– లేకపోతే సీఐకి మసాజ్ చేశారంటారా?
-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యంగ్యాస్త్రాలు
కుప్పం అర్బన్ సీఐ సాదిక్ అలీ మీద కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండల వైసీపీ కన్వీనర్ కోదండ రెడ్డి చేయి చేసుకుంటే పోలీసు అధికారుల సంఘం కనీసం ఖండించలేదు. పోలీసు అధికారుల సంఘం నాయకులు జనకుల శ్రీనివాసరావు..టిడిపి నేతలపైనే మీసం తిప్పుతారా? వైసీపీ నేతలైతే ఆయన
మీసం తిరగదా? డిజిపి గారి అభిమానస్తులైన వైసీపీ నేతలకు ఏదో బీపీ వచ్చి సీఐకి మసాజ్ చేశారని ప్రకటన ఇప్పిస్తారేమో చూడాలి. ఎంతో గౌరవించాల్సిన పోలీసు వ్యవస్థని వైసీపీకి తాకట్టుపెట్టేసిన డిజిపి గారు.. ఒక మండల వైసీపీ నేత సీఐని కొడితే, ఆ సీఐని నిమిషాల్లో బదిలీ చేశారంటే, అధికారపార్టీ ప్రాపకం కోసం మీరు దేనికైనా తెగిస్తారని స్పష్టమవుతోంది. పోలీస్ కాపలాలో రాష్ట్రంలో సాగుతోన్న గూండారాజ్‌కి పోలీసులూ బలైపోవడం విచారకరం. సీఐపై దాడి, పనిష్మెంట్ బదిలీపై పోలీసు అధికారుల సంఘం స్పందిస్తుందేమో చూద్దాం.