Suryaa.co.in

Telangana

వీరోచిత పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం

-తెలంగాణలో 4 సార్లు జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రత్యేకత ఉంది
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
– మానకొండూరులో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలు

దేశవ్యాప్తంగా మువ్వన్నెల జాతీయ జెండాను ఏడాదికి రెండుసార్లు మాత్రమే ఎగురవేస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నాలుగుసార్లు ఇగురవేసే ఎగురవేసే సందర్భం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

శుక్రవారం మానకొండూరులో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన 15 ఆగస్టు నాడు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 జనవరి న జాతీయ జెండాలను దేశవ్యాప్తంగా ఎగురవేస్తారని కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతి ఏటా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున, హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో అంతర్భాగం అయిన సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ జెండాలను ఎగురవేసే సందర్భం ఉందని అన్నారు.

భూస్వాములు, నిజాములకు వ్యతిరేకంగా వీరోచితంగా చేసిన పోరాట ఫలితంగా హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో అంతర్భాగమైందని, ఆ రోజు సెప్టెంబర్ 17 తేదీ న వేడుకలు జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు.టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన 2001 సంవత్సరం నుంచి ప్రతి ఏటా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై జాతీయ జెండాను ఎగురవేస్తున్న విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు. భూస్వాములు, రాచరిక వ్యవస్థ, నిజాం రాజ్యం దాస్టికాలను వినోద్ కుమార్ సోదాహరణంగా వివరించారు.ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీ.వీ.ఆర్., స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE