28 సంవత్సరాల యువకుడికి,ప్రాణాంతకంగా (అనఫలాక్సి – Anaphylaxis)మారిన ఎర్ర చీమలు ఎలర్జీ.
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ…
చిన్నప్పుడు సుమతి శతకంలో పలికిన వాక్యములు, అక్షరాల వైద్యపరమైన సత్యాలుగా కనపడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
28 సంవత్సరాల ఐటీ ఉద్యోగి, ఒకనాడు తన ఇంటి దగ్గర మొక్కల పని చేస్తున్నప్పుడు, పదుల సంఖ్యలో కాలుకు చీమలు కుట్టాయి. కాలు దులుపుకొని పని తీసుకున్న అతనికి, సరిగ్గా 30 నిమిషాలు కాగానే,1) కంటి దురద,2) గొంతు దురద,3) చర్మం మీద దద్దుర్లు దురదలు4) గొంతులో మాట మారడం5) కొద్దిగా శ్వాస ఇబ్బంది5) పెదిమలు- చెవి వాచిపోవడం 6) మైకం లాగా రావడం7) BP సడన్గా తగ్గినట్టు అనిపిస్తుంది…… వంటి లక్షణాలు ఎదుర్కోవడం జరిగింది.
హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు వారి కుటుంబ సభ్యులు. అక్కడ ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకున్న వైద్యులు, 24 గంటల పాటు ఐసీయూలో అడ్మిట్ చేసి, శ్వాస ప్రక్రియ, మైకము, దద్దుర్లు తక్కువ అయినంతవరకు ఉంచి డిస్చార్జ్ చేయడం జరిగింది.
వారు ఇచ్చిన రోగ సమాచారం:Severe Allergic Urticaria, Severe Angioedema & Anaphylaxis reaction.
20 రోజులు అనంతరం, ఇంట్లో పుస్తకాలు సర్దుతున్న, అక్కడున్న చీమల్ని జరిపి, సెల్ఫ్ శుభ్రం చేసే ప్రక్రియలో, మరోసారి చీమలు కొట్టడం జరిగింది. ఈసారి కూడా ఇదే పద్ధతి జరగడంతో భయబ్రాంతులకు గురైన సభ్యులు, హైదరాబాదులోని అశ్విని ఎలర్జీ సెంటర్ కి తీసుకొని వచ్చారు.
అలర్జీ ఇమ్యునాలజీ వైద్య నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ రోగి లక్షణాలు పరిశీలించిన అనంతరం, మాడిఫైడ్ అలర్జీ స్కిన్ ప్రీక్ టెస్ట్ నిర్వహించారు. సాధారణంగా పాజిటివ్ రావలసిన ఎలర్జీలు ఏవి కూడా రోగికి కనపడ పోవడంతో డాక్టర్ వ్యాకరణం రోగి లక్షణాలను, రోగి అనుభవాన్ని పరిగణలో తీసుకొని “ఎర్ర చీమలు – నల్ల చీమల” ఎలర్జీ టెస్టింగ్ నిర్వహించారు.
సాధారణంగా ఎర్ర చీమలు నల్ల చీమల ఎలర్జీ టెస్టింగ్ భారతదేశంలో చేయడము చాలా అరుదు. రోగి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షలు నిర్వహించారు డాక్టర్ వ్యాకరణం.
Results:
1)హీష్టమైన : 8.
2)ఎర్ర చీమలకి ఎలర్జీ టెస్టింగ్ : Severe పాజిటివ్.(6)
3)నల్ల చీమలకు ఎలర్జీ టెస్టింగ్ : Mild పాజిటివ్.(4)
రోగి ఎలర్జీ పరీక్షల వివరాలను పరిగణలో తీసుకొని, అలర్జీ రోగులకు అత్యాధునికమైన (Allergic Specific Immunotherapy)అలర్జున్ సిఫిక్ ఇమ్యునో థెరపీ చికిత్స విధానాన్ని అందించడం జరిగింది.
1) ఎర్ర చీమల ఇమ్యునో థెరపీ ప్రారంభించారు.
2)inj.EPIPEN (sos)
3) Anti Histamines
4) Broncho Dilator Therapy.