Suryaa.co.in

Telangana

కుల గణన పరిశోధన కేంద్రంగా తెలంగాణ

– దేశానికి మోడల్ గా నాంది పలకబోతున్నాం
– సర్వేలో ఏ సమాచారం, ప్రశ్నలు ఉండాలో తెలుసుకునేందుకే కాంగ్రెస్ కీలక నేతల సమావేశం
– గాంధీభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైద‌రాబాద్ : కుల గణనకు తెలంగాణ పరిశోధన కేంద్రంగా … ఒక మోడల్ గా నిలిచి దేశానికి సందేశం ఇవ్వబోతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ కీలక నేతల సమావేశం, అంతకుముందు మీడియా మిత్రులతో ఆయన ప్రసంగించారు. గాంధీ భవన్ లో నేడు జరుగుతున్న దేశ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటన చేసి అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకున్నారని వివరించారు. మోటార్ సైకిల్ మెకానిక్ నుంచి, దళితులు, గిరిజనులతో కలిసి వంట చేసుకుని వారితో తిరిగారని వివిధ అంశాలు వారి నుంచి తెలుసుకున్నారని తెలిపారు. అంతిమంగా ఆయన గుర్తించింది ఏంటంటే ఈ దేశ వనరులు, ఆస్తులు అందరికీ సమానంగా దక్కడం లేదని వివరించారు.

కుల గణన ద్వారా సమస్యలు తెలుసుకుని చికిత్స చేసినప్పుడే భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసినట్లు అవుతుందని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాబోతున్న రాగానే దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక మోడల్గా కుల గణన చేపడుతుందని ఎన్నికల ప్రచార సభల్లో ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించే విషయాన్ని గుర్తు చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి యావత్ క్యాబినెట్ సమావేశమై 4 ఫిబ్రవరి 24న కుల గణనకు క్యాబినెట్లో తీర్మానం చేశామని తెలిపారు. శాసనసభలో విస్తృత స్థాయిలో చర్చ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ఘనవిజయంగా ఆయన అభివర్ణించారు.

అసెంబ్లీ తీర్మానం ఆధారంగా 10- 10- 2024న సమగ్ర కుల గణనకు ప్రణాళిక శాఖ ద్వారా చేపట్టేందుకు జీవో జారీ చేసినట్లు వివరించారు.
ఈ సర్వేలో ఏ సమాచారం సేకరించాలి, ఏ ప్రశ్నలు ఉండాలనేది తెలుసుకోవడం కోసమే కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పార్టీ శ్రేణులు ఇచ్చే సమాచారం, ప్రశ్నలు తప్పకుండా సర్వేలో పొందుపరుస్తాం అన్నారు.

ఈ సర్వేపై సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు.. ఆయా శాఖల ఉన్నదా అధికారులను భాగస్వాములను చేస్తున్నట్టు తెలిపారు.
సమాజంలోని వాటాదారుల అందరి ఆలోచనలు పొందుపరిచి సర్వే స్పష్టంగా జరిగేలా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సోషియో, ఎడ్యుకేషన్, ఎ కామనామి, పొలిటికల్ అన్ని అంశాల పై సమాచారాన్ని సర్వేలో సేకరిస్తామన్నారు.

భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ను తూచా తప్పకుండా పాటిస్తూ.. సర్వే ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా సమాజంలోని రోగాలకు చికిత్స చేస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ సైనికులుగా ఆయన ఆలోచనలను పకడ్బందీగా అమలు చేసి చూపించాల్సిన బాధ్యత పార్టీ నేతలు, శ్రీను అందరి పైన ఉందని తెలిపారు.

జిల్లాస్థాయిలో కాంగ్రెస్ కమిటీలు విస్తృతంగా అభిప్రాయాలను సేకరిస్తాయని, రాష్ట్రస్థాయిలో మేధావులు, సామాజికవేత్తలు, ప్రగతిశీల వాదులతో ఈనెల 5న హైదరాబాదులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు.

సమాజంలో ఉన్న వనరులు అందరికీ సమానంగా అందుతున్నాయా లేదా అనేది సర్వే ఆధారంగా.. స్పష్టమవుతుంది. ఆ సమాచారం ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఈ సమాజం ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగడానికి కుల గణన సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు.

LEAVE A RESPONSE