- వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను అతి కిరాతకంగా వేధించారు
- ప్రతి కార్యకర్తకు తెలుగుదేశంపార్టీ అండగా నిలుస్తుంది
- కూటమి పాలనలో రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది
- గుడ్లనాయనపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి
కుప్పం: ప్రజల ఉత్సాహం, గౌరవం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీకోసం మీరు కేటాయించే సమయాన్ని చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది. దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు 2024 ఎన్నికల్లో మహిళలు నడుం బిగించారు..ఆ స్ఫూర్తి నేడు స్పష్టంగా కనిపిస్తోంది.
చంద్రబాబుపై మీరు పెట్టుకున్న నమ్మకం, అభిమానం, గౌరవానికి మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది. మీరు నమ్ముకున్న నాయకుడు చంద్రబాబును మీరు వరుసగా 8సార్లు కుప్పం నుండి ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వచ్చారు…4సార్లు ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఈ ఘనత మొత్తం కుప్పం ప్రజలకే దక్కుతుంది.
చంద్రబాబును 53రోజులు వైసీపీ ప్రభుత్వం జైల్లో నిర్బంధిస్తే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రోడ్లమీదకు వచ్చి పోరాడారు… గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా చంద్రబాబుకోసం ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. తెలుగు ప్రజల రుణం తీర్చుకోలేనిది…మీరు మా కుటుంబంపై చూపించే ప్రేమకు మేం ఏమిచ్చినా రుణం తీరదు.
చంద్రబాబు తన చివరి నిమిషం వరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నారు. కుప్పం ప్రజలంటే చంద్రబాబుకు అమితమైన ప్రేమ.కుప్పం నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నికల సమయంలో ప్రత్యేక మ్యానిఫెస్టోను ప్రకటించారు. రానున్న కాలంలో కుప్పం నియోజకవర్గానికి ఇచ్చిన ప్రత్యేక మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తారు.
ఇప్పటికే కుప్పం ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయాన్ని తెచ్చేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు..ఇక్కడితో ఆగకుండా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారు.
చంద్రబాబు మహిళా పక్షపాతి…అందుకే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను అందించారు..జగన్ సీఎం అయ్యాక మహిళలకు ఆ పథకాలన్నింటినీ రద్దు చేసి వేధించాడు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో టీడీపీ కార్యకర్తలను అతి కిరాతకంగా వేధించారు…అక్రమ కేసులు బనాయించారు. ఒక్కొక్కరిపై 10 నుండి 30 కేసులు బనాయించి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు.
పార్టీని నిలబెట్టేందుకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశంపార్టీ నిత్యం అండగా నిలుస్తుంది. కూటమి పాలనలో రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు.