ఎంపీ విజయసాయి రెడ్డి
తెలుగుదేశం పార్టీ నిర్దేశించుకున్న సభ్యత్వ నమోదు లక్ష్యం లో 20% కూడా చేరుకోలేక చతికిలపడిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. 70 లక్షలు టార్గెట్ గా పెట్టుకొని నాలుగు నెలలైనా, మరోవైపు నుంచి టీడీపీ నాయకులే పెద్ద ఎత్తున దొంగ సభ్యత్వాలు నమోదు చేస్తున్నా ఉపయోగం లేకపోయిందని అన్నారు. ఎంతలా మభ్యపెట్టేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా డొల్లతనం బయట పడిపోయిందని ఏద్దేవా చేశారు.
అధికారంలోకి రాలేనన్న ఫ్రస్ట్రేషన్ తో సొంత పార్టీ నేతలపైనే చంద్రబాబు విరుచుకు పడుతున్నాడని విజయసాయి రెడ్డి అన్నారు . నేను లేస్తే మనిషిని కాను, కేసులు పెట్టండి, లేకపోతే సహించనంటూ టీడీపీ నేతలపై బాబు చిందులేస్తున్నాడని అన్నారు . చంద్రబాబు ఇక ఎప్పటికీ లేవలేడని అంతకన్నా పడుకోవడమే మేలని సలహా ఇచ్చారు.
చంద్రబాబుది వన్ సైడ్ లవ్
తానెప్పుడూ పొత్తుల గురించి మాట్లాడలేదంటూ చంద్రబాబు మళ్లీ బుకాయించాడని విజయసాయి రెడ్డి అన్నారు. వన్ సైడ్ లవ్ అంటూ ఢిల్లీలో షేక్ హ్యాండ్ ఇవ్వగానే బాబు మెలికలు తిరగిపోయాడని చెప్పారు.అయితే చంద్రబాబుది ఏ సైడ్ లవ్ అయినా 2024 మాత్రం వార్ వన్ సైడే నని, ప్రజల ఆశీస్సులతో వైకాపా అధికారం చేపడుతుందని అన్నారు.