు ఉండగా దాన్ని రూ. 5 లక్షలకు పెంచామన్నారు. సభ్యత్వం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చనిపోయిన రోజే అంత్యక్రియలకు రూ.10,000 అందిస్తారని, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సాయం అందిస్తుందని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE