– ఏర్పాట్లను పరిశీలించిన కిషన్‌రెడ్డి
హైదరాబాద్: కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం గోల్కొండ కోటలో ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పరిశీలించారు. చారిత్రాత్మక గోల్కొండ కోటలో తెలంగాణ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారందరూ ఈ వేడుకలు హాజరవుతారన్నారు.
మోడీ తొమ్మిదేళ్ళ పాలనకు సంభందించి పోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1200 ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పాటు అయ్యిందన్నారు. సుష్మ స్వరాజ్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమానికి బీజేపీ ముందుండి నడిచిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీలో నిరసన తెలుపుతుంటే జంతర్ మంతర్‌లో కాంగ్రెస్ పార్టీ తమపై రెండుసార్లు లాఠీ ఛార్జ్ చేసిందన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గత సంవత్సరం ఘనంగ నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు..