Home » బాబుకు తెలంగాణ తమ్ముళ్ల స్వాగత ఏర్పాట్లు

బాబుకు తెలంగాణ తమ్ముళ్ల స్వాగత ఏర్పాట్లు

బేగంపేట ఎయిర్‌వద్ద ఘనస్వాగతం కోసం సమీక్ష

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా 5న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు కి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయాన్ని జాతీయపార్టీ దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంపై చర్చించడానికి బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ కార్యక్రమంపై నాయకుల అభిప్రాయాలను తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ… చంద్రబాబు ఏ తప్పు చేయకున్నా జగన్‌మోహన్‌ రెడ్డి దుర్మార్గమైన పాలనలో కక్షసాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు ని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఈ సంఘటనను కలలో కూడా ఎవరూ ఊహించలేదు. జనసేన, బీజేపీ పార్టీలతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లి చరిత్రలో ఎన్నడూ రాని మెజారిటీ సీట్లతో ఎన్‌డీఏ కూటమి ఏపీలో అధికారంలోకి రావడంజరిగింది. నాల్గవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రను సృష్టించారు.

హైదరాబాద్‌లోనే తెలుగుదేశం పార్టీని ఎన్‌టిఆర్‌ ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలకు ఉపయోగపడుతుండటం సంతోషమని, తెలుగుప్రజలు ఎక్కడ ఉన్నా ముందు ఉండాలని చంద్రబాబు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఈ రోజు రాష్ట్ర ఆదాయంలో 40 నుంచి 50 శాతం ఒక్క హైదరాబాద్‌ నుంచే రావడం.. దీనికి చంద్రబాబు గారు, తెలుగుదేశం ప్రభుత్వం వేసిన పునాదులే ప్రధాన కారణం. మేమే శాశ్వతంగా ఉంటాం.. అని భావించిన కేసీఆర్‌..ఇప్పటి వారి, వారి పార్టీ పరిస్థితిని చూస్తే ప్రజాస్వామ్య గొప్పతనం తెలిసి వస్తుంది.

ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా, ఎన్ని తుఫానులు వచ్చినా మనం పార్టీలోనే నిలబడి ఉన్నామని అన్నారు. నాల్గొవసారి ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు హైదరాబాద్‌కు వస్తున్నందున అందరం కలిసి ఘన స్వాగతం పలికే కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుదామని అన్నారు. వేరే పనుల వల్ల ఈ సమావేశానికి రాలేకపోయినవారితో కూడా మాట్లాడి, కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా నిర్వహిద్దామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు పిన్నమనేని సాయిబాబా, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు బండి పుల్లయ్య, ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజునాయక్‌, గడ్డి పద్మావతి, జివిజి నాయుడు, షేక్‌ ఆరిఫ్‌, అధికార ప్రతినిధులు బుగిడి అనూప్‌కుమార్‌, డాక్టర్‌ ఏఎస్‌ రావు, సూర్యదేవర లత, మీడియా కమిటీ ఛైర్మన్‌ తెలుగుదేశం ప్రకాష్‌ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులు వేజెండ్ల కిషోర్‌ బాబు, కుర్రా ధనలక్ష్మి, సంధ్యపోగు రాజశేఖర్‌, ముత్తినేని సైదేశ్వర్‌ రావు, మండూరి సాంబశివ రావు, సురేందర్‌ సింగ్‌, ముదిగొండ సుభాషిని, రాష్ట్ర కార్యదర్శులు ఎండి ఇమాంమ్‌, జలమోని రవీందర్‌, రాపోలు నర్సింహులు, కట్టా రాములు, నర్సింహా రావు, ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు కె. గోపి, బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్‌ కుమార్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు పోలంపల్లి అశోక్‌, తెలుగునాడు ఉపాధ్యాయ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ముంజా వెంకట్రాజంగౌడ్‌, తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజేంద్రగౌడ్‌, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ పొగాకు జయరామ్‌చందర్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply