జగన్ మూడేళ్ళ మోసకారి పాలనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విడుదల చేసిన చార్జ్‌షీట్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు టిడిపి కౌన్సిలర్ లతో కలిసి ప్రదర్శించారు. జగన్ పాలనంతా నేరాలు, ఘోరాలమయమని దేవినేని ఉమా మండిపడ్డారు.
జగన్‌ది విధ్వంసకర కక్ష పాలన అన్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, జగన్ పాలనలో ప్రజలకు ముప్పుతిప్పలు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనకు నాంది అని చెప్పారు. క్విట్ జగన్..సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు అన్నారని చెప్పారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై రూ.46 వేల కోట్ల విద్యుత్ భారం మోపుతున్నారని ఆరోపించారు. చార్జీలు పెరిగినా కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు.