-పాలిచ్చే ఆవును కాదనుకుని…తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు
– చంద్రబాబును ముసలోడు అంటూ వైసిపి సైకో బ్యాచ్ పిచ్చికూతలు
– జగన్ రెడ్డి ముసలోడిలా కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగలేకపోతున్నాడు
– కల్తీ మద్యం తయారుచేసి మహిళల తాళి బొట్లు తెంచుతున్నాడు
– ఏకంగా ఓ మహిళా మంత్రే మహిళల్ని కించపర్చేలా మాట్లాడుతోంది
– చంద్రబాబే మహిళలకు భద్రత కల్పించే నాయకుడు.
– చంద్రగిరి నియోజకవర్గం కాశిపెంట్లలో మహిళలతో ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు ఆస్తిలో హక్కు. మహిళలకు యూనివర్శిటీ. శాసనసభలో మహిళలకు అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే చంద్రబాబు డ్వాక్రా సంఘాలు తెచ్చారు. నేడు ప్రతి ఇంట్లో గ్యాస్ ఉందంటే దానికి కారణం చంద్రబాబే. 1999లో దీపం పథకం ద్వారా తీసుకొచ్చారు.
పండుగలకు కానుకలు కూడా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు. 2014లో పెన్షన్ రూ.200 ఉంటే దాన్ని రూ.2000 చేసింది చంద్రబాబు. పసుపుకుంకుమ, డ్వాక్రా రుణాలు మాఫీ, అభయహస్తం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం చేశారు. టీడీపీ పాలనలో ఏనాడూ ఇంత దారుణంగా నిత్యావసరాలు, గ్యాస్ ధరలు పెరగలేదు.
పాలిచ్చే ఆవును కాదనుకుని…తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు.చంద్రబాబును ముసలోడు అంటూ వైసిపి సైకో బ్యాచ్ పిచ్చికూతలు కూస్తోంది. జగన్ రెడ్డి ముసలోడిలా కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగలేకపోతున్నాడు.చంద్రబాబు యువకుడిలా 7కిలోమీటర్ల దూరాన్ని పోలీసుల నిర్బంధాలను చేదించుకొని సభకు హాజరై ప్రసంగించారు. 45సంవత్సరాలు నిండి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తానని జగన్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే తర్వాతి ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని జగన్ రెడ్డి చెప్పాడు.కానీ కల్తీ మద్యం తయారుచేసి మహిళల తాళి బొట్లు
తెంచుతున్నాడు. మహిళలను మోసం చేస్తున్నాడు.
ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసిన తర్వాత వైసీపీ నాయకులు బ్లాక్ లో మద్యం అమ్ముతున్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేశాడు.చట్టంలేని దిశ పోలీసు స్టేషన్లు తెచ్చి మహిళల్ని మోసం చేస్తున్నారు.దిశ చట్టం అమల్లో లేదని దిశ కేసులు కట్టడం లేదని పోలీసులు చెబుతున్నారు. గుంటూరు రమ్య హత్య, నరసారావుపేట ఘటన తర్వాత వారి కుటుంబాల పరామర్శకు వెళితే నన్ను అడ్డుకున్నారు.నాపై ఈ ప్రభుత్వం 20కేసులు పెట్టారు. అయినా ఎక్కడా తగ్గేదేలే. నేను ప్రజల కోసం, మహిళలకు అండగా నిలబడేందుకు పోరాడుతున్నా…ఇటువంటి కేసులకు వెనకడుగు వేయను. బాబు అంటేనే భద్రతకు నిదర్శనం. మహిళలకు రక్షణ బాబు పాలనతోనే సాధ్యం. పల్నాడులో ఓ మహిళపై అఘాయిత్యం జరిగితే ఆ నిందితుడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అది…చంద్రబాబు భద్రతకు నిలువెత్తు నిదర్శనం.
తాడేపల్లిలో రాజు అనే యువకుడు గంజాయి మత్తులో రాణి అనే యువతిని సీఎం ఇంటికి కిలోమీటర్ సమీపంలో దారుణంగా నరికి చంపేశాడు.జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యువతను గంజాయి మత్తులో మంచుతున్నాడు.చంద్రబాబు గంజాయి విషయంలో చాలా ఆందోళన పడుతున్నారు. దాన్ని అరికట్టే మార్గాలను అన్వేషిస్తున్నారు. వైసీపీ పాలనలో మహిళలకు భద్రత, గౌరవం లేకుండా పోయింది. ఏకంగా ఓ మహిళా మంత్రే మహిళల్ని కించపర్చేలా మాట్లాడుతోంది…మహిళలంటే గౌరవం లేని ప్రభుత్వం వైసీపీది. వైసీపీ పాలనలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయి. జగన్ రెడ్డి సీఎం అయ్యాక నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్, కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు, గ్యాస్, నూనెలు, ఇంటిపన్ను, చెత్తపన్ను, నీటిపన్నులు పెంచేశాడు.
మరోసారి విద్యుత్ బిల్లులు పెంచే యోచనలో జగన్ రెడ్డి సర్కార్ ఉంది.జగన్ రెడ్డి పాలనలో బాధలు పెరిగాయి…ఈ బాధలు పోవాలంటే…బాబు సీఎం కావాలి. సొంత తల్లి, చెల్లిని గౌరవించన వ్యక్తి రాష్ట్ర మహిళల్ని ఏం గౌరవిస్తారు?శాసనసభ సాక్షిగా నా తల్లిని అత్యంత దారుణంగా అవమానించారు. మా కుటుంబం చాలా క్రమశిక్షణతో మెలిగే కుటుంబం. నా తల్లి కోలుకునేందుకు నెలరోజులు పట్టింది. శాసనసభలోనే మహిళలకు గౌరవం లేదు. అందుకే రాష్ట్రంలో మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. తిరుమల దేవస్థానం ప్రాంగణంలోనే గంజాయి దొరుకుతోందంటే వైసీపీ పాలన ఏ విధంగా ఉందో ఆలోచించాలి. మహిళలకు ఉపాధి కల్పించేందుకు బాబుగారు కంపెనీలు తీసుకొస్తే వాటిని జగన్ రెడ్డి పక్క రాష్ట్రాలకు తరిమేశాడు. ప్రతి గడపలో ఓ నిరుద్యోగి ఉన్నాడు…ఇది పోవాలంటే బాబు సీఎం కావాలి. జగన్ రెడ్డిని చూస్తే జైల్ గుర్తుకొచ్చి…మన రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు రావడం లేదు.
అమర్ రాజాను పక్క రాష్ట్రానికి తరిమేయడంతో అక్కడ 20వేల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారు.నేడు పరిశ్రమలశాఖ మంత్రికి పరిశ్రమలంటే కోడి, గుడ్డు తప్ప మరేం తెలియదని చెబుతున్నాడు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనే యువగళం పాదయాత్ర ప్రారంభించాను. మీరు ఆందోళన పడొద్దు…రానున్న రోజుల్లో బాబుగారే సీఎం అవుతారు…మీ భద్రత మా బాధ్యత. రేషన్ కార్డు సమస్యలు, పంచాయతీలు పక్క గ్రామాలకు తరలింపు, భూ కబ్జాలు, అక్రమ దందాలు అన్నిటిపై మనం అధికారంలోకి వచ్చాక ఉక్కుపాదంతో అణిచివేస్తాం. టెక్నాలజీని మీ కాళ్ల దగ్గరకు తెస్తాం…ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరించడానికి మీ చుట్టూ తిరిగేలా చేస్తాం.
సంక్షేమ పథకాలన్నీ మీ మొబైల్ నుండే దరఖాస్తు చేసుకుని, ఎటువంటి పైరవీలకు తావులేకుండా వాటిని పొందే విధానాన్ని తెస్తాం. డీకేటీ భూములను రెగ్యులర్ చేయడానికి అవసరమైన చట్టం కర్నాటకలో అమల్లో ఉంది. దాన్ని మేం అధ్యయనం చేస్తున్నాం. త్వరలోనే మీకు మ్యానిఫెస్టో ద్వారా శుభవార్తను అందిస్తాం. ఓటీఎస్ పేరుతో రూ.10వేలు దోచుకుని…పనికిరాని పట్టాలు ఇచ్చి మోసం చేశారు. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ బాధ్యతను తెలుగుదేశం తీసుకుంటుంది.మీ రిజర్వేషన్ పార్లమెంటులో పెండింగ్ లో ఉంది. దానిపై మన ఎంపీలు పోరాడుతున్నారు. మీకు రిజర్వేషన్ వర్తించే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని హామీ ఇస్తున్నాం.
ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే అనేక విధాలుగా వైసీపీ వేధిస్తోంది. శ్రీకాళహస్తిలో ఓ రజక మహిళ తన సమస్యను నాకు విన్నవించుకుంది. సదరు మహిళకు సంబంధించిన వ్యాపారాన్ని ధ్వంసం చేశారు.అక్కడి ఎమ్మెల్యే తన కాళ్లు పట్టుకుంటే వదిలేస్తానని ఆ మహిళను బెదిరిస్తున్నాడు. దిశచట్టం ఏం పీకుతోంది? మహిళలు భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కరు, ఇద్దరు, వేలు, లక్షలు, కోటి మంది మహిళలు ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం ఏం పీకుతుంది? మీరు పోరాడండి …మీకు తోడుగా మేముంటాం. రేషన్ షాపు డీలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం…మీ సమస్యల్ని పరిష్కరించే విధంగా మనం అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాం.
గతంలో అమలైన సంక్షేమ పాలనను మళ్లీ తీసుకొస్తాం….మీరంతా ధైర్యంగా ఉండండి.మన హక్కుల కోసం పోరాడండి…మీ పోరాటానికి యువగళం వేదికగా నిలుస్తుంది…అండగా నిలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళల్లో చైతన్యం నింపేందుకే ఈ యువగళం ప్రారంభించాను…అన్ని విధాలుగా నేను మహిళలకు అండగా ఉంటాను. మీ జోలికి వైకాపా కుక్కలు వస్తే నాకు చెప్పండి….ఆ కుక్కల తోలు తీస్తాం. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే…వాళ్లను చెప్పులతో కొట్టండి… మీకు అండగా మేం నిలబడతాం.నాడు-నేడు-ఎప్పుడూ….చంద్రబాబే మహిళలకు భద్రత కల్పించే నాయకుడు. మోసకారి హామీలతో నట్టేట ముంచిన జగన్ రెడ్డిని తరిమికొట్టండి.