Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేశారు

– చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయితేనే యువతకు భవిష్యత్తు
– జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, తప్పడు ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
– టీడీపీలో యువతకే పెద్దపీట

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో యువత ఉపాధి, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మళ్లీ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే యువత భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ బాగుపడుతుందని టీడీపీ నేతలు అన్నారు. టీడీపీ మానవ వనరుల అభివృద్ది విభాగం ఆధ్వర్యంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువత – సాధికారత – శిక్షణ పేరుతో కర్నూల్, నంద్యాల, కడప హిందూపూర్, అనంతపురం పార్లమెంట్ల పరిధిలోని తెలుగుయువత నాయకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సంధర్బంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ… తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీని స్ధాపించి అనేక మంది సామాన్య యువకుల్ని చట్ట సభలకు పంపారు. పార్టీ ‎ మొదటి ఎన్నికల్లో 128 మంది పట్టభద్రులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. నాడు ఎన్టీఆర్ మంత్రి వర్గంలో ఉన్న వారిలో 80 శాతం మంది యువతే. ఆ మంత్రి వర్గంలో ఉన్న యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు 26 ఏళ్ల లోపు వారే. నేడు అదే స్పూర్తిని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నారు. పార్టీ స్ధాపించి 40 ఏళ్లు దాటినా రెండు తెలుగు రాష్ట్రాల్లో పసుపు జెండా రెపరెపలాడుతుందంటే దానికి కారణం యువతే.

దేశాన్ని ముందుకు నడిపే శక్తి యువతకే ఉంది. యువత సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు ప్రతిక్షణం పరితపిస్తారు. నాడు రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించకుండా చంద్రబాబు చర్యలు చేపట్టి కాలేజీల్లో డ్రగ్స్ స్వాడ్ ఏర్పాటు చేశారు. కానీ నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. దీని వల్ల యువత భవిష్యత్ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఐటి అభవృద్దికి కృషి చేయటం వల్లే పేద విద్యార్దులు ఇంజనీర్లయ్యి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ నేడు జగన్ రెడ్డి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకపోగా వారి చేత మద్యం, చేపలు అమ్మిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. వచ్చే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కి కీలకం. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ‎రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు తెలుగు యువత శాయశక్తులా కృషి చేయాలని వర్ల రామయ్య పిలుపునిచ్చారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ…టీడీపీ పాలన రాష్ర్టానికి స్వర్ణయుగం. 5 ఏళ్ల పాలనలో మనిషి పుట్టుక నుంచి మరణం వరకు అనేక సంక్షేమ పధకాలు అందించాం. ‎కానీ వైసీపీ, సాక్షి మీడియా విష ప్రచారాలు చేసి ఎన్నికల్లో గెలిచారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీని దెబ్బతీయాలని అన్న విధాల ప్రయత్నించి భంగపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు, దాడులు, దౌర్జన్యాలతో భయపెట్టాలని చూశారు. కానీ ఏ ఒక్క నాయకుడు, కార్యకర్త భయపడకుంగా జగన్ రెడ్డి దుర్మార్గ పాలనపై పోరాటం చేస్తునే ఉన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో ఘోరంగా విఫలమైంది. 3 ఏళ్లలోనే ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగన్ రెడ్డి ఒక్కరే. టెక్నాలజీ, సోషల్ మీడియాను ఉపయోగించుకుని జగన్ రెడ్డి పాలనా వైఫల్యాల్ని, తప్పుడు ప్రచారాల్ని తెలుగు యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలని బోండా ఉమా అన్నారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ…. యువత రాజకీయాల్లో రాణించాలి. యువతకు టీడీపీ పెద్దపీట వేస్తోంది. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. నాయకత్వ సామర్ద్యాన్ని నిరూపించుకునేందుకు ఇదొక అవకాశం. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనపై తెలుగు యువత నాయకులు పోరాటం చేయాలి. అనుబంధ విభాగాల సమిష్టి కృషితో టీడీపీ విజయం సాధ్యం. నాయకత్వ రాబోయే 30 ఏళ్లకు సరపడా నాయకుల్ని సిద్దం చేస్తున్నాం. రాజకీయాల్లో యువత అవకాశాలు అంది పుచ్చుకోవాలి.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు,‎ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, ‍హెచ్ ఆర్డీ చైర్మన్ రామాంజనేయులు, ‎‍హెచ్ ఆర్డీ సభ్యులు రాంగోపాల్ రెడ్డి, ‍‎ అంజిరెడ్డి, వసంత సత్యనారాయణ, ఎస్పీ సాహెబ్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువత కార్యక్రమాల కో-ఆర్డినేటర్ రవినాయుడు, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కార్యాలయం కో-ఆర్డినేటర్ తమ్మినేని మోహన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE