Suryaa.co.in

Telangana

రేవంత్ ను మళ్లీ జైలుకు పంపిస్తేనే తెలంగాణ పరుగులు

– ఎవరినడిగి మీరు ఫార్ములా-ఇ అగ్రిమెంట్ రద్దుచేశారు?
– మీరు ముందు నిపుణుల కమిటీ తో చర్చించారా?
– దీనిపై కేబినెట్ అనుమతి తీసుకున్నారా?
– ఈ కార్ రేస్ కేటీఆర్ ఎసిబి కేసుపై ఎక్స్ లో బీఆర్‌ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్

హైదరాబాద్: నేను రెండు సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ గా ఎన్నో ఆర్ధిక నేరాలను పరిశోధించాను. అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ మీద సీయం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబి నమోదు చేసిన FIR 14/2024 లోని అన్ని వివరాలను రెండు సార్లు లోతుగా పరిశీలించాను. ప్రపంచంలో ఇంత తుఫైల్ (worst) కేసు ఇంకొకటి ఉండదు.

గమ్మత్తేందంటే ప్రస్తుత పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చే ఇప్పించిన ఫిర్యాదు లో, ఎక్కడ కూడా సదరు 55 కోట్ల రూపాయల నుండి ‘ఒక్క పైసా’ కూడా ‘కేటీఆర్ జేబుల్లోకి’ వెళ్లినట్టు నిరూపించలేక పోయారు. పాపం ఆరు నెలలు శ్రమించారు కదా ! ప్రజలు మీకిచ్చిన విలువైన సమయాన్ని నీళ్ల పాలు చేశారు.

ఆ మాటకొస్తే అరవింద్ కుమార్ ఐఏఎస్ మరియు ఛీఫ్ ఇంజనీరు బీ ఎల్ ఎన్ రెడ్డి ల మీద కూడా అవినీతి జరిగినట్లు ఈ ఫిర్యాదు లో నిరూపించలేక పోయారు. మీరు చూపించగలిగిందంతా ప్రొసీజర్ వయోలేషన్స్ మాత్రమే. వీటికి శాఖా పరమైన ఎంక్వైరీ వేసి నిజమేందో తెలుసుకుంటే సరిపోయేది. అది ఇప్పటికే జరిగింది.

సచివాలయం లో ఇలాంటి ప్రోసీజర్ వయోలేషన్స్ ప్రతి డిపార్ట్మెంట్ లో రోజూ జరుగుతుంటయి. అట్ల చేయకపోతే అనుకున్న లక్ష్యం నెరవేరదు. ప్రజలు ఇబ్బంది పడతారు. ఇలాంటి వయోలేషన్స్ను తరువాత కేబినెట్ లో పెట్టి క్రమబద్ధీకరిస్తారు. వీటి మీద స్పష్టత లేని వాళ్లకు ప్రతీది వయోలేషన్ లాగానే కనిపిస్తది.

ఇందులో ఖర్చు పెట్టిన ₹ 55 కోట్లు రాష్ట్రంకు వందల కోట్ల రాబడి కోసమే పెట్టినం, మీకేమైనా అనుమానాలు ఉంటే అన్నీ అసెంబ్లీ సాక్షిగా నివృత్తి చేస్తా అని కేటీఆర్ అంటున్నా మొఖం చాటేసి పిరికిపందల్లా ఏసీబీకి ఫైలు అప్పగించారు.

అసలు ఈ విషయం లో ప్రభుత్వ ఖజానా కు ఏమైనా నష్టం జరిగిందంటే అది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్లనే. ఎవరినడిగి మీరు ఫార్ములా-ఇ అగ్రిమెంట్ రద్దుచేశారు? మీరు ముందు నిపుణుల కమిటీ తో చర్చించారా? దీనిపై కేబినెట్ అనుమతి తీసుకున్నారా? మీ వల్లే తెలంగాణకు వచ్చే వందల కోట్ల రాబడి ఆగిపోయింది. మన నగరానికొచ్చే ఫార్ములా రేసింగును పక్కన కర్నాటక తన్నుకు పోయింది.అసలు

ఈ ఫార్ములా -ఈ కేసు లో రేవంత్ రెడ్డి A-1 . కేటీఆర్ కాదు. ముమ్మాటికీ కాదు. అసలు నేడు తెలంగాణ ఖజానా ఖాళీ గా ఉండటానికి కారణం రేవంత్ రెడ్డి. ఆయన్ను మళ్లీ జైలుకు పంపిస్తేనే తెలంగాణ మళ్లీ పరుగులు పెడ్తది.

LEAVE A RESPONSE