-శుక్రవారం ఉదయానికి సేవలు పునరుధ్దరణకు చర్యలు
-రవాణాశాఖ కమీషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు
అమరావతి,30 డిసెంబర్:రాష్ట్ర రవాణాశాఖలోని సర్వర్ లో సాంకేతిక సమస్య కారణంగా రవాణాశాఖ అందించే అన్నిసేవలకు అంతరాయం కలిగిందని సాంకేతిక సిబ్బంది సహాయంతో ఆసమస్యను పరిష్కరించి శుక్రవారం ఉదయానికి సేవలను పునరుద్ధరించే దిశగా కృషి చేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ కమీషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు తెలియజేశారు. ఈవిషయాన్ని ఇప్పటికే డీలర్లు అందరికీ తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు. సాంకేతిక సమస్య పరిష్కారం కాగానే శుక్రవారం ఉదయం నుండి రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్లు యదావిధిగా అనుమతిస్తామని కమీషనర్ ఆంజనేయులు తెలియజేశారు.