– ఆక్సిడెంట్ కారణం గా మృతి చెందిన టిడిపి కుటుంబ సభ్యుడు పంగుళూరి చిన్న వెంకటేశ్వర్లు
– వారి కుటుంబ సభ్యులకు 5,00,000 (ఐదు లక్షల రూపాయలు) ప్రమాద భీమా చెక్కును అందజేసిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా.గొట్టిపాటి లక్ష్మి
దర్శి: తాళ్లూరు మండలం, నాగంబోట్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఐలపాలెం గ్రామానికి చెందిన పంగుళూరి చిన్నా వెంకటేశ్వర్లు ఇటీవల ఆక్సిడెంట్ కారణం గా మృతి చెందగా… చిన్న వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందిఉన్నందున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి మంజూరు కాబడిన 5,00,000 (ఐదు లక్షల రూపాయలు) ప్రమాద బీమా చెక్కును అతని భార్య పంగుళూరి నాగేంద్ర కి మంగళవారం దర్శి లోని టిడిపి కార్యాలయం లో దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ కార్యక్రమం లో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, ఐలపాలెం గ్రామ టిడిపి నాయకులు ఉన్నారు.