– ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు
గుంటూరు: అభివృద్ధి, సంక్షేమమే తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ధ్యేయమని, రైతన్నలు, మహిళా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. తొలుత చంద్రబాబు చిత్రపటానికి తెలుగు మహిళా సంఘాలు, ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే ఏమన్నారంటే.. చరిత్ర కలిగిన టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవసం గర్వంగా ఉంది.
టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ, కార్యకర్తలు సంక్షేమమే ధ్యేయం పనిచేసి, కష్టం కలిగితే సభ్యత్వం కలిగిన వారిని నష్టపరిహారంతో ఆదుకునే పార్టీ ఇది. 75లక్షల సభ్యత్వం తో కూడుకున్న ఏకైక పార్టీ, ఈ ఏడాది కోటిమంది సభ్యత్వం నమోదు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం… టీడీపీ పాలనకు వైసీపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంది.. వైసీపీ దుష్టపాలన పోయి129 రోజులయ్యింది. అందుకే దీపావళి సందర్భంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలకు ఉచిత గ్యాస్ సిలెండర్లు అందనున్నాయి.