– 29 మంది కీలక నేతలకు చోటు..
హైదరాబాద్: తెలంగాణలో రాబోయే శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీని ఏఐసీసీ ప్రకటించింది.
రేవంత్‌రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించనున్న 2023 రాష్ట్ర ఎన్నికల కమిటీలో 26 మంది సభ్యులు, మరో ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులను అధిష్ఠానం నియమించింది. మొత్తం 29మంది కీలక నేతలకు ఈ కమిటీలో చోటు లభించింది.
వీరిలో ఎన్నికల కమిటీ సభ్యులుగా రేవంత్‌రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, బొమ్మ ముఖేష్‌గౌడ్, గీతారెడ్డి, అజహరుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, చల్లా వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, రేణుకా చౌదరి, బాలరాం నాయక్, మహ్మద్ అలీ షబ్బీర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రేంసాగర్ రావు, సునీతా రావు ముదిరాజ్ సభ్యులుగా ఉన్నారు.
పీసీసీ ఎన్నికల కమిటీలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.