– ప్రజాహితం గా పనిచేసే వారికి మా మద్దతు
– తెలంగాణ రాష్ట్ర పార్టీ సమన్వయక కర్త కంభంపాటి రామమోహన్ రావు
ఇటీవల జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. జాతీయ నాయకత్వం తటస్థంగా ఉండాలని రాష్ట్రపార్టీకి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.ఎన్నికలు జరినప్పుడు గతంలో కూడా పార్టీలు ఇలాగే పోటీ చేయని దాఖలాలు కూడా ఉన్నాయి. మాకున్న పరిస్థితులలో మేము ఎన్నికలలో పాల్గొనలేదు. ఎన్నికలలో పాల్గొననప్పడికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది హైదరాబాద్ నగరంలోనే. 1982లో స్వర్గీయ నందమూరి తారాక రామారావు గారు తెలుగుదేశంపార్టీని ప్రారంభించినప్పుడు ఆరోజు నుంచి ఇప్పటి దాకా కూడా వారి ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు , అదే విధంగా నారా లోకేష్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.
ఈ రోజు ముఖ్యంగా పార్టీ ముఖ్యనాయకులు అందరూ కూర్చొని తెలంగాణ తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలంటే, జాతీయ అధ్యక్షుల వారితో సమావేశం అయిన తరువాత ముఖ్యనాయకు లందరూ కూర్చొని పార్టీని ముందుకు తీసుకెళ్ధామనే నిర్ణయం ఈ రోజు జరిగిన సమావేశంలో తీసుకోవడం జరిగింది.
అందులో భాగంగానే మేము ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలు గాని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కనబడుతున్నది. వీటిని ప్రజలకు మరోకసారి వివరించి పార్టీని బలోపేతం చేసుకోవడానికి అది దోహదపడుతుందని భావిస్తూ.. ఆ విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు పార్టీ ముఖ్యనాయకులు కలిసి వారి అభిప్రాయాలను తెలియజేప్పిన తరువాత జాతీయ పార్టీ అధ్యక్షులు సూచనల ప్రకారం ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనులు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో క్షేత్ర స్థాయిలో పార్టీని పునర్ నిర్మించి బలోపేతం చేయాలంటే ఏమి చేయాలో, పార్టీ ముఖ్యనాయకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ రోజు సుధీర్ఘ సమావేశంను జరపడం జరిగింది. మా అభిప్రాయాలను వివరించడం జరిగింది. ఈ అభిప్రాయాలను క్రోడీకరించి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది.
అన్నింటినీ క్రోడీకరించుకొని నూతన ఉద్దేజంతో భవిష్యత్తుకు బాటలు వేస్తాం. తెలంగాణ గడ్డపై టీడీపీని ఖచ్చితంగా రెపరెపలాడిరచడం కోసం అందరం పనిచేయాలని మూకుమ్మడిగా తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది.
టి. జ్యోత్స్న, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి
తెలుగుదేశం పార్టీ అనుక్షణం ప్రజాపక్షంగానే ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజాహితంగా పనిచేసే వారికి మా మద్దతు ఉంటుంది. ఒక వేళ ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు ఎవరు చేసినా ఖచ్చింతంగా టీడీపీ ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. మా పార్టీ జెండా, ఎజెండా ప్రజలే. ప్రజల కోసమే మేము పుట్టాం.. ప్రజల కోసమే మేము కొనసాగుతున్నాం. రాబోయే రోజులలో కూడా ప్రజల కోసమే మా పనితనం ఉంటుంది.
సామా భూపాల్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు
తెలుగుదేశం పార్టీలో ఉన్న నిఖార్సయిన నాయకులందరం అతికష్ట కాలంలో కూడా కన్నీరు మున్నీరై మా పార్టీ పోటీ చేయలేకపోయేనని బాధలో ఉన్నప్పటికీ భవిష్యత్ టీడీపీకి ఉంటుంది. రాబోయే తరాలకు టీడీపీ ఆదర్శంగా ఉంటుందన్న సందేశాన్ని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు చెప్పారని తెలంగాణ రాష్ట్ర పార్టీ సమన్వయ కర్త కంభంపాటి రామమోహన్ రావు గారు చెప్పడంతో ఈ రోజు నాయకులు చాలా సంతోషాన్ని వ్యక్త పర్చారు. రాబోయే ఏ ఎన్నికలలో నైనా పోటీకి మేము సైతం అనే రీతిలో పనిచేస్తామని ముక్తకంఠంతో ఏక గ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. నిర్ణయాత్మక శక్తిగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది.
ఈ సమావేశంలో జాతీయ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అజ్మీర రాజునాయక్, అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గా ప్రసాద్, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు గుళ్లపల్లి ఆనంద్ పాల్గొన్నారు.