Suryaa.co.in

Telangana

మన తెలంగాణ దేశానికే అన్నపూర్ణ

– తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంధర్భంగా రాష్ట్ర రైతులు, రైతు కూలీలు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో సాధించిన విజయమిది రైతుబంధు రైతుల పెట్టుబడి బాధలు తీర్చింది. రైతుభీమా రైతులలో ఆత్మస్థయిర్యం నింపింది24 గంటల ఉచిత కరంటు రైతులకు భరోసానిచ్చింది.సాగునీరు వారిలో నమ్మకాన్ని పెంచింది.ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం, మద్దతుధరకు 100 శాతం పంటలు కొనుగోలు చేయడం ఒక్క తెలంగాణకే సాధ్యమయింది.

ఐదేళ్లుగా రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు విజయవంతంగా అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది.రూ.65 వేల కోట్లు రైతుబంధు కింద జమచేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. రైతుభీమా కింద లక్ష మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం కేసీఆర్ ప్రభుత్వానికే సాధ్యమయింది.

ఏటా రూ.10,500 కోట్ల భారంతో ఉచిత విద్యుత్ అమలు.వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది.కాళేశ్వరం రైతుల తలరాత మార్చింది.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ రైతులకు ఉపకరిస్తుంది.పదేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం మారింది.

తెలంగాణ వ్యవసాయ అనుకూల పథకాలు అమలుచేయాలని అన్ని రాష్ట్రాల రైతులు డిమాండ్ చేస్తున్నారు.మహారాష్ట్రలో మార్పు మొదలయింది .. సమీపకాలంలో దేశమంతా ఇదే జరుగుతుంది.కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరం.

LEAVE A RESPONSE