టెండర్లు పిలవకుండా, కొత్త ఏజెన్సీ ఎంపిక చేయకుండా, NGT విధించిన నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో యధేచ్చగా జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్, ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకుని అధిక ధరలకు ఇసుకను అమ్ముకుని వైసీపీ నాయకులు చేస్తున్న దోపిడీపై ఈ నెల 28, 29, 30 తేదీలలో నిరసన కార్యక్రమాలకు టీడీపీ పిలుపునిచ్చింది.
మొదటి రోజు(28వ తేదీ):-
వైసీపీ నాయకులు అక్రమంగా మైనింగ్ చేస్తున్న ఇసుక రీచ్ లను, అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపింగ్ యార్డుల వద్ద పార్టీ శ్రేణులు, ఆయా గ్రామస్తులతో కలిసి నిరసనలు చెపడతారు. అనంతరం ఇసుక అక్రమ దోపిడీపై ఆధారాలతో కూడిన వివరాలను మీడియాకు వివరిస్తారు.
రెండవ రోజు(29వ తేదీ):-
ఇసుక అక్రమ దోపిడికి సంబంధించిన వివరాలను సాక్షాదారాలతో ఎమ్మెర్వో, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తారు.
మూడవ రోజు(30వ తేదీ): –
అన్ని నియోజకవర్గ నాయకులందరూ విజయవాడ (ఇబ్రహీంపట్నం) లో ఉన్న DMG (Department of Mines & Geology) ప్రధాన కార్యాలయం ముట్టడి చేసి నిరసన చేస్తారు. వైసీపీ చేస్తున్న ఇసుక దోపిడీ గురించి సేకరించిన ఆధారాలను DMG డైరెక్టర్ కు చూపించి వైసీపీ చేస్తున్న ఇసుక దోపిడీ అరికట్టాలని కోరతారు.