Suryaa.co.in

Andhra Pradesh

కుప్పకూలిన టీడీపీ వేదిక

-ఈదురుగాలి హోరు
-మాజీ ఎంపి మాగంటి కాలికి తీవ్ర గాయం
-ఆసుపత్రికి తరలింపు
-రెండు రోజులు వర్షంతో నానిపోయిన వేదిక కర్రలు
-హోరుగాలితో ఒక్కసారిగా క్పుకూలిన వేదిక
-కార్యకర్తల కలవరం, అందరూ క్షేమం

ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారి గ్రామంలో టీడీపీ వేదిక కుప్పకూలింది. ఈదురుగాలి హోరుకు వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ప్రసంగిస్తున్న హోంశాఖ మాజీ మంత్రి చినరాజప్ప, పితాని సత్యనారాయణ మాజీ మంత్రి పీత సుజాత, మాజీ ఎంపి మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నూజివీడు పార్టీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, మరో పది మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. మాగంటి బాబు కాలికి తీవ్రమైన గాయలయ్యాయి. వెంటనే తేరుకున్న కార్యకర్తలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా వేదిక నిర్మించిన నేలపై గత రెండురోజులుగా వర్షపు నీళ్లు నిలవ ఉండటంతో, ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలికి వేదిక కూలినట్లు చెబుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A RESPONSE