– నారా భువనేశ్వరి ఆశాభావం
హైదరాబాద్ : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం పూర్వ వైభవాన్ని చూస్తామని, ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన మెజార్టీ లాగానే తెలంగాణలో కూడా తెలుగుదేశం రాబోతుందని నారా భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టిటిడిపి రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్, మరియు పాదయాత్రలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని కలిశారు.
రెండు రోజుల క్రితం ఇబ్రహీంపట్నం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వరకు 70 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన టిటిడిపి రాష్ట్ర కార్యదర్శి రవీందర్, అతనితో పాటు పాదయాత్ర చేసిన 17 మందిని నారా భువనేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కని నరసింహులు, రాష్ట్ర నాయకులు ఇతరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రష్టి శ్రీమతి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ కు విచ్చేయడంతో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, రాష్ట్ర పార్టీ నాయకులు భువనేశ్వరి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడంలో భువనేశ్వరి పాత్ర కీలకమైనదని తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు.