– కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో నారా భువనేశ్వరి
కుప్పం: రాజకీయాలు, వ్యాపార రంగాల్లో టీమ్ వర్క్ అనేది చాలా ముఖ్యం అని నేను బలంగా నమ్ముతాను. అభివృద్ధి జరగాలంటే టీమ్ మధ్య సమన్వయం అనేది చాలా ముఖ్యం. నేను నడిపే హెరిటేజ్ సంస్థలో నేను మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నప్పటికీ, కిందిస్థాయి ఉద్యోగులతో కూడా కలిసి, సంస్థ అభివృద్ధిలో వారిని సమన్వయం చేసేందుకు నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను.
మనం గెలిచాం అనేది ఒక అంశం అయితే…గెలుపు ఫలాలను ప్రజలకు అందించేందుకు నేడు సమన్వయ కమిటీ కంకణబద్దులు కావాలి. కార్యకర్తలు, ఓటర్లను మనం దృష్టిలో పెట్టుకోవాలి…వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తే వారు సంతోషంగా ఉంటారు. నా కుప్పం పర్యటనలో సామాన్యులంతా రోడ్లు, లైట్లు, కుళాయిలు, రెవెన్యూ సమస్యలు అత్యధికంగా నా దృష్టికి తెస్తున్నారు. వాటిపై సమన్వయ కమిటీ, అధినాయకత్వం దృష్టి పెట్టాలి.
నేను కూడా ప్రతి 3నెలలకు ఒకసారి నియోజకవర్గానికి వస్తాను..ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కుప్పంలో విజయవంతంగా గెలుపు పొందడానికి కృషి చేసిన సమన్వయకమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
యువ నాయకుడిని భావితరాలకు అందించిన ఘనత భువనమ్మకే : కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్సీ
ఎన్నికలకు ముందు అదేవిధంగా చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు అంటే తెలియని భువనమ్మ బయటకు వచ్చి వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని భువనమ్మ ప్రదర్శించారు. హెరిటేజ్ కంపెనీ బాధ్యతలను చంద్రబాబు భువనమ్మకు అప్పజెబితే దాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో అందరికీ తెలుసు…అదేవిధంగా భువనమ్మకు చంద్రబాబు నిజం గెలవాలి అనే కార్యక్రమం చేయాలని సూచించినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కార్యక్రమాన్ని పోరాట స్ఫూర్తితో నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భువనమ్మ తిరిగిన పోలింగ్ బూత్ లలో గతం కంటే ఎక్కువ మెజార్టీ స్పష్టంగా కనిపించింది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం నేడు కుప్పం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. రాష్ట్రానికి ఓ నిజమైన యువ నాయకుడిని భావితరాలకు అందించిన ఘనత భువనమ్మకే దక్కుతుంది.
నియోజకవర్గానికి ఏ సమస్య ఉన్నా నేడు భువనమ్మ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్యలను పరిష్కరించుకునేందుకు మార్గం ఏర్పడింది. రానున్న 5ఏళ్లు గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి ప్రణాళికలను చంద్రబాబు ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించారు.
కుప్పం నియోజకవర్గం కోసం ప్రస్తుతం రూ.250కోట్లను చంద్రబాబు శాంక్షన్ చేశారు. కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చి దిద్దాలని చంద్రబాబు కోరుతున్నారు.సెజ్ ఏర్పాటు కోసం 2వేల ఎకరాలు చూడాలని, అవసరమైతే కొనుగోలు చేద్దాం అని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.
కుప్పం నియోజకవర్గం పట్ల చంద్రబాబు మరింత అంకితభావంతో ఉన్నారు. మొదటి 40రోజుల్లోనే కుప్పం నియోజకవర్గానికి కేంద్ర సంస్థలను తెచ్చారు…కుప్పం పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో ఈ ఒక్కటే నిదర్శనం. సెజ్ లో మరిన్ని కంపెనీలు పెట్టి 25వేల నుండి 30వేల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నేరుగా అందించేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
అనుకున్నంత మెజార్టీ ఎన్నికల్లో రాకపోవడం కొంత నిరాశకు గురిచేసినా, రాక్షసులతో యుద్ధం చేసి గెలిచాం అని చెప్పుకోవచ్చు. అనేక ఇబ్బందులు, నిర్బంధాలు, అక్రమ కేసులను ఎదుర్కొంటూ 2024 కురుక్షేత్రాన్ని గెలిచాం. 2029నాటికి లక్ష మెజార్టీ లక్ష్యంతో నేటి నుండే పని చేస్తాం.
నియోజకవర్గంలోని కార్యకర్తలు, ప్రజలు అన్ని విధాలా సంతోషంగా ఉండేలా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకుంటాం.కుప్పం నియోజకవర్గంలో అధినేత ఆలోచనలను అమలు చేస్తూ, కుప్పం నియోజకవర్గాన్ని శత్రుదుర్బేధ్యంలా తీర్చి దిద్దేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం.
ఉమ్మడిగా పనిచేస్తాం:నియోజకవర్గ సమన్వయకర్త పీఎస్ మునిరత్నం
అధికారంలో ఉండగా కొన్ని చిక్కుముడులు వస్తాయి…వాటిని అధిగమించేందుకు నాయకత్వం ఉమ్మడిగా పనిచేస్తాం. నియోజకవర్గంలో పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం పై పూర్తిస్థాయి దృష్టి పెట్టి కార్యకర్తలకు అండగా నిలబడతాం.
ప్రజాధనాన్ని ప్రజలకు తప్పనిసరిగా అందించాలనేది చంద్రబాబు నైజం…దాన్ని కుప్పం నియోజకవర్గ నాయకులు మరింత జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లేందుకు జాగ్రత్తలు తీసుకుంటాం. రానున్న 5 సంవత్సరాలు కుప్పం చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోతుంది.
సమన్వయ కమిటీలు టీమ్ వర్క్ గా పనిచేయాలి, ఈర్ష్యా, ద్వేషాలను ప్రక్కనబెట్టాలి. పార్టీ పటిష్టానికి కృషి చేయాలి. కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమన్వయ కమిటీ జాగ్రత్తలు పాటించాలి…సమన్వయం పాటించాలి. నియోజకవర్గ అభివృద్ధికి భువనమ్మ నడుం బిగించడం చాలా అదృష్టం, సంతోషదాయకం.