– రాష్ట్రానికి మానవీయ కోణం ఉంది అంతరాలు లేని సమాజం నిర్మాణమే మా లక్ష్యం
– ప్రజలే కేంద్రంగా మా పాలన, ప్రజల ఆలోచన మా విధానం
– పిప్రిలో బహిరంగ సభ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన నా ఆలోచన కాదు, రూ.1238 కోట్ల పనులకు శంకుస్థాపన చేశాం
– బోత్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
బోత్ : పిప్రిలో బహిరంగ సభ నా ఆలోచన కాదు ముఖ్యమంత్రి ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తున్న క్రమంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అధికారుల ద్వారా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని సీఎం అన్నారు.
పిప్పిరి నుంచి ఖమ్మం వరకు మీరు నడుస్తూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఉంటారు. ప్రజలు చెప్పిన అనేక సమస్యలు విని ఉంటారు. వాటిని వెంటనే సాంక్షన్ చేసి అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మీరు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసి నిజం చేద్దాం, అదే నిజమైన ప్రజా పాలనాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.
ఈ భారీ బహిరంగ సభకు సీఎం కారణం. మండుటెండల్లో ఆనాడు నాతో నడిచి పాదయాత్రను విజయవంతం చేశారు. ఈరోజు 1238 కోట్ల విలువైన పనులు అన్నిటికీ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇది ఒక రాజకీయ సభ కాదు. ఆనాడు నేను ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం ఈ సభ అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం ఇది అని డిప్యూటీ సీఎం అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లోని యావత్ క్యాబినెట్ మేం పాలకులం కాదు సేవకులు అని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. అధికారం అంటే హోదా అని అధికారం అంటే పెత్తనం చేయడమే అనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి కి గాని డిప్యూటీ సీఎం గా నాకు కానీ మా క్యాబినెట్ సభ్యుల ఎవరికి ఆ ఆలోచన లేదు అన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే 99% హామీలు అమలు చేసిన గొప్ప ప్రభుత్వం మాది అన్నారు.
ఆనాడు మాతో గోడు వెళ్ళబోసుకున్న ఆడబిడ్డల మాటలను దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి రాగానే 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం ఒక్కో ఇంటిని 5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నాం. నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించి చిత్తశుద్ధిని చాటుకున్న ప్రభుత్వం తమది అని డిప్యూటీ సీఎం తెలిపారు.
రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో సభ చేశాం నిన్న కూడా ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి మానవీయ కోణం ఉంది. అంతరాలు లేని సమాజం నిర్మించాలన్న ఆలోచనతో ప్రపంచంతో మన బిడ్డలు పోటీపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేశారు. ఈరోజు ఒక్కరోజే మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు.
ఈ రాష్ట్రంలో పుట్టడం పెరగడం అదృష్టంగా ప్రజలు భావించాలి అన్న రీతిలో పరిపాలన సాగుతుంది. ప్రజలే కేంద్రంగా పాలన సాగాలి ప్రజల ఆలోచన మా విధానం ప్రజల ఆలోచన మా ఎజెండా అన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల చేత పరిపాలించబడాలి ఫ్యూడల్స్ ద్వారా కాదు అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు
సీఎల్పీ నేతగా తాను పిప్రి నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. ప్రజలకు చేరవేస్తున్నాం. పైసా పైసా పోగు చేస్తాం ప్రజలకే పంచుతాం అన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం అన్నారు.