– న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడిన పొన్నవోలుపై కోర్టుధిక్కరణ కేసు నమోదు చేయాలి
– ‘టార్గెట్ చంద్రబాబు’ అన్న జగన్ రెడ్డి లక్ష్యం కోసమే పొన్నవోలు పనిచేస్తున్నాడు
స్కిల్ కేసులో పొన్నవోలు చేసిన నాట్యం న్యాయకోవిదులకే విస్మయం కలిగిస్తోంది.
– తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
స్కిల్ కేసులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు, చంద్రబాబు నాయుడి బెయిల్ తీర్పుపై పొన్నవోలు చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్నాయంటూ టిడిపి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. ఆ వివరాలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాకు వివరించారు.
‘టార్గెట్ చంద్రబాబు’ అన్న జగన్ రెడ్డి లక్ష్యం కోసం తను చెప్పినట్లు వింటాడని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని అదనంగా సృష్టించుకున్నారు. చంద్రబాబు నాయుడిపై తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించడమే ఏఏజీ ప్రధాన విధి. ఏఏజీ కదలికలు ఆ విధంగానే ఉన్నాయి. అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా ఉన్న శ్రీరాం గారు చట్టపరిధిలో వ్యవహరిస్తూ.. ప్రభుత్వ చట్టవ్యతిరేక కార్యక్రలాపాలను సమర్ధించడం లేదు. అందుకే ఏఏజీ పదవి సృష్టించారు. పొన్నవోలు తీరు చూస్తుంటే బానిసలకు సైతం విస్మయం చెందేలా ఉంది. పొన్నవోలు నీ భాంచన్ దొర అంటూ జగన్ రెడ్డి కాళ్ల దగ్గర పడిపోయాడు.
పొన్నవోలు చంద్రబాబు నాయుడిని జనం దృష్టిలో ఒక ముద్దాయిగా ముద్రవేసేందుకు ఎంతో తాపత్రయపడుతున్నాడు. జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసమే ఏఏజీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. స్కిల్ కేసులో పొన్నవోలు చేసిన నాట్యం న్యాయ కోవిదులకే విస్మయం కలిగిస్తోంది. విచారణాధికారులు ఏర్పాటు చేసే పత్రికా సమావేశాల్లో ప్రభుత్వ అడ్వకేట్లు మాట్లాడటం ఏపీలోనే చూస్తున్నాం. గతంలో ఏజీలు, ఏఏజీలు పత్రికా సమావేశాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం సిఐడీ నిర్వహిస్తున్న అన్ని పత్రికా సమావేశాల్లో పొన్నవోలు మాట్లాడుతున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు చాలా సునిశితంగా పరిశీలించి చంద్రబాబు నాయుడి బెయిల్ మంజూరు చేస్తే ఆ తీర్పు ఇచ్చిన జడ్జి గారిని తప్పుపడుతూ ఏకవచనంతో పొన్నవోలు మాట్లాడారు. తీర్పుపై పొన్నవోలుకు అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవాలి. అంతేగానీ…న్యాయమూర్తులను కించపరిచేలా మాట్లాడటం సరికాదు. న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా మాట్లాడుతూ, సీనియర్ రాజకీయ నాయకుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం న్యాయస్థానాలను ధిక్కరించడమే. అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా పొన్నవోలును నియమించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే.
అందుకే సి.ఎస్‌కు ఫిర్యాదు చేశాం. పొన్నవోలు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. తన బాధ్యతల పరిధిని దాటి మాట్లాడారు. పొన్నవోలును సస్పెండ్ చేసి ఆయనపై వెంటనే కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి. న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకరంగా మాట్లాడిన పొన్నవోలుకు ఒక్కరోజు కూడా ఏఏజీగా కొనసాగే నైతికహక్కు లేదు. జగన్ మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడటం కోసం విపరీత నాట్యం చేస్తున్న పొన్నవోలును తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదు.
పార్టీ తరపున ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తాం. అపాయింటింగ్ అథారిటీగా ప్రభుత్వం తరపున సి.ఎస్ కూడా పొన్నవోలుపై కేసు నమోదు చేయాలి. అధికారులు తమ పరిధి దాటి వ్యవహరించకూడదని హెచ్చరిస్తున్నాం. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో తమ పరిధి దాటి వ్యవహరించిన అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.
సి.ఎస్‌ను కలిసిన టిడిపి బృందంలో తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు, అధికారప్రతినిధి సయ్యద్ రఫీ, రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కంభంపాటి శిరీష, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్, తదితరులు పాల్గొన్నారు.