-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు
-ఉద్యమకారులకు నిజమైన వేదిక బీజేపీ అని రుజువైంది
-కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, తరుణ్ చుగ్, సంజయ్ సమక్షంలో…..
-బీజేపీలో చేరిన తెలంగాణ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక నేత సీహెచ్. విఠల్
-తెలంగాణలో 40 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ విఠల్ ఆందోళన
-రేపు బీజేపీలో చేరనున్న తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు, తెలంగాణ ఉద్యమ నేత సీహెచ్.విఠల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విఠల్ కు పార్టీ సభ్యత్వం అందజేసి బీజేపీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…
‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన లీడర్ సీహెచ్.విఠల్ ను హ్రుదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాం. నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదికగా మారిందనేది మరోమారు స్పష్టమైంది. సీఎం కేసీఆర్ నిజమైన తెలంగాణ ఉద్యమకారులను తెరమరుగు చేస్తూ తెలంగాణ ద్రోహులను చేరదీస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. అందుకే తెలంగాణ కోసం ఉద్యమించిన శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు చంద్రశేఖర్, విజయరామారావు వంటి వారు బీజేపీలో చేరారు. రేపు తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరబోతున్నారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధనే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. నిజమైన తెలంగాణ వాదులారా……బీజేపీలోకి రావాలని పిలుపునిస్తున్నాం.
తరుణ్ చుగ్ మాట్లాడుతూ….
తెలంగాణ కోసం ఉద్యమించిన నేతలందరినీ బయటకు పంపుతున్న ఘనత సీఎం కేసీఆర్ దే. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోంది. కేసీఆర్ నియంత, కుటుంబ, అవినీతి పాలనను తరిమికొట్టేందుకు బండి సంజయ్ కుమార్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేయబోతున్నారు. క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ అవినీతి, నియంత విధానాలను ఎండగట్టడంతోపాటు 2023లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా బండి సంజయ్ యాత్ర కొనసాగుతోంది. టీఆర్ఎస్ దాశ్య శ్రుంఖలాల నుండి ప్రజలను విముక్తి చేసే క్రమంలో పార్టీలో చేరుతున్న తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ విఠల్ కు స్వాగతం పలుకుతున్నాం.
బీజేపీలో చేరిన విఠల్ మాట్లాడుతూ….
ఇది నా జీవితంలో చారిత్రక దినం. ఈరోజు అంబేద్కర్ వర్దంతి కావడం… ఈరోజు కరసేవకుల బలిదాన దినం. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన, 18 కోట్ల సభ్యత్వమున్న బీజేపీలో సభ్యుడిగా చేరడం సంతోషంగా ఉంది. సొంతింటికి వచ్చినట్లుంది. టీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మగౌరవం లేదు.
తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో 40 శాతం ఖాళీలున్నయ్. తెలంగాణ కోసం 1500 మంది యువత బలిదానం చేశారు. ఏడేళ్లుగా ఒక్క నియామకం లేదు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మిగులు రాష్ట్రంగా తెలంగాణలో ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో యువత దాదాపు 600 మంది ఆత్మహత్య చేసుకున్నారు.బీజేపీ సిద్దాంతపరమైన, క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇంతటి గొప్ప పార్టీలో చేరడం ఆనందంగా ఉంది. పార్టీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా అందరికీ ధన్యవాదాలు. నరేంద్రమోదీ, అమిత్ షా, నడ్డా ఆధ్వర్యంలో తెలంగాణ అభివ్రుద్ది జరుగుతుందని ఆశిస్సున్నా. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్, అనిల్ బలూనీ, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రమణ్యం, మీసాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.