Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైయస్సార్ పేరు చేర్చడం ఉన్మాద చర్య

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చి వైయస్సార్ పేరు చేర్చడం ఉన్మాద చర్య అని, ఈ ఘటనతో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని అవమాన పరిచారని పార్లమెంటు అధ్యక్షులు సాయిబాబా ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్ కట్టుకుని దీక్ష చేపట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడున్నర సం..కాలం మాత్రమే గడిచిందని, అతి తక్కువ కాలంలోనే ఉన్మాద చర్యలతో వైకాపా పార్టీ ప్రజల అభిమానాన్ని పోగొట్టుకుందని అన్నారు.

1986లో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసారని, 1998 నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించడం జరిగింది. అంబేద్కర్ విదేశీ విద్యకు పేరు మార్చి జగనన్న విదేశీ విద్యగా పేరు పెట్టడం వైకాపా పార్టీ పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారని, అలాగే కడప జిల్లాకు వైయస్సార్ జిల్లాగా నామకరణం చేశారని, అయినా తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు తెలుపకుండా పేర్లు మార్పు చేయకుండా ఉంచిదన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో స్విమ్స్, బర్డ్ హాస్పిటల్ స్థాపించారు, నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు, తెలుగుగంగా, కాలేరు హంద్రీనీవా, నగరి, ప్రారంభించారని తెలిపారు. హైదరాబాదులో బ్రహ్మానందరెడ్డి పార్క్ ఏర్పాటు చేసి, సంజీవరెడ్డి విగ్రహం2 పెట్టారని, దామోదర సంజీవయ్య పార్క్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఏర్పాటు చేశారని ఎక్కడ కూడా తప్పిదాలు జరగకుండా పాలన సాగించారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనతీరు వివరించారు. అలాంటి తెలుగు వైభవ ప్రతీక అయినటువంటి ఎన్టీఆర్ ను అవమానపరుస్తూ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్పు చేసేందుకు జగన్ ప్రభుత్వం పూనుకోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షమించరన్నారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలందరూ దేశ దేశాలలో జరుపుకుంటున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడడం క్షమించ రానిది. లక్ష్మి పార్వతి కూడా పదేపదే ఎన్టీఆర్ ఆత్మ తలుస్తూ ఆయనతోనే ఉన్నానని చెప్పుకుంటూ ఉంటారని, నేడు ఈ విషయంలో ఆమె నోరు మెదపక పోవడం బాధాకరమని అన్నారు. లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ పై నిజమైన అభిమానం ఉంటే తక్షణమే వైకాపా పార్టీకి రాజీనామా చేయాలని లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ చైర్మన్ పదవి నుండి వైదొలగాలని అన్నారు.

పతిదైవుడైన స్వర్గీయ ఎన్టిఆర్ కన్న ఆమెకు పదవే ముఖ్యం. తన రాజకీయ ప్రయోజనాల కోసం రక్త దాహానికైన సిద్దపడిన ఈమె మహిళా జాతికి మచ్చగా మిగిలారు. నేటి నుండి ఆమెకు ఎన్టీఆర్ సతీమణి అని చెప్పుకునే అర్హత లేదు. ప్రత్యర్థి పార్టికి చెందిన వైఎస్సార్ సిపి తెలంగాణ అధ్యక్షులు వైఎస్ షర్మిల గారికి ఉన్న పాటి సంస్కారం మీకు లేక పోవడం సిగ్గుచేటు. అడుగడుగున తన పాలనలో ప్రజా స్వామ్యన్ని పరిహాసం చేస్తూ స్వర్గీయ ఎన్టిఆర్ పేరు మార్చడం తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీయోద్దని, వెంటనే ఎన్టీఆర్ పేరును పునరుద్దరించి జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శి బాలరాజగౌడ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దోజు రవీంద్రాచారి, రాష్ట్ర కార్యదర్శులు నాగు నగేష్, అన్నపూర్ణ, శ్రీనివాస్ గౌడ్, జోగింధర్ సింగ్, రవి, యాదగిరి, అప్పు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE