– బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి
– స్థానిక సంస్థలలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,పార్టీ బీసీ నేతలు
– కార్యక్రమం లో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,మంత్రులు కొండా సురేఖ,జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్: కులగణన చాలా పకడ్బందీగా చేశాం. వ్యక్తులు స్వయం గా తమ వివరాలను డిక్లేర్ చేశారు.కులగణన డేటా 100 శాతం డిజిటలైజేషన్ చేశాం. భవిష్యత్తు లో ఎవరూ ఛాలెంజ్ చేయడానికి వీలు లేకుండా డేటా భద్రపరిచాం. దేశం లో తెలంగాణ కులగణన బెస్ట్ మోడల్.
దేశానికి తెలంగాణ కులగణన రోల్ మోడల్ అని రాహుల్ గాంధీ కొనియాడారు. బీసీ రిజర్వేషన్ ఫలాలను ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా బీసీ లకు రిజర్వేషన్లు కల్పించలేదు.