బీజేపీ అధికారంలోకి వస్తే ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఉండడు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తే బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు
సూర్యాపేట జనగర్జన సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సూర్యాపేట తెలంగాణ విమోచనంలో కీలక పాత్ర పోషించింది.తెలంగాణ విమోచన ఉత్సవాలకు అమిత్ షా శ్రీకారం చుట్టారు.సర్దార్ పటేల్ నిజాం నిరంకుశపాలనను పారద్రోలి ఇక్కడ మూడు రంగుల జెండాను ఎగరవేస్తే 75 ఏళ్ళ తర్వాత భారత ప్రభుత్వం తరపున అమిత్ షా నిజాం వ్యతిరేకంగా ఉత్సవాలను నిర్వహించుకునేలా శ్రీకారం చుట్టారు. వారికి ధన్యవాదాలు.
బీజేపీ తరపున పోటీ చేస్తున్న సంకినేని వెంకటేశ్వరావు , రామ చంద్రయ్య, గూడురు నారాయణారెడ్డి , నివేదిత ని ప్రజలు ఆశీర్వదించాలి భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. భారతీయ జనతా పార్టీని పార్టీ అనేక జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టింది.నల్గొండ, వరంగల్, భువనగిరి, హైదరాబాద్ వెళ్ళే రహదారులకు బీజేపీ నిర్మించింది. 2500 కిలో మీటర్ల రహదారులకు ప్రధాని మోడీ అధ్వర్యంలో నిర్మించడం జరిగింది.
బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నుండి విజయవాడకు 6 లైన్ రోడ్ పారిశ్రామిక వాడాలను నిర్మించి యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాము.బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ప్రాంతానికి చేసింది. ఏమి లేదు. జాతీయ రహదారులు. గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు నిధుల ఇచ్చే ది నరేంద్ర మోడి ప్రభుత్వం. తెలంగాణ బంగారం కాలేదు కాని కేసీఆర్ కుటుంబం బంగారం అయింది ఇక్కడ ఇంకా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు 9-10 ఏళ్ళుగా ఒక్క టీచర్ పోస్ట్ భర్తి చేయలేదు. కాని కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి.
పేదలకు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామన్నారు ఇవ్వలేదు.విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఇవ్వలేదు.డిసెంబర్ 3 న వచ్చే ఫలితాల్లో బీజేపీ గెలిచిన తర్వాత పేదల ప్రజలకు ఉచిత విద్యా ఉచిత వైద్య కల్పిస్తాం.కరువు వచ్చిన వరద వచ్చిన, కీటకాలతో పంటలు దెబ్బతింటా ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంట భీమా పథకం అమలు చేస్తాం నష్టపోయిన రైతుల నష్టాన్ని భరించిన వారికి బీజేపీ ప్రభుత్వం అండంగా ఉంటుంది.
అంతే కాదు రాష్ట్రంలో అవినీతిని సమూలంగా నిర్మూలిస్తాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో గ్రామా పంచాయితీల నుండి సచివాలయం వరకు ఎక్కడ అవినీతి జరిగిన బీజేపీ నిర్మూలిస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఉండడు. ప్రజలకు అందుబాటులో ఉంటే ముఖ్యమంత్రి వస్తాడు.ఈ ప్రాంతంలో బీజేపీ గెలవాలి కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీ రెండు ఒక్కటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటె వేస్తే మజ్లిస్ కు ఓటు వేసినట్లే.
ఈ రోజు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కవల పిల్లలు కుటుంబ పార్టీలు కాబట్టి బీజేపీ గెలవాల్సిన అవసరం ఉంది.ఈ రోజు కాంగ్రెస్ 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తే బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు.
అమ్ముడుపోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో బీజేపీ పార్టీని గెలిపించి నరేంద్ర మోడిగారికి అండంగా ఉండాలి ప్రజలను కోరుతున్నాను.