-సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల కృషి ఫలితంగానే రాష్ట్రానికి పెట్టుబడులు
-పరిశ్రమలు, ఐటీ రంగాన్ని జిల్లాలకు విస్తరిస్తున్న ముందు చూపు కెటిఆర్ ది
-కెసిఆర్, కేటిఆర్ ల వల్లే ఉమ్మడి వరంగల్ జిల్లాకు పలు పరిశ్రమలు*
-తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి ఎర్రబెల్లి
-మడికొండ ఐటీ పార్కులో ఘనంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
-హాజరైన జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎమ్మెల్యేలు రాజయ్య, అరూరి రమేష్, కుడా చైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు
మడికొండ (హన్మకొండ), జూన్ 6 : ఐటీ, పరిశ్రమలు రంగంలో తెలంగాణ దేశానికే ఐకాన్. మన పారిశ్రామిక విధానాలు దేశానికే ఆదర్శం. ఒకప్పుడు బెంగుళూరు లాంటి నగరాలకే పరిమితమైన ఐటీ, పరిశ్రమలు ఇవ్వాళ తెలంగాణకు విస్తృతంగా వస్తున్నాయి. వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. లక్షలాది ఉద్యోగాలను ప్రైవేట్ రంగంలో కల్పిస్తున్నాయి. ఈ ఘనత సీఎం కెసిఆర్, కెటిఆర్ లదేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల కృషి ఫలితంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. పరిశ్రమలు, ఐటీ రంగాన్ని జిల్లాలకు విస్తరిస్తున్న ముందు చూపు కెసిఆర్, కెటిఆర్ లది. నిజాం నవాబు కాలంలోనే తెలంగాణకు పరిశ్రమలు ఉండేవి. వరంగల్ లో అజంజాహీ మిల్లు ఉండేది. కానీ ఉమ్మడి రాష్ట్ర పాలనలో అవి మూత పడ్డాయి. వాటిని తెగనమ్ముకున్నారు.
కానీ, సీఎం కెసిఆర్, కేటిఆర్ ల వల్లే ఉమ్మడి వరంగల్ జిల్లాకు పలు పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ పార్క్ లు ఏర్పడ్డాయి. టెక్స్ టైల్ పార్క్ లు వచ్చాయి. ఇంకా రానున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మడికొండ ఐటీ పార్క్ లో ఘనంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎమ్మెల్యేలు రాజయ్య, అరూరి రమేష్, కుడా చైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జ్యోతి వెలిగించి పారిశ్రామిక ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పారిశ్రామిక ప్రగతి ఉత్సవం జరుపుకుంటున్నాం. ఐటీ రంగంలో దేశంలో మన రాష్ట్రమే ఆదర్శం. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల కష్టమే మన రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు. ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది BRS ప్రభుత్వమే. మడికొండలో ఐటీ పార్క్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అని అన్నారు.
హైదరాబాద్ తర్వాత ఐటీ పెట్టుబడులు ఎక్కువగా వచ్చింది మన వరంగల్ జిల్లాకే. దేశంలో అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్కు ను మన వరంగల్ జిల్లాలోనే ఏర్పాటు చేస్తున్నాం. ఉత్తర కొరియా లాంటి దేశాల ప్రతినిధులు మన వరంగల్ లో పెట్టుబడులు పెడుతున్నారు. వారిని ప్రోత్సహిస్తూ… ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
రాష్ట్రం రాక ముందు ఐటీ రంగంలో 3 లక్షల 23 వేల 396 ఉద్యోగాలు ఉండెవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 9 లక్షల 5 వేల 715 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఐటీ రంగంలో నేడు దేశంలో నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రం. ఐటీ రంగంలో 2 లక్షల 41 వేల ఎగుమతులు ఐటీ లో కొత్తగా 5 లక్షల 82 వేల 319 ఉద్యోగాల కల్పిస్తున్నాం. దేశానికి వస్తున్న ప్రతి రెండు ఐటీ ఉద్యోగాలలో ఒకటి తెలంగాణ కి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కేవలం 52 లక్షలు మాత్రమే. తెలంగాణ లో కాంట్రాక్టు ఉద్యోగులతో కలుపుకుని 6 లక్షల మంది. జనాభాలో 5 పైసల మందం కేంద్ర ఉద్యోగులు ఉంటే 30 పైసల మందం తెలంగాణలో ఉద్యోగులు ఉన్నారన్నారు.
మహాబుబ్ నగర్ జిల్లా దివిటీ పల్లి లో 9 వేల 500 కోట్లతో ఆమర రాజా ఐటీ కంపెనీ ఏర్పాటు కానుంది. ఈ కంపెనీ ద్వారా 4 వేల 5 వందల ఉద్యోగాలు రానున్నాయి. కొంగర కాలన్ లో 500 మిలియన్ డాలర్లతో పాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటు అవుతుంది దీని వల్ల 1 లక్ష మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది.
కేటీఆర్ అమెరికా ఇంగ్లాండ్ పర్యాటన చేసి తెలంగాణ కు 42 వేల ఐటీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. మొత్తం 8 కంపెనీల ద్వారా 36 వేల కోట్లు పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి. ఐటీ పార్కు లతో మన రాష్ట్ర రూపురేఖలు మారుస్తున్న సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ కి రుణపడి ఉండాలి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.