Suryaa.co.in

Andhra Pradesh

పేదల ద్రోహి జగన్ దిగిపోవాలి..ధరలు దిగిరావాలి

– పెరిగిన నిత్యవసర ధరలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పెద్దఎత్తున నిరసనలు
– నిత్యవసర వస్తువుల ధరలు ప్రజానీకానికి శరాఘాతంటూ విమర్శలు
– తహశీల్దార్లకు వినతిపత్రం అనంతరం రోడ్లపై ఆందోళనలు
– కదం తొక్కిన టీడీపీ శ్రేణులు

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన నిత్యవసర ధరలు ప్రజానీకానికి శరాఘాతంగాలా మారాయని టీడీపీ నేతలు మండిపడ్డారు. ధరలు దిగిరావాలి..జగన్ దిగిపోవాలి నినాదంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలు చేపట్టారు. పెరిగిన నిత్యవసర ధరలు తగ్గించాలని తహశీల్దార్లకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం విధించే అడ్డమైన పన్నులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరోవైపు
protest ఆకాశాన్నంటిని సరుకుల ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన సరుకుల ధరలు తగ్గించి పేదలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించేవరకు పేదల పక్షాన పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాల వారీగా నిరసనలు చేపట్టిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో..
ఆముదాలవలసలో మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆధ్వర్యంలో నిత్యవసర ధరలు తగ్గించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ.. దోపిడీల మీద ఉన్న శ్రద్ధ పేదల బతుకులపై ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని విమర్శించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలంటూ శ్రీకాకుళం ఇన్ చార్జ్ గుండా లక్ష్మీ దేవి ఆధ్వర్యంలో ధరలు తగ్గించాలంటూ నిరసన తెలిపారు. రాజాంలో ఇంఛార్జి కొండ్రు మురళీ ఆద్వర్యంలో నిత్యవసర ధరలు తగ్గించాలని ర్యాలీ చేపట్టారు.

విజయనగరం జిల్లాలో…
కురుపాంలో పొలిట్ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి ఆద్వర్యంలో కార్యకర్తలతో కలిసి నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మార్వోకు సరుకుల ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏమి కొని తినాలన్నా భరించలేని స్థితిలో ధరలు ఉన్నాయని విమర్శించారు. పేదలకు అందించే సంక్రాంతి కానుకను సైతం రద్దు చేసి పేదల ద్రోహిగా ఈ ప్రభుత్వం మిగిలిపోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా లేదని, నిత్యావసర ధరలు తగ్గించాలనే డిమాండుతో గజపతినగరం నియోజకవర్గ ఇంచార్జ్ కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

విశాఖపట్నం జిల్లాలో…
విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకలు నిత్యవసర ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి, ర్యాలీలు నిర్వహించారు. పెందుర్తిలో మాజీమంత్రి బండారు సత్యనారాయణ ఆద్వర్యంలో నిరసన తెలిపారు. నరసాపురంలో ఇన్చార్జి పొత్తూరి రామరాజు తహశీల్దార్ కు వినతి పత్రం అందించిన అనంతరం నిరసన తెలిపారు. అనకాపల్లిలో రిక్షాతొక్కి పీలా గోవింద సత్యనారాయణ నిరసన తెలిపారు. గాజువాకలో ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలతో పండుగ పూట ప్రజలు పస్తులుండాల్సి వస్తోందని, తక్షణమే ధరలను తగ్గించాలనే డిమాండ్ తో గాజువాకలో నియోజకవర్గ ఇంచార్జ్, పార్లమెంటు పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పాడేరులో గిడ్డి ఈశ్వరి ఆందోళన చేపట్టారు.

తూర్పు.గోదావరి జిల్లాలో..
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరనసనలు మిన్నంటాయి. అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేతలతో కలిసి సరుకుల ధరలు తగ్గించాలని ర్యాలీ నిర్వహించారు. ముమ్మడివరంలో దాట్ల సుబ్బరాజు ఆద్వర్యంలో ఆందోళన చేశారు. రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వరయంలో నిరసనలు తెలిపారు. మండపేటలో సరుకుల ధరలు తగ్గించాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు. కాకినాడలో కొండబాబు మెడలో సరుకుల పొట్లాలు వేసుకుని నిరసనలో పాల్గొన్నారు. పిఠాపురంలో వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కార్యకర్తలతో కలిసి ఎమ్మార్వోకు సరుకులు ధరలు తగ్గించాలని వినతిపత్రం అందించారు. అంతకముందు గ్యాస్ సిలిండర్ ను తహశీల్దార్ కార్యాలయం వరకు మోసుకుంటూ వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడతూ..పేదల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ధరలు ఆకాశాన్ని అంటాయని, కనీసం ఈ ప్రభుత్వం పేదలపై కనికరం లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీమవరంలో తోట సీతారామలక్ష్మీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అమలాపురంలో అత్తిల ఆనందరావు ఆద్వర్యంలో నిరసన తెలిపారు. రామచంద్రాపురంలో పార్టీ ఇంఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం సారధ్యంలో సరుకుల ధరలు తగ్గించాలని కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రు ఆద్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎమ్మార్వోకు సరుకుల ధరలు తగ్గించాలని వినతిపత్రం అందించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో..
పశ్చిమగోదావరిలోనూ నిత్యవసర ధరలు తగ్గించాలని పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించి, తహశీల్దార్లకు వినతిపత్రాలు అందించారు. పాలకొల్లులో స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిత్యవసర వస్తుసరుకుల ధరలు తగ్గించాలని కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోను కలిసి వినతిపత్రం అందించారు. పెరిగిన ధరలు తగ్గించాలని ఉంగుటూరులో మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తనుకులో మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వినూత్నంగా మెడలో పప్పు ధాన్యాలు దండ వేసుకుని నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి కార్యకర్తలతో నిరసన తెలిపారు. పెరిగిన ధరలతో ఒక్కో కుటుంబంపై రూ.3వేల నుంచి రూ.4వేల వరకు అదనపు భారం పడుతోందని మండిపడ్డారు. ఏలూరులో బడేటి చంటి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. పోలవరం బాధ్యులు బొరగం శ్రీనివాసరావు ఆధ్యర్యంలో నిరసనలు తెలిపారు. తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీ ఆద్వర్యంలో నిత్యవసర ధరలు తగ్గించాలని నిరసనలు చేపట్టారు. పెదవేగిలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తహశీల్దార్ కు వినతిపత్రం అందించారు. చింతలపూడిలో మండల పార్టీ అధ్యక్షుల ఆద్వర్యంలో నిర్వహించారు.

కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లా వ్యాప్తంగా చేసిన నిరసనలు చేపట్టారు. మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. స్కాముల కోసం జనం నెత్తిన పన్నుల పిడుగు మోపుతున్నారని మండిపడ్డారు. నందిగామలో తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిత్యవసర ధరలు తగ్గించాలంటూ పార్టీ శ్రేణులతో ఆందోళన చేశారు. పెనమలూరులో బోడె ప్రసాద్ ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ, మహిళా నేతలు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పేదలు బతికేస్థితి రాష్ట్రంలో లేదని అన్నారు. అనంతరం పేదలకు నిత్యవసర సరుకులు ఉచితంగా పంచారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంఛార్జి బోండా ఉమామహేశ్వరరావు ఆద్వర్యంలో పెరిగిన నిత్యవసర ధరలు తక్షణమే తగ్గించాలని నిరసన తెలిపారు. కైకలూరులో మాజీ ఎమ్మెల్యే జయమంగళ నిరసన తెలిపి తహశీల్దార్ కు సరుకుల ధరలు తగ్గించాలని వినతిపత్రం అందించారు. నూజివీడులో ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.

గుంటూరు జిల్లాలో..
జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మహ్మద్ నసీర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వినుకొండలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, గోనుగుంట్ల కోటేశ్వరరావు కలిసి ఆందోళన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేదల కష్టాన్ని పట్టించుకోని ఏకైక సీఎంగా జగన్ రెడ్డి మిగిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యవసర ధరలు పేదలకు చుక్కలు చూపిస్తున్నాయని మండిపడ్డారు. గన్నవరంలో బచ్చుల అర్జునుడు నిరసనలో పాల్గొన్నారు. నరసరావుపేటలో చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. బాపట్లలో ఇంచార్జ్ వేగేశన నరేంద్రవర్మ భారీగా పెంచిన నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు నిరసనగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి బాపట్ల ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి పెరిగిన ధరలు తక్షణమే తగ్గించాలని వినతిపత్రం ఇచ్చారు. గుంటూరు పశ్చిమలో కోవెలమూడి రవీంద్ర, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, సత్తెనపల్లిలో నిరసనలు చేశారు.

ప్రకాశం జిల్లాలో..
ఒంగోలు, కనిగిరిలో దామచర్ల ఆంజనేయులు, ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు సరుకుల ధరలు తగ్గించాలని నిరసనలు తెలిపారు. యర్రగొండపాలెంలో ఇంఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి సరుకుల ధరలను తగ్గించాలని ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు. గిద్దలూరులో ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను దారుణంగా మోసం చేసిందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి నిత్యావసర వస్తువులపై ధరలు పెంచి వారి నడ్డి విరిచింది అన్నారు. పర్చూరులో ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఎమ్మార్వోకు వినతిపత్రం అందించాలి. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎమ్మార్వోలకు నిత్యవసర ధరలు తగ్గించాలని మెమరాండం ఇచ్చారు. చీరాలలో యడం బాలాజీ నిరసన తెలిపారు.

నెల్లూరు జిల్లాలో…
సర్వేపల్లిలో పొలిట్ బ్యూరో సభ్యలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రాగానే బ్లాక్ మార్కెట్ పడగలిప్పిందని మండిపడ్డారు. గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యవసర ధరలు తగ్గించాలని ర్యాలీ నిర్వహించారు. టీడీపీ హయాంలో అందుబాటులో ఉన్న నిత్యవసర ధరలు నేడు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. సూళ్లూరుపేటలో నెలవల సుబ్రహ్మణ్యం, నెల్లూరులో అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆద్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. బుచ్చిరెడ్డిపాలెంలోనూ నిరసనలు జరిగాయి.

కర్నూలు జిల్లాలో..
బనగానపల్లిలో బీసీ జనార్థన్ రెడ్డి ఆద్వర్యంలో కార్యకర్తలతో పెద్దఎత్తున ప్రదర్శనగా వెళ్లి నిత్యవసర ధరలు తగ్గాంచాలని ఎమ్మార్వోకు మెమరాండం అందించారు. ఈ సందర్భంగా జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి,అరాచకం,అసమర్థత ఎక్కువైందన్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా దుమ్ముతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పాణ్యంలో మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో సరుకుల ధరల తగ్గించాలని కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. జగన్ కు మంచి బుద్ధి ప్రసాధించాలని ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వరరెడ్డి నీలకంఠేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. రెండేళ్లుగా పేదల కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డోన్ ఇంచార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వోకు నిత్యవసర ధరలు తగ్గించాలని వినతి పత్రం అందించారు. ఇంటి పన్ను, చెత్తపన్ను, కరెంటు ఛార్జీల పెంపు, మరుగుదొడ్డి పన్ను, ఓటీఎస్ ల పేరుతో ప్రభుత్వం ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తోందని, దీనికి తోడు నిత్యవసర ధరలు పెరుగుదల పేదలను వెంటాడుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.

అనంతపురం జిల్లాలో..
గుంతకల్లలో అర్.జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆద్వర్యంలో నిత్యవసర ధరలు తగ్గించాలని కోరుతూ నిరసనలు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో పేదవాడికి మూడుపూటలా పట్టెడన్నం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం మోపుతున్న భారాలతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందన్నారు. రాయదుర్గంలో పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు పాల్గొని వైసీపీ పాలనలో సరుకుల ధరలకు రెక్కలొచ్చాయని పేర్కొన్నారు. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ కార్యకర్తలతో కలిసివెళ్లి ఎమ్మార్వోకు నిత్యవసరవ ధరలు తగ్గించాలని వినతిపత్రం అందించారు. చెన్నేకొత్తపల్లిలో పరిటాల సునీత ఆధ్వర్యంలో సరుకుల ధరలు తగ్గించాలని నిరసన తెలిపారు. పెనుగొండలో బీకే పార్థసారధి, పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి, కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.

చిత్తూరు జిల్లాలో..
కుప్పంలో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు నిత్యవసర ధరలు తగ్గించాలని ర్యాలీ చేసి, తహశీల్దార్ కు వినతిపత్రాలు అందించాయి. చంద్రగిరిలో పార్టీ ఇంఛార్జి పులవర్తి నాని ఆధ్వర్యంలో రోడ్డుపై కూర్చని నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేదలను దోపిడి చేస్తోందని నాని మండిపడ్డారు. తంబల్లపల్లిలో ఇంచార్జి శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు తగ్గించాలని ధర్నా చేశారు. నగరిలో గాలి భానుప్రకాశ్, సత్యవేడులో నిరసనలు తెలిపారు.

కడప జిల్లాలో…
రాజంపేటలో పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుటు బైఠాయించారు. ధరలు నియంత్రణ చేయలేని సీఎం వెంటనే గద్దె దిగిపోవాలని నినాదాలు చేశారు. జమ్మలమడుగు ఇంఛార్జి భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన సరుకుల ధరలు తగ్గించాలని తహశీల్దారుకు వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఆందోళన నిర్వహించారు. మైదుకూరులో పుట్టా సుధాకర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ కు పార్టీ నేతలు ధరలు తగ్గించాలని వినతిపత్రం అందించారు. కడప పట్టణంలో అమీర్ బాబు మాట్లాడుతూ పేదల పట్ల ప్రభుత్వానికి కనికరం లేదని, సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా పేదల ఇళ్లలో పండగ వాతావరణం లేదని విమర్శించారు. ఖాజీపేటలో రెడ్యం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.

LEAVE A RESPONSE