-అధికారం లేదని అధైర్యం వద్దు…నేనున్నా
-మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ ఆడిటోరియంలో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్‌నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్ పార్టీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలవి కాని హామీలు, మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలును విస్మరించిందని అన్నారు. సనత్‌నగర్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా చేసిన మర్రి చెన్నారెడ్డి హయాంలో కూడా జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, హామీల అమలుపై పోరాడతామన్నారు. సమస్యలపై ప్రజా గొంతుక వినిపించడానికి పద్మారావు గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అధికారం లేదని అధైర్య పడొద్దు..మీకు మీకు మంచి చెడు ఏదైనా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తే కాంగ్రెస్ వచ్చాక ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లదని మండిపడ్డారు.